భక్తుడిపై చేయి చేసుకున్న దుర్గగుడి సెక్యూరిటీ సిబ్బంది

Date:


Andhra Pradesh

oi-Lingareddy Gajjala

విజయవాడ
ఇంద్రకీలాద్రిపై
కొలువుదీరిన
దుర్గమ్మకు
ప్రశాంతత
కరువైందా
అంటే
అవుననే
చెప్పక
తప్పదు
జరుగుతున్న
పరిస్థితులు
చూస్తే..
రోజుకో
వివాదంతో
ఆలయ
ప్రతిష్ఠ
మసకబారుతోందని
భక్తులు
ఆవేదన
వ్యక్తం
చేస్తున్నారు.
ఇటీవల
వరుసగా
జరుగుతున్న
పరిణామాలు
చూస్తే

ఎవరైనా
సరే
అసహనం
వ్యక్తం
చేయాల్సిందే.
తాజాగా
కనకదుర్గమ్మ
ఆలయం
మరోసారి
వివాదాల్లో
నిలిచింది.
భక్తుడిపై
చేయి
చేసుకున్న
దుర్గగుడి
సెక్యూరిటీ
సిబ్బంది
వీడియో
వైరల్
గా
మారడంతో
మళ్లీ
వివాదం
మొదలైంది.

భక్తుల
రద్దీ
నిత్యం
ఉండే
దుర్గగుడిలో
ఈసారి
కారు
పార్కింగ్
అంశమే
వివాదానికి
దారితీసింది.
టోల్
రుసుము
వసూలు
చేసే
సమయంలో
భక్తుడికి,
ప్రైవేట్
సెక్యూరిటీ
సిబ్బందికి
మధ్య
జరిగిన
వాగ్వాదం
చివరకు
భక్తుడిపై
చేయి
చేసుకునే
స్థాయికి
చేరడం
తీవ్ర
విమర్శలకు
కారణమవుతోంది.

కనకదుర్గ
నగర్
ప్రవేశ
ద్వారం
వద్ద
ఉన్న
కార్
పార్కింగ్
పాయింట్‌లో
ఫోర్
వీలర్
టోల్
చెల్లింపుపై
భక్తుడితో
టోల్
కాంట్రాక్టర్
సిబ్బందికి
మాటా
మాటా
పెరిగింది.

వాగ్వాదంలో
జోక్యం
చేసుకున్న
దుర్గగుడి
ప్రైవేట్
సెక్యూరిటీ
సిబ్బంది
విచక్షణ
కోల్పోయి
భక్తుడిపై
చేయి
చేసుకున్నారని
ప్రత్యక్ష
సాక్షులు
ఆరోపిస్తున్నారు.

ఘటనకు
సంబంధించిన
వీడియోలు
సోషల్
మీడియా,
కొన్ని
ఎలక్ట్రానిక్
ఛానళ్లలో
వైరల్
కావడంతో
భక్తుల్లో
తీవ్ర
ఆగ్రహం
వ్యక్తమవుతోంది.


ఆలయ
అధికారుల
వివరణ..


ఘటనపై
దుర్గగుడి
దేవస్థానం
అధికారికంగా
స్పందించింది.
ఆలయ
పాలక
మండలి
విడుదల
చేసిన
ప్రకటనలో,
ఇది
కొద్దిరోజుల
క్రితం
జరిగిన
చిన్నపాటి
ఘటన
అని,
అప్పట్లో
అక్కడే
ఉన్న
‘అజైల్’
ప్రైవేట్
సెక్యూరిటీ
సూపర్‌వైజర్లు
బాలకృష్ణ,
కాశీలు
వెంటనే
స్పందించి
ఇరువర్గాలను
శాంతింపజేశారని
పేర్కొంది.

సమయంలో
సమస్య
సామరస్యంగా
పరిష్కారమైందని,
భక్తులు
గానీ,
టోల్
కాంట్రాక్టర్
గానీ
ఎలాంటి
ఫిర్యాదులు
నమోదు
చేయలేదని
దేవస్థానం
స్పష్టం
చేసింది.


సంయమనం
పాటించాలి…

అయితే,
పాత
ఘటనకు
సంబంధించిన
దృశ్యాలు
ప్రస్తుతం
మళ్లీ
ప్రచారంలోకి
రావడం
వల్ల
భక్తుల
మనోభావాలు
దెబ్బతినే
అవకాశం
ఉందని
ఆలయ
అధికారులు
ఆందోళన
వ్యక్తం
చేశారు.
అమ్మవారి
దర్శనానికి
దూరప్రాంతాల
నుంచి
వచ్చే
భక్తుల్లో
భయం,
అపోహలు
కలగకుండా
సంయమనం
పాటించాలని
విజ్ఞప్తి
చేశారు.
ఆలయ
పవిత్రత,
ప్రశాంత
వాతావరణాన్ని
కాపాడటంలో
మీడియా
సహకరించాలని
కోరారు.
భక్తుల
భద్రత,
సౌకర్యాల
విషయంలో
దేవస్థానం
ఎల్లప్పుడూ
అప్రమత్తంగానే
ఉంటుందని
హామీ
ఇచ్చారు.


వరుస
సంఘటనలు..

అయితే,

వివరణలు
ఇచ్చినప్పటికీ
దుర్గగుడిలో
వరుసగా
జరుగుతున్న
వివాదాలు
భక్తుల్లో
అసంతృప్తిని
పెంచుతున్నాయి.
గతంలో
టెంపుల్
అధికారులకు,
విద్యుత్
శాఖకు
మధ్య
సమన్వయ
లోపంతో
ఆలయంలో
అకస్మాత్తుగా
జరిగిన
పవర్
కట్
ఘటన
తీవ్ర
విమర్శలకు
దారితీసింది.
దర్శన
సమయంలో
విద్యుత్
సరఫరా
నిలిచిపోవడంతో
భక్తులు
తీవ్ర
ఇబ్బందులు
ఎదుర్కొన్నారు.
అలాగే
శ్రీ
చక్ర
నవావర్ణార్చన
సమయంలో
అభిషేకానికి
వినియోగించిన
పాలలో
పురుగులు
కనిపించడం
పెద్ద
దుమారం
రేపాయి.


అధికారుల
పర్యవేక్షణ
తక్కువైందా?..

ఇలాంటి
ఘటనలు
ఒకదాని
తర్వాత
ఒకటి
జరగడంతో,
“ఇంద్రకీలాద్రిలో
భక్తుల
సౌకర్యాలు,
భద్రతపై
అధికారుల
పర్యవేక్షణ
తక్కువైందా?”
అన్న
ప్రశ్నలు
తెరపైకి
వస్తున్నాయి.
ముఖ్యంగా
ప్రైవేట్
సెక్యూరిటీ
సిబ్బంది
వ్యవహార
శైలిపై
కఠిన
చర్యలు
తీసుకోవాలన్న
డిమాండ్
భక్తుల
నుంచి
వినిపిస్తోంది.
ఆలయానికి
వచ్చే
భక్తులతో
మర్యాదగా
వ్యవహరించాల్సిన
అవసరం
ఉందని,
చిన్నపాటి
అంశాలే
పెద్ద
వివాదాలుగా
మారకుండా
ముందస్తు
చర్యలు
తీసుకోవాలని
పలువురు
సూచిస్తున్నారు.

మొత్తానికి,
కనకదుర్గమ్మ
ఆలయం
వంటి
అత్యంత
పవిత్ర
క్షేత్రంలో
వరుస
వివాదాలు
చోటు
చేసుకోవడం
దేవస్థాన
ప్రతిష్ఠకే
కాకుండా
భక్తుల
విశ్వాసానికి
కూడా
సవాల్‌గా
మారుతోంది.
అధికారులు

ఘటనలను
హెచ్చరికగా
తీసుకుని,
భక్తుల
భద్రత,
సౌకర్యాలు,
ఆలయ
గౌరవాన్ని
కాపాడేలా
కఠిన
నిర్ణయాలు
తీసుకోవాల్సిన
అవసరం
ఉందన్న
అభిప్రాయం
వ్యక్తమవుతోంది.





Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related