Andhra Pradesh
oi-Bomma Shivakumar
ఏపీ
డిప్యూటీ
సీఎం
పవన్
కల్యాణ్
మార్షల్
ఆర్ట్స్
లో
సాధించిన
అంతర్జాతీయ
గుర్తింపు
పై
భారత
ప్రధాని
నరేంద్ర
మోదీ
ప్రశంసల
జల్లు
కురిపించారు.
ఈ
మేరకు
పవన్
కల్యాణ్
కు
ప్రధాని
మోదీ
అభినందనలు
తెలిపారు.
జపనీస్
కత్తి
సాము
అయిన
కెంజుట్సులో
ప్రవేశం
పొందడంపై
పవన్
ను
ప్రధాని
మోదీ
ప్రశంసించారు.
సినిమా,
రాజకీయాలు
వంటి
బిజీ
లైఫ్
లోనూ
ఎంతో
కఠినమైన
ఈ
మార్షల్
ఆర్ట్స్
ను
పవన్
కల్యాణ్
అభ్యసించడం
పవన్
కల్యాణ్
నిబద్ధతకు
నిదర్శనం
అని
ప్రశంసించారు.
ఏపీ
ఉపముఖ్యమంత్రి,
నటుడు
పవన్
కల్యాణ్
కు
ప్రధాని
మోదీ
అభినందనలు
తెలిపారు.
ప్రాచీన
జపనీస్
కత్తిసాము
అయిన
కెంజుట్సులో
పవన్
కల్యాణ్
ప్రవేశం
పొందడంపై
అరుదైన
ఘనత
సాధించారని
ప్రధాని
మోదీ
ప్రశంసించారు.
పవన్
కల్యాణ్
విజయం
యువతరానికి
ఒక
గొప్ప
సందేశాన్ని
ఇస్తోందని
ప్రధాని
పేర్కొన్నారు.
కొత్త
కొత్త
విషయాలు
నేర్చుకోవడానికి
ఏదీ
అడ్డంకి
కాదని
పవన్
కల్యాణ్
నిరూపించారని
ప్రధాని
మోదీ
అభినందించారు.
“జపనీస్
మార్షల్
ఆర్ట్స్
లో
మీ
విజయం
స్ఫూర్తిదాయకం.
దశాబ్దాలపాటు
సాధనతో
యువతకు
మీరు
అద్భుతమైన
సందేశం
ఇచ్చారు.
మీరు
ఫిట్
ఇండియా
కార్యక్రమాలకు
స్ఫూర్తిని
ఇవ్వాల్సిన
అవసరం
ఉంది”
అని
ప్రధాని
మోదీ
స్పష్టం
చేశారు.
ఇక
ప్రధాని
మోదీ
ఆత్మీయ
సందేశం
పట్ల
పవన్
కల్యాణ్
స్పందిస్తూ
హృదయపూర్వక
కృతజ్ఞతలు
తెలిపారు.
ప్రధాని
పంపిన
లేఖ
తనకు
దక్కిన
గొప్ప
గౌరవమని,
ఇది
తనలో
మరింత
ప్రోత్సాహాన్ని
నింపిందని
స్పష్టం
చేశారు.
ఇలాంటి
యుద్ధ
కలలు
తనకు
ఒత్తిడిని
తట్టుకునే
శక్తిని,
ఏకాగ్రతను
ఇచ్చాయని
వివరించారు.
ప్రజారోగ్య
పరిరక్షణ
కోసం
ప్రధాని
తీసుకువచ్చిన
ఫిట్
ఇండియా
కార్యక్రమం
ఆయన
దూరదృష్టికి
నిదర్శనమని
పవన్
తెలిపారు.
ఇక
జపాన్
వెలుపల
గుర్తింపు
పొందిన
అతికొద్ది
మంది
భారతీయుల్లో
పవన్
ఒకరిగా
నిలిచారు.
ఈ
మేరకు
పవన్
కల్యాణ్
ను
‘టైగర్
ఆఫ్
మార్షల్
ఆర్ట్స్’
అనే
విశిష్టమైన
పురస్కారంతో
సత్కరించింది.


