అమరావతి మాస్టర్ ప్లాన్ విస్తరణ- కొత్త హద్దులు, కీలక నిర్ణయాలు..!!

Date:


Andhra Pradesh

oi-Sai Chaitanya

అమరావతి
కేంద్రంగా
కీలక
నిర్ణయాలు
జరుగుతున్నాయి.
రెండో
విడత
భూ
సమీకరణ
సమయం
లోనే
సీఆర్డీఏ
కొత్త
ప్రణాళికలు
అమలు
చేస్తోంది.
షెడ్యూల్
ప్రకారం
నిర్మాణాల
ప్రక్రియను
పూర్తి
చేసేందుకు
కసరత్తు
కొనసాగుతోంది.
ఇదే
సమయంలో
రాజధాని
మాస్టర్
ప్లాన్
విస్తరణ
దిశగానూ
ఆలోచన
జరుగుతోంది.
లాండ్
పూలింగ్
విస్తీర్ణం
పెరగటంతో…
దీనికి
అనుగుణంగా
మాస్టర్
ప్లాన్
లో
అవసరమని
గుర్తించారు.
దీంతో,
కొత్త
హద్దులు
ఖరారు
చేస్తూ
మాస్టర్
ప్లాన్
విస్తరణ
కోసం
సీఆర్డీఏ
ప్రతిపాదనలు
సిద్దం
చేస్తోందని
సమాచారం.

అమరావతిలో
రెండో
విడత
లాండ్
పూలింగ్
ప్రక్రియ
కొనసాగుతోంది.
ఇందుకు
అనుగుణంగా
సీఆర్డీఏ
రాజధానికి
కొత్త
హద్దుల
మేరకు
మాస్టర్
ప్లాన్
విస్తరణకు
నిర్ణయించారని
సమాచారం.

మేరకు
తుది
కసరత్తు
చేస్తున్నారు.
రెండో
విడత
భూ
సమీకరణ
ప్రక్రియ
ముగిసిన
తరువాత
మాస్టర్
ప్లాన్
విస్తరణకు
సంబంధించిన
ప్రక్రియ
ప్రారంభించనున్నారు.
189
కిలోమీటర్ల
పొడవైన
అమరావతి
ఔటర్‌
రింగురోడ్డుకు
ఇప్పటికే
గెజిట్‌
విడుదల
చేసిన
సంగతి
తెలిసిందే.
దీనికితోడు
ఇన్నర్‌
రింగురోడ్డు
నిర్మాణమూ
చేపట్టనున్నారు.
అయితే
ప్రస్తుతం
ఉన్న
మాస్టర్‌
ప్లానును
విస్తరించాలనే
ఆలోచనలో
ఉన్నట్లు
ఇటీవల
మంత్రి
నారాయణ
వెల్లడించారు.
ప్రస్తుతం
ఉన్న
రోడ్లను
రెండోదశ
పూలింగు
ప్రాంతానికి
విస్తరించనున్నామని,
వీటిని
ఔటర్‌
రింగుకు
అన్నివైపులా
కలిపేలా
ప్లానింగు
ఉందని
వెల్లడించారు.

తాజా
ప్రతిపాదనల
మేరకు
తూర్పున
16వ
నెంబరు
జాతీయ
రహదారి
హద్దుగా
దక్షిణం,
పడమర
ప్రాంతంలో
ఔటర్‌
రింగురోడ్డు,
ఉత్తరాన
కృష్ణానది
ప్రాంతం
మధ్యలో
పూర్తిగా
ప్లానింగు
ఏర్పాటు
చేస్తామని
మంత్రి
వెల్లడించారు.
దాదాపుగా
సిఆర్‌డిఏ
రీజియన్‌
ప్రాంతం
మొత్తం
సమగ్ర
ప్లానింగు
పరిధిలోకి
వస్తుంది.
ప్రస్తుతం
సిఆర్‌డిఏ
ప్రాంతం
సుమారు
8352
చదరపు
కిలోమీటర్ల
విస్తీర్ణంలో
ఉంది.
అంటే
సుమారుగా
20.88
లక్షల
ఎకరాలకు
విస్తరించి
ఉంది.
దీనిలో
కనీసం
మూడు
లక్షల
ఎకరాల
పరిధిలోకి
రాజధాని
ప్లానింగు
ఏరియా
పెరుగుతుందనేది
అంచనాగా
వేస్తున్నారు.
ప్రస్తుతం
16వ
నెంబరు
జాతీయ
రహదారికి
ఈ3,
ఈ5
రోడ్లను
కలపనున్నారు.
ఈ3
రోడ్డును
రెండోదశ
ల్యాండ్‌
పూలింగు
పరిధి
వరకు
తీసుకెళ్లే
విధంగ
ఆలోచన
చేస్తున్నారు.
సమీకరణ
ప్రాంతంలో
రోడ్‌
కనెక్టివిటీ
పూర్తి
చేసిన
తరువాత
అభివృద్ధి
కార్యక్రమాలు
నిర్వహించనున్నారు.
పనిలో
పనిగా
మొత్తం
ఔటర్‌రింగురోడ్డుకూ
అనుసంధానం
చేయాలని
భావిస్తున్నారు.

కాగా,
ఇన్నర్‌
రింగురోడ్డు,
ఔటర్‌
రింగురోడ్డుకు
మధ్యలో
అభివృద్ధికి
అవసరమైన
ప్లానింగు
చేయాలని
తొలి
మాస్టర్
ప్లాన్
ఖరారు
వేళ
నిర్ణయించారు.
రాజధాని
చుట్టుపక్కల
ఏడు
ప్రాంతాల
ను
పారిశ్రామిక,
వాణిజ్య
కేంద్రాలుగా
గుర్తించారు.
రింగురోడ్లను
కూడా
వాటిని
దృష్టిలో
పెట్టుకునే
ప్లాను
చేశారు.
గుడివాడ,
గుంటూరు,
తెనాలి,
సత్తెనపల్లి,
కంచికచర్ల,
కంకిపాడు,
ఉయ్యూరు
పరిసరాల్లో
ప్రత్యేక
అభివృద్ధి
కేంద్రాలనూ
ఏర్పాటు
చేయాలనేది
అప్పటి
ప్రతిపాదన.
ఎలక్ట్రానిక్‌
ఉత్పత్తుల
కేంద్రంగా
గుడివాడ,
ఆహ్లాద,
పర్యాటక
ప్రాంతంగా
తెనాలి,
లాజిస్టిక్‌
కేంద్రంగా
గన్నవరం
ప్రాంతాలను
అప్పట్లో
ప్రతిపాదించారు.
ప్రస్తుతం
మాస్టర్‌ప్లాను
రూపొందించాలనే
మంత్రి
ప్రకటన
నేపథ్యంలో
ఇప్పుడు
కొత్తగా
ఎలాంటి
ప్రతిపాదనలు
చేస్తారనేది
ఆసక్తి
కరంగా
మారుతోంది.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Grammy Awards 2026: Taylor Swift Not Attending

"I am a Grammy nominated artist," Sombr (real name...

U.S. government may shut down early Saturday over DHS funding. What to expect

A view of the snow covered streets as heavy...

Charli xcx & Kylie Jenner Star in ‘Residue’ Video for ‘The Moment’

Charli xcx just can’t let the moment pass in...