ట్రంప్ వి ఉత్తుత్తి బెదిరింపులేనా ? ఇరాన్ పై దాడి అసాధ్యమేనా..!

Date:


International

oi-Syed Ahmed

గతేడాది
ఇరాన్
పై
ఇజ్రాయెల్
దాడి
తర్వాత
ఇరు
దేశాల
మధ్య
రెండు
వారాల
పాటు
యుద్దం
సాగింది.
ఇందులో
ఇజ్రాయెల్
కు
మద్దతుగా
బరిలోకి
దిగిన
అమెరికా
చేతులు
కాల్చుకుంది.
దీనికి
ప్రధాన
కారణం
గల్ఫ్
ప్రాంతంలో
ఉన్న
అమెరికా
మిత్రదేశాలు
సైతం
ఇరాన్
పై
దాడికి
ట్రంప్
కు
సహకరించకపోవడమే.
దీంతో
ఇజ్రాయెల్
-అమెరికా
ఇద్దరూ
కాల్పుల
విరమణ
పేరుతో
తోకముడచాల్సిన
పరిస్ధితి
ఎదురైంది.
దీంతో
ఇరాన్
పై
అంతర్గత
కలహాలు
రేపి
మళ్లీ
దాడికి
దిగాలని
ట్రంప్
భావించారు.

ఇందులో
భాగంగా
తాజాగా
ఇరాన్
లో
ఉన్న
ఖమేనీ
ప్రభుత్వంపై
దేశవ్యాప్తంగా
పలు
చోట్ల
నిరసనలు
ప్రారంభమయ్యాయి.
ఎప్పుడో
దశాబ్దాల
క్రితం
ఇరాన్
లో
ఇస్లామిక్
విప్లవం
నేపథ్యంలో
దేశాన్ని
వీడి
అజ్ఠాతంలో
ఉంటున్న
షాల
వారసుడు
పహ్లావీ
తెరపైకి
రావడమే
కాకుండా
నిరసనకారుల్ని
ఎగదోయడం
ప్రారంభించారు.
ఇదే
అదనుగా
ట్రంప్
కూడా
రంగంలోకి
దిగి
ఇరాన్
పై
దాడి
చేస్తామంటూ
బెదిరించడం
మొదలుపెట్టారు.

ఓవైపు
నిరసనల్ని
ఉక్కుపాదంతో
అణచివేస్తున్న
ఖమేనీ
ప్రభుత్వానికి
కూలదోస్తామంటూ
ట్రంప్
రోజూ
బెదిరిస్తున్నారు.
తాజాగా
వెనెజులా
అధ్యక్షుడు
మదురోను
వారి
స్వదేశంలోనే
అరెస్టు
చేసి
ఎత్తుకొచ్చిన
ఊపులో
ఉన్న
ట్రంప్
అదే
క్రమంలో
ఇరాన్
లోనూ
అలాంటి
పరిణామాన్ని
రిపీట్
చేస్తారన్న
ఆందోళన
వ్యక్తమవుతోంది.

నేపథ్యంలో
అసలు
ఇరాన్
పై
అమెరికా
దాడికి
దిగుతుందా
లేదా
అన్న
చర్చ
మొదలైంది.
ఎందుకంటే
ఇప్పటికే
గల్ఫ్
జలాల్లో
అమెరికా
ఎలాంటి
యుద్ధ
నౌకలూ
మోహరించలేదు.

ఇరాన్
పై
దాడి
చేసి

దేశ
సుప్రీం
లీడర్
ఖమేనీని
వెనెజులా
అధ్యక్షుడు
తరహాలో
ఎత్తుకు
రావాలంటే
మధ్యప్రాచ్యంలోని
అమెరికా,
మిత్రదేశాల
వైమానిక
స్థావరాల
నుంచి
జరగాలి.
అంటే
ఖతార్,
బహ్రెయిన్,
ఇరాక్,
యూఏఈ,
ఒమన్
,
సౌదీ
అరేబియా,
సైప్రస్‌లోని
యూకేకు
చెందిన
అక్రోటిరి
స్థావరం
నుంచి

పని
జరగాలి.
అంతే
కాదు
ఆయా
దేశాల్ని
ఇరాన్
ప్రతీకార
దాడుల్ని
కూడా
అమెరికానే
రక్షించాల్సి
ఉంటుంది.
రెండో
ప్రత్యామ్నాయంగా
గతేడాది
ఇరాన్
భూగర్భ
అణు
కేంద్రమైన
ఫోర్డోపై
నిర్వహించిన
లాంగ్-రేంజ్
బీ2
బాంబు
దాడి
లాంటిది
చేయాలి.
కానీ
పట్టణ
జనాభా
ఎక్కువగా
ఉన్న
ప్రదేశంపై
అలాంటి
దాడి
బూమరాంగ్
కావచ్చని
అంచనా.
చివరిగా
అమెరికా
ఇరాన్
పై
దాడికి
దిగితే
ఖమేనీ
ప్రభుత్వానికి
స్వదేశంలో
మద్దతు
పెరిగి,
నిరసనకారులకు
చుక్కలు
కనిపించడం
ఖాయం.
ఇలా
ఎలా
చూసినా
అమెరికా
దాడి
ట్రంప్
కే
నష్టంగా
మారే
ప్రమాదం
ఉంది.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Trump invokes Pearl Harbor in front of Japanese prime minister to defend Iran attack secrecy

Prime Minister of Japan Sanae Takaichi (L) meets with U.S. President...

Best Nordstrom Rack Tote Bag Deals for Spring, Madewell, Kate Spade, Adidas

Spring has sprung which means it's time to get...

ElevenLabs Users Can Now Get Paid for AI Songs With Music Marketplace

ElevenLabs launched a Music Marketplace on Thursday (March 19)...