Telangana
oi-Dr Veena Srinivas
తెలంగాణలోని
ములుగు
జిల్లాలో
జరగనున్న
గిరిజన
కుంభమేళా,
ఆసియాలోనే
అతి
పెద్ద
జాతర
అయిన
మేడారం
సమ్మక్క
సారలమ్మ
జాతర
కోసం
భారీ
ఏర్పాట్లు
జరుగుతున్నాయ్తి.
దేశంలోనే
ప్రసిద్ధి
చెందిన
ఈ
జాతర
జనవరి
28
నుంచి
31
వరకు
జరగనుంది.
కోట్లాది
మంది
భక్తులు
తరలిరానున్నందున
ఈ
జాతరకు
వారికి
ఎలాంటి
ఇబ్బందులు
లేకుండా
చూడాలని
అధికారులు
కృషి
చేస్తున్నారు.
మేడారం
జాతరకు
నాలుగు
వేల
ప్రత్యేక
బస్సులు
మేడారం
జాతరను
సక్సెస్
చెయ్యటం
కోసం
మంత్రి
సీతక్క
రాత్రింబవళ్ళు
అక్కడే
ఉండి
పనులు
చేయిస్తున్నారు.
మరోవైపు
మేడారం
జాతరకు
ఆర్టీసీ
ప్రత్యేక
శ్రద్ధ
పెట్టి
మరీ
ఏర్పాట్లు
చేస్తోంది.
మేడారం
జాతరకు
వెళ్ళటానికి
ఆర్టీసీ
తెలంగాణా
రాష్ట్ర
వ్యాప్తంగా
అనేక
జిల్లాల
నుండి
ప్రత్యేక
బస్సులను
ఏర్పాటు
చేస్తోంది.
మొత్తం
నాలుగు
వేల
బస్సులను
ఏర్పాటు
చేసి
జాతరకు
వెళ్ళే
ప్రయాణికులకు
ఇబ్బంది
కలగకుండా
చూస్తుంది.
మేడారం
జాతరకు
పొరుగు
రాష్ట్రాల
నుండి
కూడా
భక్తులు
మేడారం
జాతరకు
ఆంధ్రప్రదేశ్,
ఒడిశా,
ఛత్తీస్‌గఢ్‌తో
పాటు
ఇతర
పొరుగు
రాష్ట్రాల
నుంచి
కూడా
భారీ
సంఖ్యలో
భక్తులు
తరలిరానున్నారు.
దీనిని
దృష్టిలో
ఉంచుకొని,
టీజీఎస్ఆర్టీసీ
3,495
ప్రత్యేక
బస్సులను
నడపాలని
నిర్ణయించిందిమహిళలకు
ఉచిత
బస్సు
సౌకర్యం
నేపధ్యంలో
మరో
500బస్సులను
కలిపి
నాలుగు
వేల
బస్సులు
నడపనుంది.
గత
అనుభవాల
నేపథ్యంలో,
రద్దీ
అంచనాలకు
మించి
పెరిగితే
అదనపు
బస్సులను
నడిపేందుకు
కూడా
ప్రణాళికలు
సిద్ధం
చేసింది.
మేడారం
జాతర
ప్రత్యేక
బస్సుల
చార్జీలపై
షాక్
మేడారం
ప్రత్యేక
బస్సుల
విషయంలో
ఇదే
సమయంలో
ఆర్టీసీ
షాకింగ్
న్యూస్
కూడా
చెప్పింది.
ప్రత్యేక
బస్సుల్లో
సాధారణ
ఛార్జీకి
అదనంగా
50
శాతం
వసూలు
చేయనున్నారు.
ప్రత్యేక
పండుగలు,
ఉత్సవాలకు
నడిపే
ప్రత్యేక
సర్వీసులకు
50
శాతం
వరకు
ఛార్జీలు
పెంచుకునేందుకు
ఆర్టీసీకి
అనుమతి
ఉంది.
బస్సు
చార్జీల
బాదుడుకు
ఆర్టీసీ
రెడీ
ఈ
క్రమంలోనే
మేడారం
జాతర
బస్సులకు
అదనపు
చార్జీలు
వసూలు
చేయాలని
నిర్ణయం
తీసుకుంది.బస్సుల
చార్జీలు
పెంచినా
కూడా
మేడారం
జాతర
రెండేళ్ళకోసారి
జరిగే
మహా
జాతర
కావటంతో
జాతరలో
సమ్మక్క,
సారలమ్మలను
దర్శించుకోవటం
కోసం
భారీగా
భక్తులు
బస్సులలో
ప్రయాణాలు
చేస్తారు.


