Telangana
oi-Lingareddy Gajjala
CM
Revanth
Reddy:
తెలంగాణ
రాష్ట్ర
పునర్నిర్మాణంలో
ప్రభుత్వ
ఉద్యోగులే
వారధులు,
సారధులని
ముఖ్యమంత్రి
రేవంత్
రెడ్డి
స్పష్టం
చేశారు.
శుక్రవారం
శిల్పకళా
వేదికలో
జరిగిన
కార్యక్రమంలో
గ్రూప్-3
విజేతలకు
నియామక
పత్రాలను
అందజేస్తూ,
అభ్యర్థులను
ఉద్దేశించి
ఆయన
ఉద్వేగభరితమైన
ప్రసంగం
చేశారు.
గత
పాలకుల
నిర్లక్ష్యంపై
ధ్వజం
గత
పదేళ్లలో
పాలకులు
కేవలం
తమ
కుటుంబం,
పార్టీ,
రాజకీయ
ప్రయోజనాలకే
ప్రాధాన్యత
ఇచ్చారని
సీఎం
విమర్శించారు.
గత
ప్రభుత్వం
ప్రశ్నపత్రాలను
“పల్లి
బఠాణీల్లా”
అమ్ముకుందని,
నిరుద్యోగుల
ఆశలతో
ఆడుకుందని
మండిపడ్డారు.
14
ఏళ్లుగా
గ్రూప్-1
నోటిఫికేషన్
ఇవ్వలేని
దుస్థితి
గతంలో
ఉండేదని,
తాము
అధికారంలోకి
రాగానే
టీజీపీఎస్సీని
యూపీఎస్సీ
తరహాలో
ప్రక్షాళన
చేశామని
తెలిపారు.
నియామక
పత్రాలు
అందకుండా
కొందరు
కుట్రలు
చేసినా,
కోర్టుల్లో
పోరాడి
అభ్యర్థులకు
న్యాయం
చేశామని
ఆయన
గుర్తుచేశారు.
రెండేళ్లలో
70
వేల
ఉద్యోగాలు
ప్రజా
ప్రభుత్వం
ఏర్పడిన
కేవలం
రెండేళ్ల
కాలంలోనే
సుమారు
70
వేల
ప్రభుత్వ
ఉద్యోగాలను
భర్తీ
చేశామని
ముఖ్యమంత్రి
ప్రకటించారు.
ప్రస్తుత
గ్రూప్-3
ద్వారా
25
ప్రభుత్వ
శాఖల్లో
1370
ఉద్యోగాలను
భర్తీ
చేస్తున్నామని,
అభ్యర్థుల
కళ్లలో
ఆనందం
చూడటమే
తమ
ప్రభుత్వ
లక్ష్యమని
పేర్కొన్నారు.
విద్య,
నైపుణ్యంపై
ప్రత్యేక
దృష్టి
ప్రభుత్వ
పాఠశాలల్లో
నాణ్యమైన
విద్యను
అందించాల్సిన
అవసరం
ఉందని
సీఎం
అభిప్రాయపడ్డారు.
అంతర్జాతీయ
స్థాయిలో
పోటీ
పడాలంటే
నైపుణ్యం
ఎంతో
ముఖ్యమని,
అందుకే
ప్రభుత్వం
క్వాలిటీ
ఎడ్యుకేషన్,
స్కిల్
పైన
దృష్టి
పెడుతోందని
చెప్పారు.
2047
నాటికి
తెలంగాణను
3
ట్రిలియన్
డాలర్ల
ఎకానమీగా
తీర్చిదిద్దడమే
లక్ష్యంగా
పనిచేస్తున్నట్లు
వెల్లడించారు.
ఉద్యోగులకు
కీలక
సూచనలు
కొత్తగా
ఉద్యోగాల్లో
చేరుతున్న
వారు
బాధ్యతాయుతంగా
వ్యవహరించాలని
సీఎం
కోరారు.
ఎంతో
కష్టపడి
చదివించిన
తల్లిదండ్రులను
గౌరవంగా
చూసుకోవాలని,
వారిని
నిర్లక్ష్యం
చేస్తే
సహించేది
లేదని
హెచ్చరించారు.
అవసరమైతే
ఉద్యోగుల
జీతంలో
10-15
శాతం
కోత
విధించి
తల్లిదండ్రులకు
అందజేసే
ఆలోచన
చేస్తున్నట్లు
తెలిపారు.
కార్యాలయానికి
వచ్చే
పేదవారిలో
తమ
తల్లిదండ్రులను
చూసుకుని
సేవలు
అందించాలని
ఉద్యోగులకు
హితబోధ
చేశారు.
తెలంగాణ
ప్రభుత్వ
ఉద్యోగం
అనేది
కేవలం
ఒక
జీవనోపాధి
మాత్రమే
కాదు,
అది
ఒక
భావోద్వేగం
అని
సీఎం
అన్నారు.
నిరుద్యోగుల
సమస్యలు
తనకు
తెలుసని,
భవిష్యత్తులో
మరిన్ని
నియామకాలు
చేపడతామని
హామీ
ఇస్తూ
తన
ప్రసంగాన్ని
ముగించారు.


