Andhra Pradesh
oi-Bomma Shivakumar
వైఎస్
జగన్మోహన్
రెడ్డి
ఫ్యాక్షన్
రాజకీయం
పల్నాడు
ప్రాంతాన్ని
ఇంకా
వెంటాడుతోందని
ఇంధనశాఖ
మంత్రి
గొట్టిపాటి
రవి
కుమార్
విమర్శించారు.
రాష్ట్రంలో
హత్యా
రాజకీయాలకు
వైఎస్
ఆర్
కాంగ్రెస్
పార్టీ
నాయకులు
పేటెంట్
రైట్స్
తీసుకున్నట్లుగా
వ్యవహరిస్తున్నారని
తీవ్రంగా
విమర్శించారు.
అధికారంలో
ఉన్న
ఐదేళ్ల
కాలంలో
పల్నాడు
ప్రాంతాన్ని
పూర్తిగా
వల్లకాడుగా
వైసీపీ
మార్చిందని
ఆరోపించారు.
ప్రస్తుతం
రాష్ట్రాన్ని
అభివృద్ధి
మార్గంలో
ముందుకు
తీసుకెళ్తుంటే,
ఆ
పురోగతిని
వైసీపీ
ఓర్వలేకపోతోందన్నారు.
జగన్
మాదిరిగా
హత్యా
రాజకీయాలు
కూటమి
ప్రభుత్వ
విధానం
కాదని
మంత్రి
గొట్టిపాటి
స్పష్టం
చేశారు.
తప్పు
చేసిన
ఎవరినీ
వదిలిపెట్టే
ప్రసక్తే
లేదని,
చట్టం
తన
పని
తాను
చేస్తుందని
తేల్చిచెప్పారు.
ప్రకాశం
జిల్లా
దర్శిలో
సహచర
మంత్రి
డోలా
బాలవీరాంజనేయ
స్వామితో
కలిసి
మంత్రి
గొట్టిపాటి
శనివారం
పర్యటించారు.
ముందుగా
ఇరువురు
మంత్రులు
దర్శిలో
రూ.
4.19
కోట్లతో
నిర్మించనున్న
విద్యుత్
శాఖ
డీఈ
కార్యాలయానికి
శంకుస్థాపన
చేశారు.
అనంతరం
ముండ్లమూరు
మండలం
ఉల్లగల్లులో
రూ.3.90
కోట్లతో
నిర్మాణం
చేపట్టనున్న
33
\
11
కేవీ
విద్యుత్
సబ్
స్టేషన్
కు
భూమి
పూజ
చేశారు.
ఉల్లగల్లులోనే
స్వర్గీయ
ఎన్టీ
రామారావు
విగ్రహాన్ని
ఆవిష్కరించారు.
ఆ
తరువాత
పసుపుగల్లు
గ్రామంలో
నిర్మాణం
పూర్తయిన
బస్
షెల్టర్
ను
మంత్రులు
ప్రారంభించారు.
ఎన్టీఆర్
విగ్రహావిష్కరణ
అనంతరం
ఉల్లగల్లులో
ఏర్పాటు
చేసిన
బహిరంగ
సభలో
మంత్రులు
మాట్లాడారు.
ప్రస్తుతం
ఆస్తులు
కాపాడుకోవడానికి
మాత్రమే
నాయకులు
రాజకీయ
పార్టీలు
పెడుతున్నారని
మంత్రి
గొట్టిపాటి
రవికుమార్
విమర్శించారు.
40
ఏళ్ల
క్రితమే
అప్పటి
సీఎం
అంజయ్య
కు
జరిగిన
అవమానంపై
పోరాడటానికి
తెలుగు
వాడి
ఆత్మ
గౌరవం
కోసం
తెలుగుదేశం
పార్టీని
ఎన్టీఆర్
స్థాపించారని
వెల్లడించారు.
నాలుగు
దశాబ్ధాల
క్రితం
ప్రవేశ
పెట్టిన
రెండు
రూపాయిలకే
కిలో
బియ్యం
పథకాన్ని
ఏ
ప్రభుత్వం
అధికారంలోకి
వచ్చినా
కొనసాగిస్తుందన్నారు.
వీటితో
పాటు
పేదలకు
ఇళ్లు,
మహిళలకు
ఆస్తిలో
సమాన
హక్కు,
గురుకుల
పాఠశాలల
ఏర్పాటు
వంటి
పథకాలు
దేశంలోని
అనేక
రాష్ట్రాలకు
ఆదర్శంగా
నిలిచి
చరిత్ర
సృష్టించాయని,
అవి
ఎంత
గొప్ప
పథకాలో
అందరికీ
అర్థం
అయ్యాయని
మంత్రి
గొట్టిపాటి
కొనియాడారు.
సినిమా
రంగమైనా,
రాజకీయమైనా
ఎన్టీఆర్
కు
పోటీ
ఎన్టీఆరే
అన్నారు.
గ్రీన్
ఎనర్జీలో
13
వేల
కోట్ల
రూపాయిల
పెట్టుబడి..
సీఎం
చంద్రబాబుపై
నమ్మకంతో
శనివారం
నాడు
కాకినాడలో
రూ.13
వేల
కోట్లతో
గ్రీన్
ఎనర్జీ
ప్లాంట్
పెట్టడానికి
పారిశ్రామికవేత్తలు
ముందుకు
వచ్చారని
మంత్రి
గొట్టిపాటి
రవి
కుమార్
తెలిపారు.
ఎన్టీఆర్
బాటలోనే
ముఖ్యమంత్రి
చంద్రబాబు
నాయుడు
కూడా
నడుస్తూ
రాష్ట్రాన్ని
అభివృద్ధి
బాటలో
తీసుకెళ్తున్నారని
మంత్రి
గొట్టిపాటి
వెల్లడించారు.
గోదావరి,
కష్ణా
నదులను
అనుసంధానించడమే
కాకుండా,
పోలవరాన్ని
84
శాతం
పూర్తి
చేశారని
తెలిపారు.
రాజధాని
అమరావతి
నిర్మాణం
పూర్తవ్వాలన్నా,
భావితరాలకు
మంచి
భవిష్యత్తు
కావాలన్నా
చంద్రబాబు
అధికారంలో
ఉండాలన్నారు.
ఒక
వైపు
సంక్షేమ
పథకాలను
అమలు
చేస్తూనే,
ప్రతి
రైతు
కుటుంబంలోనూ
ఒక
ఉద్యోగి
ఉండాలన్న
లక్ష్యంతో
రాష్ట్రాన్ని
అభివృద్ధి
చేస్తున్నారని
తెలిపారు.
కలిసికట్టుగా
టీడీపీ
బలోపేతానికి
కృషి
చేద్దాం..
భేదాభిప్రాయాలు
పక్కన
పెట్టి
తెలుగుదేశం
పార్టీ
అభివృద్ధికి
కృషి
చేయాలని
కార్యకర్తలకు,
స్థానిక
నేతలకు
మంత్రి
గొట్టిపాటి
రవి
కుమార్
పిలుపునిచ్చారు.
జిల్లాలోని
ఎమ్మెల్యేలు,
మంత్రులు
అందరూ
కలిసి
కట్టుగా
కార్యక్రమాల్లో
పాల్గొంటూ
జిల్లా
అభివృద్ధికి
పాటు
పడుతున్నామన్నారు.
స్థానిక
నేతలు,
కార్యకర్తలు
దీనిని
స్పూర్తిగా
తీసుకోవాలని
మంత్రి
కోరారు.
అదే
విధంగా
వ్యక్తిగత
సమస్యలను
పార్టీతో
ముడిపెట్టవద్దని
ఆయన
సూచించారు.
ఎవరూ
ముందుకు
రాని
సమయంలో
ప్రకాశం
జిల్లాలో
ఐదారు
లక్షల
మందితో
మహానాడు
పెట్టి
విజయవంతం
చేసిన
విషయాన్ని
మంత్రి
గొట్టిపాటి
ఈ
సందర్భంగా
గుర్తు
చేశారు.
అద్దంకి
రెవిన్యూ
డివిజన్
ఏర్పాటు
చంద్రబాబు
నాయుడు
చొరవతోనే
జరిగిందన్నారు.
రాబోయే
ఎన్నికల్లో
దర్శి
నియోజకవర్గంలో
గొట్టిపాటి
లక్ష్మిని
గెలిపించడంతో
పాటు
ప్రకాశం
జిల్లాలో
టీడీపీ
పూర్తి
స్థాయి
విజయానికి
ఇప్పటి
నుంచే
కృషి
చేయాలని
మంత్రి
గొట్టిపాటి
పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో
టీడీపీ
నేతలతో
పాటు
పెద్ద
సంఖ్యలో
కార్యకర్తలు
పాల్గొన్నారు.


