International
oi-Syed Ahmed
ప్రపంచవ్యాప్తంగా
మానవ
జాతికి
గొప్ప
ప్రయోజనం
అందించేందుకు
పనిచేసే
వారికి
ఏటా
వివిధ
రంగాల్లో
ప్రదానం
చేసే
నోబెల్
అవార్డులకు
ఎంతో
ప్రాముఖ్యత
ఉంది.
నోబెల్
అవార్డు
అందుకున్న
వారికీ
అంతే
గుర్తింపూ
ఉంటుంది.
అలాంటి
నోబెల్
బహుమతిని
అపహాస్యం
చేసేలా
తాజాగా
వెనెజులా
ప్రతిపక్ష
నాయకురాలు
మచాడో..
తనకు
ఇచ్చిన
ప్రైజ్
ను
తీసుకెళ్లి
అమెరికా
అధ్యక్షుడు
డొనాల్డ్
ట్రంప్
మెప్పు
కోసం
ఆయనకు
తిరిగి
ప్రదానం
చేయడం
తీవ్ర
వివాదాస్పదమైంది.
ఈ
నేపథ్యంలో
నార్వేకు
చెందిన
నోబెల్
అవార్డుల
ఫౌండేషన్
మరోసారి
ఈ
డ్రామాపై
స్పందించింది.
నోబెల్
ఫౌండేషన్
యొక్క
ప్రధాన
లక్ష్యాలలో
ఒకటి
నోబెల్
బహుమతుల
గౌరవాన్ని
మరియు
వాటి
పరిపాలనను
కాపాడటం
అని
తేల్చిచెప్పింది.
ఫౌండేషన్
ఆల్ఫ్రెడ్
నోబెల్
సంకల్పాన్ని
మరియు
దాని
నిబంధనలను
సమర్థిస్తుందని
వెల్లడించింది.
మానవజాతికి
గొప్ప
ప్రయోజనాన్ని
అందించిన
వారికి
ఈ
బహుమతులు
ప్రదానం
చేయబడతాయని
తెలిపింది.
Statement
from
the
Nobel
FoundationOne
of
the
core
missions
of
the
Nobel
Foundation
is
to
safeguard
the
dignity
of
the
Nobel
Prizes
and
their
administration.
The
Foundation
upholds
Alfred
Nobel’s
will
and
its
stipulations.
It
states
that
the
prizes
shall
be
awarded
to
those
who…
pic.twitter.com/WIadOBLtpD—
The
Nobel
Prize
(@NobelPrize)
January
18,
2026
అలాగే
ప్రతీ
నోబెల్
బహుమతిని
ప్రదానం
చేసే
హక్కు
ఎవరికి
ఉందో
అది
నిర్దేశిస్తుందని
ఫౌండేషన్
ఓ
ప్రకటనలో
తెలిపింది.
అందువల్ల
ఒక
బహుమతిని,
ఊహకు
కూడా
మరెవరికీ
బదిలీ
చేయలేము
లేదా
పునఃప్రదానం
కూడా
చేయలేమని
తేల్చిచెప్పేసింది.
తద్వారా
ట్రంప్-మచాడో
ఎపిసోడ్
ను
పరోక్షంగా
తప్పుబట్టింది.
ఇప్పటికే
ట్రంప్
కు
తన
నోబెల్
శాంతి
బహుమతిని
ఇచ్చేసిన
మచాడోపై
తీవ్ర
విమర్శలు
వ్యక్తమవుతున్నాయి.
నార్వేతో
పాటు
ప్రపంచవ్యాప్తంగా
పలు
దేశాలు,
నగరాల్లో
జనం
ఈ
చర్యపై
మండిపడుతున్నారు.
ఇంటర్నెట్
లోనూ
నెటిజన్లు
వీరిద్దరిపై
దుమ్మెత్తిపోస్తున్నారు.


