కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. వెబ్‌సైట్‌లు బ్యాన్‌!

Date:


Betting, Gambling Websites Banned : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 242 బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌ వెబ్‌సైట్‌ను బ్యాన్‌ చేసింది. ఇప్పటివరకు మొత్తంగా 7800 వెబ్‌సైట్లపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. చట్టవిరుద్ధమైన ఆన్‌లైన్‌ బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌ కారణంగా జరుగుతున్న ఆర్థిక ఇతర రకాల మోసాలను కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

గత సంవత్సరం అక్టోబర్‌ నెలలో ప్రభుత్వం ఆన్‌లైన్ గేమింగ్‌ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారమే తాజాగా భారీ సంఖ్యలో గేమింగ్‌, గ్యాంబ్లింగ్‌ వెబ్‌సైట్‌లపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగులను టార్గెట్‌ చేస్తూ, ఈ వెబ్‌సైట్లు ఆగడాలకు పాల్పడుతున్నాయి. ఆశపెట్టి.. మోసాలకు పాల్పడుతున్నాయి. దీంతో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయి, ఆత్మహత్య చేసుకున్న ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి.

ఆర్థిక మోసాల నుంచి ప్రజలను అప్రమత్తం చేయడం సహా కాపాడుకోవడంలో భాగంగా ఇటీవల ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది. అక్టోబర్ 1 నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. ప్రజలు కూడా ఈ నేరాలపట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తోంది.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

How to Watch Selection Sunday, Livestream

All products and services featured are independently chosen by...

Democrats blast FCC Chair Carr’s broadcast license threats as anti-First Amendment, ‘totalitarian’

Federal Communications Commission Chair Brendan Carr has drawn fierce...

Sinners Makeup Artist on Michael B. Jordan Transformation

In fact, given the grisly showdown at the juke...

How Much Does Conan O’Brien Get Paid as Host

Oscars Host Conan O’Brien Reveals “Bad” Joke He's...