Telangana
oi-Lingareddy Gajjala
ఫోన్
ట్యాపింగ్
కేసులో
మాజీ
మంత్రి,
బీఆర్ఎస్
ఎమ్మెల్యే
హరీష్
రావు
(Harish
Rao)
సిట్
విచారణకు
హాజరయ్యారు.
జూబ్లీహిల్స్
పోలీస్
స్టేషన్
లో
హైదరాబాద్
సీపీ
సజ్జనార్
నేతృత్వంలోని
సిట్
బృందం
హరీష్
రావును
విచారిస్తుంది.
ఈ
సందర్బంగా
జూబ్లీహిల్స్
పీఎస్
ముందు
భారీగా
మోహరించారు
పోలీసులు.హరీష్
రావు
విచారణకు
హాజరైన
క్రమంలో
భారీగా
బీఆర్ఎస్
శ్రేణులు,
హరీష్
రావు
అభిమానులు
ఆయన
కోసం
రావడంతో..
300
మందితో
పోలీసులతో
బందోబస్తు
ఏర్పాటు
చేశారు.
సిట్
విచారణకు
హాజరయ్యే
ముందు
మాజీ
మంత్రి
కేటీఆర్,
పార్టీ
నేతలతో
కలిసి
మీడియాతో
ఆయన
మాట్లాడారు.
ఈ
సందర్భంగా
కాంగ్రెస్
ప్రభుత్వంపై
తీవ్ర
విమర్శలు
చేశారు.
సీఎం
రేవంత్‌రెడ్డి
(Revanth
Reddy)
తాటాకు
చప్పుళ్లకు
భయపడబోమని
మాజీ
మంత్రి,
బీఆర్ఎస్
ఎమ్మెల్యే
హరీశ్‌రావు
అన్నారు.
డైవర్షన్
పాలిటిక్స్‌లో
భాగంగానే
ఫోన్
ట్యాపింగ్
కేసులో
తనకు
సిట్
నోటీసులు
ఇచ్చారని..
సీఎం
ఆడుతున్న
సిల్లీ
డ్రామా
ఇది
అని
వ్యాఖ్యానించారు.
బామ్మర్ది
బాగోతం..
తనకు
జారీ
చేసిన
సిట్
నోటీసులపై
బీఆర్‌ఎస్
సీనియర్
నేత,
మాజీ
మంత్రి
హరీశ్‌రావు
తీవ్రంగా
స్పందించారు.
చట్టాలపై
తనకు
పూర్తి
గౌరవం
ఉందని,
పిలిచిన
సమయానికి
విచారణకు
హాజరవుతానని
స్పష్టం
చేశారు.
తాను
ఎలాంటి
తప్పూ
చేయలేదని,
నోటీసులతో
భయపడే
ప్రసక్తే
లేదని
చెప్పారు.
సోమవారం
రాత్రి
9
గంటలకు
నోటీసులు
ఇచ్చి,
మంగళవారం
ఉదయం
11
గంటలకు
విచారణకు
రావాలని
సిట్
ఆదేశించడంపై
స్పందించిన
హరీశ్‌రావు,
ఇది
రాజకీయ
కక్షతో
తీసుకున్న
చర్యగా
అభివర్ణించారు.
“రేవంత్
బామ్మర్ది
బాగోతం,
మున్సిపల్
ఎన్నికల
ముందు
అవినీతిని
బయటపెట్టినందుకే
నోటీసులు
ఇచ్చారు.
ఇలాంటి
చర్యలు
నాకు
కొత్త
కాదు”
అని
వ్యాఖ్యానించారు.
ప్రభుత్వాన్ని
ప్రశ్నిస్తూనే
ఉంటా..
ఉమ్మడి
రాష్ట్రంలోనూ
అప్పటి
ప్రభుత్వాలు
తనపై
అనేక
కేసులు
పెట్టాయని,
అయినా
కేసీఆర్
నాయకత్వంలో
పోరాడి
ముందుకు
వెళ్లామని
గుర్తు
చేశారు.
ఆరు
గ్యారంటీలు,
ఇతర
హామీల
అమలుపై
ప్రభుత్వాన్ని
ప్రశ్నిస్తూనే
ఉంటాం
అని
స్పష్టం
చేశారు.
ప్రస్తుతం
బయటపడుతున్న
బొగ్గు
కుంభకోణం,
వాటాల
పంచాయతీ
అంశాలు
ప్రజలకు
అర్థమయ్యాయని,
వాటి
నుంచి
ప్రజలూ,
మీడియా
దృష్టి
మళ్లించేందుకే
ఈ
నోటీసుల
డ్రామా
నడుస్తోందని
హరీశ్‌రావు
ఆరోపించారు.
పంచాయతీ
ఎన్నికల్లో
ముఖ్యమంత్రి
రేవంత్‌రెడ్డి
అంచనాలు
పూర్తిగా
తప్పాయని,
ఊహించని
స్థాయిలో
బీఆర్‌ఎస్‌కు
స్థానాలు
వచ్చాయని
తెలిపారు.
సుప్రీం
కొట్టివేసినా..
కృష్ణా
జలాలను
ఆంధ్రప్రదేశ్‌కు
అప్పగించే
అంశంపై
కూడా
ప్రభుత్వాన్ని
విమర్శించిన
హరీశ్‌రావు,
గత
రెండేళ్లుగా
ఫోన్
ట్యాపింగ్
అంశంపై
నాటకాలు
సాగుతున్నాయని
వ్యాఖ్యానించారు.
గతంలో
తనపై
పెట్టిన
కేసులను
హైకోర్టు,
సుప్రీంకోర్టు
కొట్టేశాయని,
న్యాయం
తమ
వైపే
ఉందని
ధీమా
వ్యక్తం
చేశారు.
“సుప్రీంకోర్టే
కొట్టివేసిన
కేసులపై
మళ్లీ
నోటీసులు
ఇచ్చి
విచారణకు
పిలవడం
ఏంటి?
ఎన్నిసార్లు
పిలిచినా
వస్తాం.
కానీ
అవినీతి
బాగోతాలను
బయటపెట్టడం
మాత్రం
ఆపం”
అని
హరీశ్‌రావు
తేల్చి
చెప్పారు.
కాంగ్రెస్
ప్రభుత్వం
చేసిన
బొగ్గు
కుంభకోణంపై
సీబీఐ
విచారణ
జరపాలంటూ
కేంద్రమంత్రి
@kishanreddybjp
కి
లేఖ
రాసిన
మాజీ
మంత్రి,
ఎమ్మెల్యే
@BRSHarishసిట్
విచారణకు
హాజరయ్యే
ముందు
మీడియా
సాక్షిగా
లేఖను
విడుదల
చేసిన
హరీష్
రావు.
pic.twitter.com/CZxzjFQOOS—
BRS
Party
(@BRSparty)
January
20,
2026
కిషన్
రెడ్డికి
లేఖ
కేంద్రమంత్రి
కిషన్‌రెడ్డికి
హరీశ్‌రావు
బహిరంగ
లేఖ
రాశారు.
కేంద్ర
ప్రభుత్వానికి
సింగరేణిలో
49
శాతం
వాటా
ఉందని..
అక్కడ
జరుగుతున్న
అవినీతిపై
సీబీఐ
విచారణకు
ఆదేశించాలని
డిమాండ్
చేశారు.
రేవంత్‌రెడ్డితో
కుమ్మక్కు
కాకపోతే
వెంటనే
చర్యలు
తీసుకోవాలని
కిషన్‌రెడ్డిని
కోరారు.
అన్ని
ఆధారాలు
ఇవ్వడానికి
తాను
సిద్ధంగా
ఉన్నానని
పేర్కొన్నారు.


