Andhra Pradesh
oi-Sai Chaitanya
చంద్రబాబు
పై
నమోదైన
కేసులు
మూసివేత
పై
హైకోర్టులో
కీలక
పరిణామం
చోటు
చేసుకుంది.
వైసీపీ
హయాంలో
చంద్రబాబు
పైన
నమోదైన
రెండు
కేసులను
మూసివేసారు.
ఈ
వ్యవహారం
పైన
హైకోర్టులో
పిటీషన్
దాఖలైంది.
ఈ
కేసుల
కొట్టివేత
సమయంలో
న్యాయస్థానం
అభ్యంతరాలను
న్యాయస్థానాలు
సరిగ్గా
పట్టంచుకోలేదని
పిటీషనర్
పేర్కొన్నారు.
ఈ
అంశం
పైన
విచారణ
చేసిన
హైకోర్టు
ప్రభుత్వానికి
కీలక
ఆదేశాలు
ఇచ్చింది.
ముఖ్యమంత్రి
చంద్రబాబు
పైన
రెండు
కేసులను
ఈ
మధ్య
కాలంలో
మూసివేసారు.
వైసీపీ
హయాం
లో
చంద్రబాబు
పై
ఫైబర్
గ్రిడ్,
స్కిల్
డెవలప్
మెంట్
కేసులు
నమోదయ్యాయి.
స్కిల్
కేసులో
చంద్రబాబు
53
రోజులు
జైలులో
ఉన్నారు.
అయితే,
కొద్ది
రోజుల
క్రితం
ఈ
కేసులో
ఆరోపణలు
వాస్తవం
కాదంటూ
ఏసీబీ
కోర్టు
కేసును
మూసివేసింది.
చంద్రబాబు
సహా
37
మందిపై
విచారణను
మూసివేస్తున్నట్లు
ఏసీబీ
ప్రత్యేక
న్యాయస్థానం
ప్రకటించింది.
ఇదే
సమయంలో
ఈ
కేసులో
తీర్పు
వెలువరించే
ముందు
తన
వాదనలు
వినాలని
అజయ్‌రెడ్డి
దాఖలు
చేసిన
పిటిషన్‌ను
కొట్టివేసింది.
దీంతో,
ఇప్పుడు
హైకోర్టులో
ఇదే
తరహాలో
పిటీషన్
దాఖలు
కాగా..
విచారణ
సమయంలో
హైకోర్టు
కీలక
సూచనలు
చేసింది.
కేసులు
ఎందుకు
మూసివేసారు..
ఏ
ఆధారాలపై
ఉపసంహరణకు
వెళ్లారో
స్పష్టమైన
వివరణ
ఇవ్వాలని
ఆదేశిస్తూ..
తదుపరి
విచారణ
కోసం
ఫిబ్రవరి
3వ
తేదీకి
వాయిదా
వేసింది.
2014-19
నడుమ
టీడీపీ
అధికారంలో
ఉన్నప్పుడు
నైపుణ్యాభివృద్ధి
సంస్థను
ఏర్పాటు
చేశారు.
ఇందుకోసం
సీమెన్స్
కంపెనీతో
ప్రభుత్వం
ఎంవోయూ
కుదుర్చుకుంది.
రూ.3,356
కోట్ల
విలువైన
ప్రాజెక్టులో
సీమెన్స్
వాటా
90
శాతం,
మిగతా
పది
శాతం
ప్రభుత్వ
వాటాగా
పేర్కొన్నారు.
2019లో
వచ్చిన
జగన్
ప్రభుత్వం
ఈ
కార్పొరేషన్
నిధులు
దుర్వినియోగమయ్యాయని
కేసు
(క్రైం
నంబరు
29/2021)
నమోదు
చేసింది.
సీమెన్స్
రాష్ట్రంలో
ఎలాంటి
శిక్షణ
కార్యక్రమాలు
నిర్వహించ
కున్నా,
దాని
నుంచి
నిధులు
రాకపోయినా
టీడీపీ
ప్రభుత్వం
ఆ
సంస్థకు
రూ.371
కోట్లు
విడుదల
చేసిందని,
ఆ
డబ్బులను
చంద్రబాబు
డొల్ల
కంపెనీలకు
మళ్లించారని
సీఐడీ
ఆరోపించింది.
ఈ
అభియోగాలతో
చంద్రబాబుతో
సహా
37
మందిపై
కేసు
నమోదు
చేసింది.
చంద్రబాబును
37వ
నిందితుడిగా
చేర్చారు.
చంద్రబాబు
ప్రజాగళం
యాత్రలో
ఆయన
నంద్యాలలో
ఉన్నప్పుడు
2023
సెప్టెంబరు
9న
సీఐడీ
అధికారులు
అరెస్టు
చేసి
విజయవాడ
తీసుకొచ్చారు.
ఏసీబీ
కోర్టు
రిమాండ్
విధించడంతో
ఆయన
53
రోజులపాటు..
2023
అక్టోబరు
31
వరకు
రాజమహేంద్ర
వరం
కేంద్ర
కారాగారంలో
ఉండాల్సి
వచ్చింది.
ఆ
కేసు
మూసివేత
పైన
ఇప్పుడు
హైకోర్టులో
పిటీషన్
దాఖలు
కావటంతో..
విచారణ
జరిగింది.


