oi
-Suravarapu Dileep
ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ 2026 లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లు సహా అనేక ఉత్పత్తులను డిస్కౌంట్ ధరలకు కొనుగోలు చేయవచ్చు. సేల్ ఆఫర్లతోపాటు HDFC బ్యాంకు కార్డులపై 10 శాతం డిస్కౌంట్ ను అందిస్తోంది. ప్రస్తుతం రూ.10 వేల ధర రేంజ్ లో అనేక స్మార్ట్‌టీవీలు అందుబాటులో ఉన్నాయి. వీటికి డిమాండ్ కూడా అధికంగా ఉంది. ఈ ధరలో 32 అంగుళాల టీవీలు అందుబాటులో ఉన్నాయి.
ప్రస్తుతం ఈ సేల్ లో (Flipkart Republic Day Sale 2026) ఏసర్ అల్ట్రా సిరీస్ గూగుల్ టీవీ, థామ్సన్ FA సిరీస్, Blaupunkt సైబర్ సౌండ్ G2 సిరీస్ టీవీలు రూ.10 వేల ధరలో ఉన్నాయి. బడ్జెట్, బ్రాండ్, ఫీచర్లు ఆధారంగా (Smart TV Deals) ఎంపిక చేసుకోవచ్చు.
Blaupunkt స్మార్ట్‌టీవీ :
Blaupunkt టీవీ 32 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ HD LED డిస్‌ప్లేను కలిగి ఉంది. డాల్బీ సపోర్టుతో 40W సౌండ్ అవుట్‌పుట్ ను అందిస్తుంది. బిల్ట్‌ఇన్ వైఫై, గూగుల్ అసిస్టెంట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కనెక్టివిటీ పరంగా మూడు HDMI పోర్టులు, రెండు USB పోర్టులు ఉన్నాయి.
ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ 2026 లో భాగంగా ఈ ఫోన్ 32 అంగుళాల డిస్‌ప్లే టీవీ ధర రూ.9999 గా ఉంది. HDFC బ్యాంకు కార్డులపై 10 శాతం డిస్కౌంట్ ను పొందవచ్చు. దీంతోపాటు ఇతర బ్యాంకు కార్డులపైనా డిస్కౌంట్ ను అందిస్తోంది.
థామ్సన్ FA సిరీస్ స్మార్ట్‌టీవీ :
ఈ థామ్సన్ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ 32 అంగుళాల డిస్‌ప్లే వేరియంట్ రూ.10 వేల ధరలో అందుబాటులో ఉంది. HDFC బ్యాంకు కార్డులపై 10 శాతం డిస్కౌంట్ ను పొందవచ్చు. ఇతర బ్యాంకుల కార్డులపైనా డిస్కౌంట్ ను పొందవచ్చు.
ఈ స్మార్ట్ టీవీ HD LED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఆండ్రాయిడ్ టీవీ గూగుల్ అసిస్టెంట్, క్రోమ్‌కాస్ట్ బిల్ట్ ఇన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 30W సౌండ్ అవుట్‌పుట్ ను అందిస్తుంది. వైఫై, HDMI, USB పోర్టులు ఉన్నాయి. ఈ ధరలో ఉన్న బెస్ట్ టీవీల్లో ఇది కూడా ఒకటిగా ఉంది.
ఏసర్ అల్ట్రా సిరీస్ :
ఈ స్మార్ట్ టీవీ 32 అంగుళాల HD LED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ టీవీ గూగుల్ టీవీ, వైఫై, ఇన్‌బిల్ట్ యాప్స్ ను కలిగి ఉంది. 30W సౌండ్ అవుట్‌పుట్ ను అందిస్తుంది. టీవీ లేటెస్ట్ గూగుల్ టీవీ ఫీచర్లను కలిగి ఉంది.
ఈ ఆండ్రాయిడ్ స్మార్ట్‌టీవీ 32 అంగుళాల డిస్‌ప్లే ధర రూ.9,999 గా ఉంది. 40 అంగుళాల డిస్‌ప్లే ధర రూ.13499 గా ఉంది. అయితే ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ లో భాగంగా HDFC బ్యాంకు కార్డులపై 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపైనా డిస్కౌంట్‌ను అందిస్తోంది.
Best Mobiles in India


