Andhra Pradesh
oi-Sai Chaitanya
Tirumala:
తిరుమలలో
భక్తుల
రద్దీ
సాధారణంగా
ఉంది.
టీటీడీలో
నిర్ణయాలు…
భక్తుల
సౌకర్యాల
పైన
ప్రభుత్వం
ప్రత్యేకంగా
ఫోకస్
చేసింది.
అధికారుల
విషయంలోనూ
కీలక
నిర్ణయాలు
తీసుకుంటోంది.
టీటీడీలో
కొత్త
మార్పులు…
అలిపిరిలో
బేస్
క్యాంపు
దిశగా
ఇప్పటికే
కార్యాచరణ
మొదలైంది.
అదే
విధంగా
టీటీడీ
అనుబంధ
ఆలయాల్లోనూ
సేవలను
పెంచుతోంది.
కాగా,
టీటీడీ
కీలక
బాధ్యతల్లో
మరో
అధికారిని
నియమిస్తూ
ప్రభుత్వం
ఉత్తర్వులు
జారీ
చేసింది.
ఏరి
కోరి
ఈ
అధికారికి
బాధ్యతలు
అప్పగించారు.
టీటీడీలో
మరో
కీలక
నియామకం
జరిగింది.
టీటీడీ
జేఈవోగా
రిటైర్డ్
ఐఏఎస్
అధికారి
డాక్టర్
ఎ
శరత్‌ను
నియమిస్తూ
ప్రభుత్వం
ఉత్తర్వులు
జారీ
చేసింది.
ఏడాదిగా
ఖాళీగా
వున్న
విద్య,
ఆరోగ్య
విభాగాల
జేఈవో
పోస్టులో
ఆయన
నియమితులయ్యారు.
గ్రూప్
1
అధికారిగా
పని
చేసిన
శరత్
1990వ
దశకం
చివర్లో
మదనపల్లె
ఆర్డీవోగానూ,
తదుపరి
కుప్పం
అర్బన్
డెవలప్
మెంట్
అథారిటీ
స్పెషలాఫీసర్‌గానూ
పనిచేశారు.
2005లో
ఐఏఎస్
హోదా
అందుకుని
వివిధ
హోదా
ల్లో
పనిచేశారు.
ఆపై
ఏపీ
క్యాడర్
నుంచి
తెలంగాణ
క్యాడర్‌కు
బదిలీ
అయ్యారు.
తెలంగాణలోనే
సర్వీసు
నుంచీ
రిటైర్
అయ్యారు.
టీటీడీలో
రిటైర్డు
ఐఏఎస్
అధికారులను
జేఈవో
పోస్టులో
నియమించడం
చాలా
అరుదు.
గతంలో
కుప్పంలో
కడా
ప్రత్యేక
అధికారిగా
విజయవంతంగా
పనిచేసిన
నేపథ్యంలో
సీఎం
చంద్రబాబుతో
సన్నిహిత
పరిచయాలున్న
అధికారిగా
చెబుతారు.
శరత్
సమర్ధత
పైన
ఉన్న
నమ్మకంతో
ఆయనకు
కీలకమైన
టీటీడీ
హెల్త్
అండ్
ఎడ్యుకేషన్
వింగ్
జేఈవో
పోస్టులో
నియమించేందుకు
సీఎం
నిర్ణయించినట్లు
తెలుస్తోంది.
ఆ
పోస్టులో
ప్రాథమికంగా
ఏడాది
పాటు
కొనసాగుతారని
ఉత్తర్వుల్లో
పేర్కొన్నారు.
టీటీడీ
ఆధ్వర్యంలో
నిర్వహిస్తున్న
విద్య..
వైద్య
రంగానికి
సంబంధించిన
అంశాల
పైన
శరత్
ప్రత్యేకంగా
ఫోకస్
చేయనున్నారు.
స్విమ్స్,
రుయా
ఆస్పత్రులు
టీటీడీ
ఆధ్వర్యంలో
కొనసాగుతున్నాయి.
అదే
విధంగా
ఎస్వీ
యూనివర్సిటీ,
పద్మావతి
విశ్వ
విద్యాలయం
వంటి
వాటిల్లోనూ
అవసరమైన
నిర్ణయాల
దిశగా
కసరత్తు
జరుగుతోంది.
దీంతో..
ఇప్పుడు
ఈ
బాధ్యతలను
ఏరి
కోరి
శరత్
కు
అప్పగించారు.
తిరుమల
ఆలయ
నిర్వహణ..
నిర్ణయాల
బాధ్యతలను
బోర్డుతో
పాటుగా
ఈవో
అనీల్
కుమార్
సింఘాల్,
ఏఈవో
వెంకయ్య
చౌదరి
పర్యవేక్షిస్తున్నారు.


