India
oi-Jakki Mahesh
Atal
Pension
Yojana:
కేంద్ర
ప్రభుత్వం
అసంఘటిత
రంగ
కార్మికులకు,
సామాన్యులకు
తీపికబురు
అందించింది.
ప్రధాని
నరేంద్ర
మోదీ
అధ్యక్షతన
బుధవారం
జరిగిన
కేంద్ర
కేబినెట్
సమావేశంలో
అటల్
పెన్షన్
యోజన
పథకాన్ని
మరో
ఐదేళ్ల
పాటు
పొడిగిస్తూ
కీలక
నిర్ణయం
తీసుకున్నారు.
అటల్
పెన్షన్
యోజన
గడువును
2030-31
ఆర్థిక
సంవత్సరం
వరకు
పొడిగిస్తూ
కేంద్ర
కేబినెట్
ఆమోదం
తెలిపింది.
ఈ
పథకం
ద్వారా
అసంఘటిత
రంగంలోని
కోట్లాది
మంది
కార్మికులకు
వృద్ధాప్యంలో
ఆర్థిక
భద్రత
కల్పించడమే
లక్ష్యంగా
ప్రభుత్వం
ఈ
నిర్ణయం
తీసుకుంది.
ఏమిటీ
అటల్
పెన్షన్
యోజన?
అసంఘటిత
రంగంలో
పనిచేసే
వారు
తమ
వృద్ధాప్యంలో
ఇబ్బంది
పడకుండా
ఉండేందుకు
2015
మే
9న
కేంద్రం
ఈ
పథకాన్ని
ప్రారంభించింది.
దీని
ద్వారా
చందాదారులు
60
ఏళ్లు
నిండిన
తర్వాత
వారు
చెల్లించిన
చందాను
బట్టి
నెలకు
రూ.
1,000
నుండి
రూ.
5,000
వరకు
కనీస
హామీతో
కూడిన
పెన్షన్ను
పొందుతారు.
కేబినెట్
నిర్ణయంలోని
ముఖ్యాంశాలు:
ఈ
పథకం
ఇకపై
2030-31
ఆర్థిక
సంవత్సరం
వరకు
నిరంతరాయంగా
కొనసాగుతుంది.ఈ
పథకం
వ్యాప్తిని
పెంచడానికి,
ప్రజల్లో
అవగాహన
కల్పించడానికి,
గ్యాప్
ఫండింగ్
కోసం
కేంద్రం
నిధుల
మద్దతును
కూడా
పొడిగించింది.
జనవరి
19,
2026
నాటికి
ఈ
పథకంలో
సుమారు
8.66
కోట్ల
మంది
పైగా
చందాదారులు
నమోదు
చేసుకున్నట్లు
ప్రభుత్వం
వెల్లడించింది.
దేశవ్యాప్తంగా
అసంఘటిత
రంగ
కార్మికులకు
చేరువ
కావడానికి
ప్రభుత్వం
సామర్థ్య
పెంపుదల,
అవగాహన
కార్యక్రమాలను
మరింత
ముమ్మరం
చేయనుంది.
ముఖ్యంగా
గ్రామీణ
ప్రాంతాల్లోని
కూలీలు,
చిరు
వ్యాపారులు
ఈ
పథకం
ద్వారా
లబ్ధి
పొందేలా
చర్యలు
తీసుకోనున్నారు.
ఈ
పథకంలో
చేరడం
ఎలా?
18-40
ఏళ్ల
మధ్య
వయస్సు
ఉన్నవారు
ఈ
పథకంలో
చేరేందుకు
అర్హులు.
ఈ
పెన్షన్
స్కీంలో
పెట్టుబడి
పెట్టాలనుకునేవారు
పోస్టాఫీసు
లేదా
ఏదైనా
ప్రభుత్వ
రంగ
బ్యాంక్
ఖాతాలో
కానీ
సేవింగ్
అకౌంట్
కలిగి
ఉండాలి.
ఈ
స్కీంలో
చేరేవారు
60
ఏళ్లు
నిండిన
తర్వాత
నెలకు
రూ.1000
నుంచి
రూ.5000
వరకు
పెన్షన్
పొందేలా
ఏదో
ఒక
స్లాబ్
ఎంచుకోవాలి.
చందాదారులు
ఎంచుకున్న
పెన్షన్
మొత్తం..
పథకంలో
చేరినప్పటి
వయస్సును
బట్టి
తాము
చెల్లించాల్సిన
నెలవారీ
ప్రీమియం
మారుతుంది.
ఎంత
తక్కువ
వయసులో
చేరితే
ప్రీమియం
అంత
తక్కువగా
చెల్లించాల్సి
వస్తుంది.
పెన్షన్
స్లాబ్లు:
చందాదారులు
తమ
వయస్సు,
ఎంచుకున్న
ప్లాన్ను
బట్టి
నిర్ణీత
మొత్తాన్ని
ప్రతి
నెలా
చెల్లించాల్సి
ఉంటుంది.
60
ఏళ్లు
నిండిన
తర్వాత
రూ.
1,000,
రూ.
2,000,
రూ.
3,000,
రూ.
4,000,
రూ.
5,000
…వీటిలో
తాము
ఎంచుకున్న
మొత్తాన్ని
పెన్షన్
రూపంలో
ప్రతి
నెలా
పొందుతారు.
వృద్ధాప్యంలో
ఎవరిపైనా
ఆధారపడకుండా
ఆత్మగౌరవంతో
బతకడానికి
అటల్
పెన్షన్
యోజన
ఒక
గొప్ప
వరమని
చెప్పవచ్చు.
తాజాగా
కేంద్రం
తీసుకున్న
నిర్ణయంతో
మరిన్ని
కోట్ల
మందికి
ఈ
పథకం
కింద
సామాజిక
భద్రత
లభించనుంది.


