International
oi-Dr Veena Srinivas
భార్యాభర్తల
మధ్య
క్షణికావేషాలు
ఉంటూనే
ఉంటాయి.
అయితే
ఆ
ఆవేశం
ఇంటిని
ధ్వంసం
చేసేదాకా
వెళితే,
ప్రపంచమంతా
చర్చించుకునే
లాగా
మారితే
మాత్రం
అది
కచ్చితంగా
మార్చుకో
వలసిందే.
ఇక
అటువంటి
ఘటన
చైనా
దేశంలోని
గ్యాంగ్
డాంగ్
ప్రాంతంలో
జరిగింది.
భార్య
డిష్
వాషర్
కొన్నందుకు
భర్త
హంగామా
ఇంట్లో
తన
పనులకు
సహాయంగా
ఉండడం
కోసం
ఒక
మహిళ
ఆన్లైన్లో
సుమారు
269
డాలర్లను(25000)
ఖర్చుచేసి
డిష్
వాషర్
ను
కొనుగోలు
చేసింది.
అయితే
ఈ
కొనుగోలు
గురించి
ఆమె
భర్తకు
తెలియదు.
టెక్నీషియన్లు
దానిని
ఫిట్
చేస్తున్న
సమయంలో
అతను
ఇంటికి
వచ్చి
నానా
హంగామా
చేసాడు.
తన
అనుమతి
లేకుండా
డిష్
వాషర్
ఎందుకు
కొనుగోలు
చేసావ్
అంటూ
భార్యను
ప్రశ్నించాడు.
ఇల్లంతా
ధ్వంసం
చేసిన
భర్త
..
భార్య
ఏం
చేసిందంటే
అంత
డబ్బు
ఎందుకు
ఖర్చు
చేసావని
భార్యను
నిలదీశాడు.
వెంటనే
ఆర్డర్
క్యాన్సిల్
చేయాలని
హుకుం
జారీ
చేశాడు.
అంతటితో
ఆగక
ఇంటిని
ధ్వంసం
చేశాడు.
ఇంట్లో
ఉన్న
వస్తువులన్నీ
పగలగొట్టి
నాశనం
చేసాడు.
ఇక
భార్య
ఏడుస్తూ
పెట్టిన
వీడియో
సోషల్
మీడియాలో
వైరల్
అయింది.
భర్త
కోపానికి
భయపడిన
భార్య
ఏడుస్తూ
వెళ్ళిపోయింది.
ఆ
రాత్రి
హోటల్లో
ఉంది.
తర్వాత
రోజు
భర్త
చేసిందిదే
మరుసటిరోజు
తెల్లవారుజామున
శాంతించిన
భర్త
భార్యను
క్షమాపణ
కోరి
మరోసారి
చిన్న
డిష్
వాషర్
కొంటా
అంటూ
భార్యకు
సర్దిచెప్పాడు.
అయితే
భర్త
కోపానికి
కారణం
ఉంది.
మొత్తం
నెలకు
11వేల
యువాన్లు
సంపాదిస్తూ
గతంలో
ఇంటికి
దూరంగా
ఉండేవాడు.
భార్య
ఇంట్లో
ఇద్దరు
పిల్లలను
చూసుకుంటూ
జీవనం
గడిపేది.
అయితే
గతేడాది
అనారోగ్యంతో,
పిల్లల
సంరక్షణ
కోసం
భర్త
ఉద్యోగం
మానేసి
భార్యకు
వైద్యం
చేయించి
పిల్లలను
చూసుకుంటున్నాడు.
భర్త
ఆగ్రహం
వెనుక
రీజన్
ఇదే
దీంతో
అతను
అప్పుల
పాలయ్యాడు.
ప్రస్తుతం
ఆ
అప్పులను
తీరుస్తూ
మళ్లీ
కోలుకునే
ప్రయత్నం
చేస్తున్న
క్రమంలో
భార్య
అనాలోచితంగా
డబ్బులు
ఖర్చు
చేయడం
ఆ
భర్త
ఆగ్రహానికి
కారణమైంది.
అయితే
చైనాలో
పెద్ద
ఎత్తున
వైరల్
అవుతున్న
ఈ
వీడియో
ఆసక్తికర
చర్చకు
కారణంగా
మారింది.
సోషల్
మీడియాలో
చర్చ
కేవలం
డిష్
వాషర్
కోసం
ఇల్లంతా
ధ్వంసం
చేసిన
భర్త
పేరు
గృహహింస
కిందకు
వస్తుందని
కొందరు
అంటుంటే,
భార్య
చేసింది
తప్పు
కాబట్టే
భర్త
అలా
రియాక్ట్
అయ్యాడని
మరికొందరంటున్నారు.
భార్యాభర్తలిద్దరూ
ఒకరికొకరు
అర్థం
చేసుకుని
పనిచేయాల్సి
ఉంటుందని
నెటిజన్లు
అంటున్నారు.


