దావోస్ లో తెలంగాణా పంట పండింది: హైదరాబాద్‌లో ప్రపంచంలోనే తొలి స్విస్ మాల్!

Date:


Telangana

oi-Dr Veena Srinivas

ప్రపంచ
ఆర్థిక
వేదిక
అయిన
దావోస్
సమావేశాల్లో
తెలంగాణకు
అంతర్జాతీయ
స్థాయిలో
బంపర్
అవకాశాలు
వస్తున్నాయి.
వచ్చే
ఐదేళ్లలో
రాష్ట్రంలో
దశల
వారీగా
వెయ్యి
కోట్ల
రూపాయలు
పెట్టుబడి
పెట్టేందుకు
అమెరికాకు
చెందిన
ప్రముఖ
విమాన
యాన
సంస్ధ
సర్గడ్
ముందుకు
వచ్చింది.
అంతేకాదు
హైదరాబాద్‌లో
ప్రపంచంలోనే
తొలి
‘స్విస్
మాల్’
నిర్మాణ
ఆలోచన
ప్రతిపాదనకు
స్విస్
ప్రతినిధి
బృందం
వెంటనే
సానుకూల
స్పందన
వ్యక్తం
చేయడం
కూడా
తెలంగాణాకు
శుభవార్త
చెప్పింది.


యూఎస్
కు
చెందిన
సర్గడ్
సంస్ధతో
ఒప్పందం

దావోస్‌లో
జరుగుతున్న
ప్రపంచ
ఆర్థిక
వేదిక
సదస్సులో
సర్గాడ్
సంస్థ
వ్యవస్థాపకుడు,
సీఈఓ
శ్రీనివాస్
తోట,
ముఖ్యమంత్రి
రేవంత్
రెడ్డితో
సమావేశం
అయ్యారు.
ఇందుకు
సంబంధించిన
అవగాహనా
ఒప్పందంపై
రాష్ట్ర
ప్రభుత్వంతో
సర్గడ్
సంతకం
చేసింది.
సర్గడ్
సంస్ధ
రాష్ట్రంలో
మెయింటెనెన్స్
అండ్
రిపేర్
యూనిట్
నెలకొల్పనుంది.
సర్గాడ్
సంస్థకు
ఏరోస్పేస్,
రక్షణ,
ఆటోమొబైల్,
అడ్వాన్స్డ్
మాన్యుఫ్యాక్చరింగ్
రంగాల్లో
విశేష
అనుభవం
ఉంది.


రష్మి
గ్రూప్
రాష్ట్రంలో
12500కోట్ల
పెట్టుబడులు

ముఖ్యమంత్రి
రేవంత్
రెడ్డి
మాట్లాడుతూ..
వరంగల్,
ఆదిలాబాద్‌లలో
రెండు
కొత్త
విమానాశ్రయాలు
ఏర్పాటు
చేస్తున్నామని,

ప్రాంతాల్లో
ఏదైనా
ఒక
చోట
సర్గడ్
సంస్థ
తమ
మెయింటెనెన్స్
అండ్
రిపేర్
యూనిట్
కేంద్రం
ఏర్పాటు
చేసే
అవకాశాలను
పరిశీలించాలని
సంస్థ
సీఈఓకు
సూచించారు.
డక్ట్రెల్
ఐరన్
పైపుల
తయారీలో
ప్రపంచవ్యాప్తంగా
గుర్తింపు
పొందిన
రష్మి
గ్రూప్
రాష్ట్రంలో
12500కోట్ల
రూపాయల
పెట్టుబడితో
స్టీల్
ఉత్పత్తి
యూనిట్
ఏర్పాటు
చేసేందుకు
ముందుకొచ్చింది.


12
వేల
మందికి
ప్రత్యక్షంగా,
పరోక్షంగా
ఉద్యోగాలు

దావోస్
లో
జరుగుతున్న
ప్రపంచ
ఆర్థిక
వ్యవస్థ
వేదికపై
ఇందుకు
సంబంధించి
ముఖ్యమంత్రి
రేవంత్
రెడ్డి
నేతృత్వంలోని
తెలంగాణ
రైజింగ్
ప్రతినిధి
బృందంతో
అవగాహన
ఒప్పందం
కుదుర్చుకుంది.

ప్రాజెక్టు
ద్వారా
రాష్ట్రంలో
12
వేల
మందికి
ప్రత్యక్షంగా,
పరోక్షంగా
ఉద్యోగాలు
వచ్చే
అవకాశం
ఉంది.


ఏబీ
ఇన్
బెవ్
ప్రపంచంలోనే
అతిపెద్ద
బీర్
తయారీ
కంపెనీ
పెట్టుబడులు

ప్రపంచంలో
అతిపెద్ద
బీరు
తయారీ
సంస్థ
ఏబీ
ఇన్
బెవ్…
తెలంగాణలో
ఇప్పటికే
ఉన్న
తమ
తయారీ
యూనిట్
ను
విస్తరించేందుకు
భారీగా
పెట్టుబడి
పెట్టనున్నట్లు
వెల్లడించింది.
మరొక
సమావేశంలో
టాటా
ఛైర్మన్
నటరాజన్
చంద్రశేఖరన్
తో
ముఖ్యమంత్రి
రేవంత్
రెడ్డి
భేటీ
అయి..
విజన్-2047
లక్ష్యాలు,
పెట్టుబడులకు
ఉన్న
అనుకూల
విధానాలను
వివరించారు.


భారత్-స్విట్జర్లాండ్
మధ్య
ఉన్న
ఫ్రీ
ట్రేడ్
ఒప్పందంతో
సహకారంపై
చర్చలు

అంతేకాదు
తెలంగాణ
ముఖ్యమంత్రి
రేవంత్
రెడ్డి,
స్విట్జర్లాండ్‌లోని
వాడ్
(Vaud)
కౌన్సిల్
ముఖ్యమంత్రి
క్రిస్టెల్
లూసియర్
బ్రోడార్డ్‌తో
చర్చలు
నిర్వహించారు.
భారత్-స్విట్జర్లాండ్
మధ్య
ఉన్న
ఫ్రీ
ట్రేడ్
ఒప్పందం
నేపథ్యంలో
రెండు
రాష్ట్రాల
మధ్య
సహకారం,
భాగస్వామ్య
అవకాశాలపై
విస్తృతంగా
చర్చ
జరిగింది.ఈ
సందర్భంగా
ముఖ్యమంత్రి
రేవంత్
రెడ్డి
‘తెలంగాణ
రైజింగ్
2047’
విజన్‌ను
స్విస్
ప్రతినిధులకు
వివరించారు.


హైదరాబాద్‌లో
ప్రపంచంలోనే
తొలి
స్విస్
మాల్

రాష్ట్రంలో
పెట్టుబడులకు
అనుకూల
వాతావరణం,
మౌలిక
వసతులు,
యువత
నైపుణ్య
అభివృద్ధి,
మహిళా
సాధికారతపై
తెలంగాణ
ప్రభుత్వం
తీసుకుంటున్న
చర్యలను
వివరించారు.
అదే
సమయంలో
హైదరాబాద్‌లో
ప్రపంచంలోనే
తొలి
‘స్విస్
మాల్’
నిర్మాణ
ఆలోచనను
ప్రతిపాదించారు.

ప్రతిపాదనకు
స్విస్
ప్రతినిధి
బృందం
సానుకూలంగా
స్పందించటంతో
తెలంగాణా
దావోస్
సదస్సులో
భారీ
పెట్టుబడులను
ఆకర్షించినట్టు
అయ్యింది.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related