రూ.9499 ధరకు 32 అంగుళాల స్మార్ట్‌టీవీ.. వాయిస్‌ కమాండ్‌తో పనిచేసే రిమోట్‌ సహా ..!

Date:


oi
-Suravarapu Dileep

THOMSON 32 Inch JioTele OS Smart LED TV : థామ్సన్‌ సంస్థ భారత్‌ మార్కెట్‌ లో తాజాగా 32 అంగుళాల QLED స్మార్ట్‌ TV ను లాంచ్ చేసింది. రూ.10 వేల ధర విడుదల చేసింది. JioTele OS టెలివిజన్‌ సపోర్టుతో తీసుకొచ్చింది. ఈ స్మార్ట్‌ టీవీలో లైవ్ టీవీ ఛానళ్లు, ఓటీటీ ప్లాట్‌ఫాంలు, గేమ్స్‌ సహా అనేక విధాలుగా ఉపయోగించుకోవచ్చు. ఇన్‌ బల్ట్‌ వాయిస్‌తో రిమోట్‌ను కలిగి ఉంది.

రూ.9499 ధరకు అందుబాటులోకి :
థామ్సన్‌ 32 అంగుళాల JioTele OS QLED టీవీ మోడల్‌ నంబర్‌ 32TJHQ002 ధర రూ.9499 గా ఉంది. జనవరి 22 వ తేదీ నుంచి సేల్‌ ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. రూ.10 వేల ధరలో 32 అంగుళాల టీవీల కోసం చూస్తున్న వారికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది.

32 అంగుళాల స్మార్ట్‌ టీవీ :
థామ్సన్‌ 32 అంగుళాల LED స్మార్ట్‌టీవీ బెజెల్‌ లెస్‌ QLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 1366 x 768 పిక్సల్స్‌ HD రెడ్‌ రిజల్యూషన్‌ ను కలిగి ఉంది. 350 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, HDR సపోర్టుతో అందుబాటులో ఉంది. యూజర్ల అలవాట్లకు అనుగుణంగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత సిఫార్సులను అందిస్తుంది. దీంతోపాటు స్పోర్ట్స్‌ మోడ్‌ కూడా ఉంది.

JioTele OS :
ఈ LED స్మార్ట్‌ టీవీ JioTele OS పైన పనిచేస్తుంది. యూజర్లు సౌకర్యవంతంగా వినియోగించుకొనేలా ఇంటర్‌ ఫేస్‌ ఉంటుందని తెలుస్తోంది. 400 లకు పైగా ఉచిత లైవ్‌ టీవీ ఛానళ్లు, 300 కి పైగా జియో గేమ్స్‌ ను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు అనేక ఓటీటీ యాప్స్‌ ను కూడా సపోర్టు చేస్తుంది.

36W స్టీరియో స్పీకర్లు :
థామ్సన్‌ 32 అంగుళాల JioTele OS టీవీ 36W స్టీరియో బాక్స్‌ స్పీకర్లను కలిగి ఉంది. నాణ్యమైన, భారీ సౌండ్ కావాల్సిన యూజర్లకు అనుకూలంగా ఉంటుంది. ఈ స్మార్ట్‌ టీవీ స్పోర్ట్స్‌, సౌండ్‌, మ్యూజిక్‌ మోడ్స్‌ ను కలిగి ఉంది. అంటే సినిమాలు, మ్యూజిక్‌, లైవ్‌ స్పోర్ట్స్‌ అవుట్‌పుట్‌ లను వేర్వేరుగా అందిస్తుంది.

ఈ LED టీవీ Amlogic ప్రాసెసర్‌ ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ 1GB ర్యామ్, 8GB అంతర్గత స్టోరేజీని సపోర్టు చేస్తుంది. స్ట్రీమింగ్‌, సాధారణ గేమింగ్‌, టీవీ ఛానళ్ల వినియోగానికి అనువుగా ఉంటుంది. థామ్సన్ స్మార్ట్‌ టీవీ డ్యూయల్‌ బ్యాండ్ వైఫై సపోర్టును కలిగి ఉంది. రెండు HDMI పోర్టులున్నాయి. దీంతోపాటు రెండు USB పోర్టులను కలిగి ఉంది.

వాయిస్‌ కమాండ్‌తో రిమోట్‌ :
ఈ స్మార్ట్‌టీవీ బిల్ట్‌ ఇన్‌ వాయిస్‌ సెర్చ్‌ ఫీచర్‌ కూడా ఉంది. వాయిస్‌ కమాండ్‌ ద్వారా యూజర్లకు సెర్చ్‌ చేసుకోవచ్చు. రిమోట్‌ కూడా మైక్రోఫోన్‌ సపోర్టును కలిగి ఉంది. నెట్‌ఫ్లిక్స్‌ (Netflix), జియో సినిమా, జియోహాట్‌స్టార్‌ (Jiohotstar), యూట్యూబ్‌ (Youtube) కోసం ప్రత్యేక బటన్స్‌ ఉన్నాయి.

Best Mobiles in India



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Nontoxic Cookware for the New Year

I spend a lot of time thinking about...

8 Best Wayfair Furniture Deals Inspired by My Frugal Mom

I don’t drop my hard-earned cash easily, and...

Free cataract surgeries for drivers

An initiative titled ‘Driver Drishti Campaign’ has been launched...