Telangana
oi-Lingareddy Gajjala
గ్రూప్-1
మెయిన్స్
పరీక్షలపై
నేడు
తుది
తీర్పు
వెలువడుతుందని
ఆశించిన
వేలాది
మంది
అభ్యర్థుల
ఆశలు
నెరవేరలేదు.
హైకోర్టు
నుంచి
ఊహించని
ట్విస్ట్
ఎదురవడంతో
తీర్పు
మరోసారి
వాయిదా
పడింది.
తెలంగాణ
రాష్ట్ర
పబ్లిక్
సర్వీస్
కమిషన్
(TSPSC)
నిర్వహించిన
గ్రూప్-1
మెయిన్స్
పరీక్ష
ఫలితాలపై
గత
కొంతకాలంగా
న్యాయపరమైన
వివాదం
కొనసాగుతోంది.
మూల్యాంకనంలో
లోపాలు
జరిగాయని,
మార్కుల
కేటాయింపులో
పారదర్శకత
లేదని
పలువురు
అభ్యర్థులు
ఆరోపిస్తూ
హైకోర్టును
ఆశ్రయించారు.
ఈ
పిటిషన్లను
విచారించిన
హైకోర్టు
సింగిల్
బెంచ్
కీలక
తీర్పు
ఇచ్చింది.
సింగిల్
బెంచ్
తీర్పులో
గ్రూప్-1
మెయిన్స్
ఫలితాలను
రద్దు
చేసి,
తిరిగి
మూల్యాంకనం
(రీ-వాల్యుయేషన్)
చేయాలని
ఆదేశించింది.
ఈ
తీర్పు
వెలువడిన
వెంటనే
అభ్యర్థుల్లో
ఆశలు
చిగురించగా,
ప్రభుత్వం
మరియు
TSPSC
ఆందోళన
వ్యక్తం
చేశాయి.
ఈ
నేపథ్యంలో
సింగిల్
బెంచ్
తీర్పును
సవాల్
చేస్తూ
రాష్ట్ర
ప్రభుత్వం,
TSPSCలు
హైకోర్టు
డివిజన్
బెంచ్‌ను
ఆశ్రయించాయి.
డివిజన్
బెంచ్
సింగిల్
బెంచ్
ఇచ్చిన
రీ-వాల్యుయేషన్
ఆదేశాలపై
స్టే
విధించింది.
అయితే
నియామకాలు
తుది
తీర్పుకు
లోబడే
ఉంటాయని
స్పష్టం
చేసింది.
ఈ
స్టే
నేపథ్యంలో
ప్రభుత్వం
గ్రూప్-1
నియామక
ప్రక్రియను
కొనసాగించింది.
ఇప్పటికే
ఈ
పరీక్ష
ద్వారా
ఎంపికైన
562
మందికి
నియామక
పత్రాలు
కూడా
అందజేసింది.
అయితే
ఈ
నియామకాలు
కోర్టు
తుది
తీర్పుపై
ఆధారపడి
ఉండటంతో,
ఉద్యోగాలు
పొందిన
అభ్యర్థుల్లోనూ,
కేసు
వేసిన
అభ్యర్థుల్లోనూ
అనిశ్చితి
కొనసాగుతోంది.
ఈ
కేసుపై
నేడు
తుది
తీర్పు
వెలువడుతుందని
భావించిన
అభ్యర్థులు
ఉదయం
నుంచే
హైకోర్టు
నిర్ణయంపై
ఉత్కంఠగా
ఎదురు
చూశారు.
గురువారం
ఈ
కేసును
విచారించిన
హైకోర్టు
డివిజన్
బెంచ్,
తీర్పు
కాపీ
ఇంకా
సిద్ధం
కాలేదని
లాయర్లకు
తెలియజేసి,
తదుపరి
విచారణను
ఫిబ్రవరి
5కు
వాయిదా
వేసింది.
కానీ
అనూహ్యంగా
తీర్పు
కాపీ
సిద్ధం
కాలేదని
డివిజన్
బెంచ్
వెల్లడించడంతో
విచారణను
ఫిబ్రవరి
5కు
వాయిదా
వేసింది.
దీంతో
నేడు
తీర్పు
వస్తుందన్న
అంచనాలు
పూర్తిగా
తారుమారయ్యాయి.
గ్రూప్-1
మెయిన్స్
ఎగ్జామ్
భవితవ్యాన్ని
నిర్ణయించే
కీలక
తీర్పు
కోసం
అభ్యర్థులు
మరోసారి
ఎదురుచూడాల్సిన
పరిస్థితి
ఏర్పడింది.
ఫిబ్రవరి
5న
వెలువడే
తీర్పుతో
గ్రూప్-1
మెయిన్స్
ఫలితాలపై
స్పష్టత
రావడంతో
పాటు,
ఇప్పటికే
ఇచ్చిన
నియామకాలు
కొనసాగుతాయా?
లేదా
తిరిగి
మూల్యాంకనం
జరుగుతుందా?
అన్న
టెన్షన్
కొనసాగుతోంది


