Business
oi-Lingareddy Gajjala
దేశవ్యాప్తంగా
బ్యాంకు
ఖాతాదారులకు
ముఖ్య
గమనిక.
ఈ
నెలలో
వరుసగా
నాలుగు
రోజుల
పాటు
బ్యాంకులకు
సెలవులు
రావడంతో
బ్యాంకింగ్
సేవలు
తాత్కాలికంగా
నిలిచిపోనున్నాయి.
వరుస
సెలవులు
మరియు
సమ్మె
కారణంగా
బ్రాంచ్‌లలో
లావాదేవీలపై
ప్రభావం
పడే
అవకాశం
ఉందని
బ్యాంకు
వర్గాలు
వెల్లడించాయి.
24వ
తేదీ
చివరి
శనివారం
కావడంతో
ప్రభుత్వ,
ప్రైవేట్
బ్యాంకులు
పనిచేయవు.
సాధారణంగా
రెండో,
నాలుగో
శనివారాల్లో
బ్యాంకులకు
సెలవు
ఉండటంతో,
ఈ
రోజు
బ్రాంచ్‌లు
పూర్తిగా
మూసివేస్తారు.
దీని
వల్ల
ఖాతాదారులు
ప్రత్యక్షంగా
బ్యాంకింగ్
సేవలు
పొందలేరు.
అదే
విధంగా
25వ
తేదీ
ఆదివారం
కావడంతో
వారాంతపు
సెలవు
కొనసాగుతుంది.
వరుసగా
రెండు
రోజులు
బ్యాంకులు
పనిచేయకపోవడంతో
నగదు
లావాదేవీలు,
చెక్
డిపాజిట్‌లు,
ఇతర
బ్రాంచ్
సేవలు
నిలిచిపోతాయి.
ముఖ్యంగా
వృద్ధులు,
గ్రామీణ
ప్రాంత
ఖాతాదారులకు
ఇబ్బందులు
తలెత్తే
అవకాశముంది.
ఇక
26వ
తేదీ
రిపబ్లిక్
డే
సందర్భంగా
దేశవ్యాప్తంగా
జాతీయ
సెలవు
ప్రకటించారు.
ఈ
రోజున
అన్ని
బ్యాంకులతో
పాటు
ప్రభుత్వ
కార్యాలయాలు
కూడా
మూసి
ఉంటాయి.
బ్యాంకింగ్
వ్యవస్థ
పూర్తిగా
నిలిచిపోవడంతో
చెక్
క్లియరెన్స్,
నెట్
సెటిల్‌మెంట్
ప్రక్రియలపై
ప్రభావం
పడనుంది.
దీనికి
తోడు
27వ
తేదీన
దేశవ్యాప్తంగా
బ్యాంకు
ఉద్యోగులు
సమ్మెకు
పిలుపునిచ్చారు.
ఈ
సమ్మె
కారణంగా
బ్యాంకింగ్
సేవలు
మరింతగా
అంతరాయం
చెందే
అవకాశముంది.
అయితే
ATMలు,
ఆన్‌లైన్
బ్యాంకింగ్
సేవలు
సాధారణంగా
కొనసాగుతాయని
అధికారులు
తెలిపారు.
ఖాతాదారులు
అవసరమైన
బ్యాంకింగ్
పనులను
ముందుగానే
పూర్తి
చేసుకోవాలని
సూచించారు.


