Telangana
oi-Bomma Shivakumar
దేశంలోనే
తెలంగాణను
ఏఐ
డేటా
సెంటర్
హబ్
గా
తీర్చిదిద్దే
లక్ష్యంతో
రాష్ట్ర
ప్రభుత్వం
మరో
కీలక
పెట్టుబడిని
సాధించింది.
ముఖ్యమంత్రి
రేవంత్
రెడ్డి
నేతృత్వంలోని
‘తెలంగాణ
రైజింగ్’
బృందం
దావోస్
లో
యూపీసీ
ఓల్ట్
సంస్థతో
అవగాహన
ఒప్పందం
(ఎంఓయూ)
కుదుర్చుకుంది.
యూపీసీ
ఓల్ట్
సీఈఓ
హాన్
డీ
గ్రూట్,
యూపీసీ
రిన్యూవబుల్స్
ఏపీఏసీ
సహ
వ్యవస్థాపకుడు
స్టీవెన్
జ్వాన్,
యూపీసీ
రిన్యూవబుల్స్
ఇండియా
సీఈఓ
అలోక్
నిగమ్
తో
ముఖ్యమంత్రి
ప్రత్యేకంగా
సమావేశమయ్యారు.
నెదర్లాండ్స్
కు
చెందిన
యూపీసీ
రిన్యూవబుల్స్
గ్రూప్,
ఓల్ట్
డేటా
సెంటర్స్
కలిసి
యూపీసీ
ఓల్ట్
సంస్థగా
ఏర్పడింది.
రాష్ట్ర
ప్రభుత్వంతో
చేసుకున్న
ఒప్పందం
ప్రకారం
ఈ
సంస్థ
భారత్
ఫ్యూచర్
సిటీలో
100
మెగావాట్ల
సామర్థ్యంతో
ఏఐకు
అనుకూలమైన
డేటా
సెంటర్
నెలకొల్పనుంది.
ఈ
ప్రాజెక్టుకు
ఐదేళ్లలో
రూ.
5,000
కోట్ల
పెట్టుబడి
పెట్టనుంది.
ఈ
డేటా
సెంటర్
కు
అవసరమైన
విద్యుత్
సరఫరాకు
100
మెగావాట్ల
సామర్థ్యంతో
ప్రత్యేక
పునరుత్పాదక
విద్యుత్
ప్లాంట్
ఏర్పాటు
చేయనుంది.
ఈ
ప్రాజెక్టు
నిర్మాణ
దశలోనే
3
వేల
మందికి
పైగా
ప్రత్యక్షంగా,
పరోక్షంగా
ఉద్యోగావకాశాలు
లభిస్తాయి.
డేటా
సెంటర్
ప్రారంభమైన
తర్వాత
మరో
800
మందికి
ఉద్యోగ
అవకాశాలు
ఉండనున్నాయి.
ఈ
సందర్భంగా
ముఖ్యమంత్రి
రేవంత్
రెడ్డి
మాట్లాడుతూ..
2047
నాటికి
మూడు
ట్రిలియన్
డాలర్ల
ఆర్థిక
వ్యవస్థగా
తెలంగాణను
తీర్చిదిద్దడంలో
ఆధునిక
డిజిటల్
మౌలిక
వసతులు
కీలక
పాత్ర
పోషిస్తాయని
అన్నారు.
పర్యావరణ
పరిరక్షణతో
పాటు
అభివృద్ధిని
సాధించడమే
రాష్ట్ర
లక్ష్యమని
స్పష్టం
చేశారు.
ఇదే
విషయంపై
ఐటీ,
పరిశ్రమల
శాఖ
మంత్రి
దుద్దిళ్ల
శ్రీధర్
బాబు
మాట్లాడుతూ..
అధునాతన
ఏఐ
డేటా
సెంటర్ల
ఏర్పాటుకు
అవసరమైన
ప్రోత్సాహకాలు,
సౌకర్యాలు
రాష్ట్ర
ప్రభుత్వం
కల్పిస్తుందన్నారు.
నెట్
జీరో
సిటీ
అభివృద్ధే
తెలంగాణ
విజన్
లో
భాగమని
అన్నారు.
రెవెన్యూ
మంత్రి
పొంగులేటి
శ్రీనివాస
రెడ్డి
ఈ
సమావేశంలో
పాల్గొన్నారు.


