International
-Lingareddy Gajjala
అంతర్జాతీయ
రాజకీయాల్లో
ఒక
సంచలనం..
ప్రపంచ
ఆరోగ్య
వ్యవస్థలో
ఒక
పెనుమార్పు!
అమెరికా
మాజీ
అధ్యక్షుడు
డొనాల్డ్
ట్రంప్
ఏడాది
క్రితం
విసిరిన
బాణం
ఇప్పుడు
లక్ష్యాన్ని
చేరింది.
ఏడాది
నోటీసు
పీరియడ్
ముగియడంతో,
ప్రపంచ
ఆరోగ్య
సంస్థ
(WHO)
నుండి
అమెరికా
అధికారికంగా
బయటకు
వచ్చేసింది.
ఇది
కేవలం
ఒక
సంస్థ
నుండి
వైదొలగడం
మాత్రమే
కాదు,
ప్రపంచ
ఆరోగ్య
భద్రతలో
ఒక
బిగ్
టర్న్
అనే
చర్చ
మొదలైంది.
ఈ
నిర్ణయానికి
వెనుక
ఉన్న
ప్రధాన
కారణం
డబ్బు,
రాజకీయం.
“ప్రపంచం
మొత్తం
అమెరికాను
దోచుకుంటోంది,
WHO
అందుకు
మినహాయింపు
కాదు”
అంటూ
ట్రంప్
చేసిన
వ్యాఖ్యలు
అప్పట్లో
ప్రకంపనలు
సృష్టించాయి.
చైనా
జనాభా
అమెరికా
కంటే
మూడు
రెట్లు
ఉన్నప్పటికీ,
వారు
చెల్లించే
విరాళం
అమెరికా
కంటే
90
శాతం
తక్కువగా
ఉండటంపై
ట్రంప్
తీవ్ర
అసంతృప్తి
వ్యక్తం
చేశారు.
కోవిడ్-19
సమయంలో
WHO
వ్యవహరించిన
తీరు,
చైనాకు
అనుకూలంగా
ఉందనే
ఆరోపణలు
ఈ
నిర్ణయానికి
ఆజ్యం
పోశాయి.
సంస్థ
స్వతంత్రంగా
వ్యవహరించలేకపోతోందని
వైట్‌హౌస్
మెమోలో
ఘాటుగా
పేర్కొన్నారు.
నిధుల
‘కోత’..
ప్రాణాలకు
‘ముప్పు’?
అమెరికా
నిష్క్రమణ
WHOపై
పెను
ప్రభావాన్ని
చూపనుంది.
ఏటా
160
మిలియన్ల
నుండి
815
మిలియన్
డాలర్ల
వరకు
నిధులు
అందించే
అతిపెద్ద
దాతను
కోల్పోవడం
వల్ల..
దాదాపు
అంతం
కావచ్చిన
పోలియో
మళ్లీ
విజృంభించే
ప్రమాదం
ఉంది.
కొత్త
వైరస్‌లను
గుర్తించే
‘గ్లోబల్
సర్వైలెన్స్’
వ్యవస్థ
బలహీనపడవచ్చు.
టీకాలు,
సాంకేతిక
సాయం
కోసం
WHOపై
ఆధారపడే
వెనుకబడిన
దేశాలకు
ఇది
కోలుకోలేని
దెబ్బ.
నాయకత్వ
ఖాళీ
–
ఎవరికి
లాభం?
“నిజమైన
సంస్కరణలు
రావాలంటే
సంస్థలో
ఉండి
పోరాడాలి
కానీ,
వదిలి
వెళ్లడం
పరిష్కారం
కాదు”
అని
ప్రజారోగ్య
నిపుణుడు
డాక్టర్
టామ్
ఫ్రీడెన్
హెచ్చరించారు.
అమెరికా
వైదొలగడం
వల్ల
ప్రపంచ
ఆరోగ్య
నిర్ణయాల్లో
ఆ
దేశం
తన
వాయిస్
కోల్పోతుంది.
ఈ
ఖాళీని
భర్తీ
చేయడానికి
చైనా
లేదా
ఇతర
దేశాలు
ప్రయత్నిస్తే,
అంతర్జాతీయ
ఆరోగ్య
దౌత్యం
పూర్తిగా
మారిపోయే
అవకాశం
ఉంది.
WHO
ఆవేదన..
ఆశావహం!
అమెరికా
నిర్ణయంపై
WHO
భావోద్వేగంగా
స్పందించింది.
“1948లో
సంస్థ
స్థాపన
నుండి
అమెరికా
మాకు
వెన్నెముకగా
ఉంది.
మశూచిని
అంతం
చేశాం,
పోలియోను
తరిమికొట్టే
దశకు
చేరాం.
అమెరికా
తన
నిర్ణయాన్ని
పునరాలోచిస్తుందని
ఆశిస్తున్నాం”
అని
పేర్కొంది.
ట్రంప్
అమెరికా
ఫస్ట్
విధానంలో
భాగంగా
తీసుకున్న
ఈ
పెద్ద
నిర్ణయం
దేశీయంగా
ఆయన
మద్దతుదారులను
ఖుషీ
చేయవచ్చు
కానీ,
అంతర్జాతీయంగా
మాత్రం
అమెరికాను
ఒంటరిని
చేసే
ప్రమాదం
ఉందని
విశ్లేషకులు
భావిస్తున్నారు.
సుమారు
228
మిలియన్ల
డాలర్లు
బాకీని
చెల్లించకుండానే
వైదొలగడం
ఇప్పుడు
మరో
వివాదానికి
తెరలేపింది.
ప్రపంచం
మరో
మహమ్మారి
ముంగిట
నిల్చుంటే..
సమన్వయం
చేసే
నాయకుడు
లేని
స్థితికి
ఇది
దారితీస్తుందా?
కాలమే
సమాధానం
చెప్పాలి.


