క్షణికావేశంలో నలుగురి ప్రాణం తీశాడు! జార్జియాలో ఏం జరిగింది?

Date:


International

oi-Lingareddy Gajjala

కన్న
కలలను
నిజం
చేసుకునేందుకు,
ఉజ్వల
భవిష్యత్తును
వెతుక్కుంటూ
ఏడడుగుల
బంధంతో
సప్తసముద్రాలు
దాటి
వెళ్లిన

కుటుంబం..
క్షణికావేశంలో
జరిగిన
ఘర్షణకు
బలైపోయింది.
అమెరికాలోని
జార్జియా
రాష్ట్రంలో
చోటుచేసుకున్న

దారుణ
ఘటన
ఇప్పుడు
భారతీయ
సమాజాన్ని
ఉలిక్కిపడేలా
చేసింది.
నలుగురు
పెద్దల
ప్రాణాలు
గాలిలో
కలిసిపోగా,
ముగ్గురు
చిన్నారులు
ప్రాణభయంతో
అల్మారాలో
దాక్కున్న
వైనం
కళ్లు
చెమర్చిస్తోంది.

జార్జియాలోని
లారెన్స్‌
విల్లేలో
ఉన్న
బ్రూక్
ఐవీ
కోర్ట్
నివాసంలో
జనవరి
23వ
తేదీ
తెల్లవారుజామున
2:30
గంటల
సమయంలో
ఒక్కసారిగా
తుపాకీ
పేలుళ్లు
వినిపించాయి.
ఇంట్లోని
పెద్దల
మధ్య
మొదలైన
చిన్నపాటి
వాగ్వివాదం
చినికి
చినికి
గాలివానలా
మారి,
చివరకు
రక్తపాతానికి
దారితీసింది.
కుటుంబ
సభ్యులతో
వాగ్వాదానికి
దిగిన
నిందితుడు,
కోపంతో
ఊగిపోయి
తన
వద్ద
ఉన్న
తుపాకీతో
విచక్షణా
రహితంగా
కాల్పులు
జరిపాడు.

కాల్పుల్లో
భారతీయ
సంతతికి
చెందిన
ఒక
మహిళతో
పాటు
మరో
ముగ్గురు
బంధువులు
అక్కడికక్కడే
మరణించారు.

అల్మారాలో
చిన్నారులు..
భయానక
క్షణాలు


దారుణ
కాండ
జరుగుతున్న
సమయంలో
ఇంట్లోనే
ఉన్న
ముగ్గురు
చిన్నపిల్లలు
ప్రాణభయంతో
వణికిపోయారు.
తుపాకీ
శబ్దాలు
విని
వారు
బెడ్రూంలోని
అల్మారాలో
దాక్కున్నారు.
బయట
తమ
కళ్ల
ముందే
ఆత్మీయులు
కుప్పకూలిపోతుంటే,

చిన్నారులు
అనుభవించిన
నరకం
వర్ణనాతీతం.

తర్వాత
ఒక
చిన్నారి
ధైర్యం
చేసి
911కు
ఫోన్
చేసి
సమాచారం
అందించడంతో
పోలీసులు
రంగప్రవేశం
చేశారు.
నిందితుడిని
పోలీసులు
ఇంటి
సమీపంలోనే
అదుపులోకి
తీసుకున్నారు.

ప్రాథమిక
దర్యాప్తులో
బయటపడిన
వివరాల
ప్రకారం,
విజయ్
కుమార్
(51)
కుటుంబ
తగాదాల
నేపథ్యంలో

ఘాతుకానికి
పాల్పడినట్లు
పోలీసులు
నిర్ధారించారు.
ఆవేశంలో
అతడు
తన
భార్యతో
పాటు
బంధువులపై
తుపాకీతో
కాల్పులు
జరిపినట్లు
వెల్లడైంది.
ఘటన
అనంతరం
విజయ్
కుమార్‌ను
పోలీసులు
అదుపులోకి
తీసుకొని
అరెస్ట్
చేశారు.

మృతుల
వివరాలు..


కాల్పుల్లో
మీను
డోగ్రా
(43)

విజయ్
కుమార్
భార్య,
గౌరవ్
కుమార్
(33)

బంధువు,
నిధి
చందర్
(33)

బంధువు,
హరీష్
చందర్
(38)

నిధి
చందర్
భర్త
మృతి
చెందారు.
అందరూ
అక్కడికక్కడే
ప్రాణాలు
కోల్పోయినట్లు
పోలీసులు
తెలిపారు.
ఇంట్లోనే
జరిగిన

హత్యలు
కుటుంబ
సభ్యుల
మధ్య
నెలకొన్న
వివాదం
ఎంత
తీవ్ర
స్థాయికి
చేరిందో
చెప్పకనే
చెబుతున్నాయి.

అండగా
ఎంబసీ..


ఘటనపై
అట్లాంటాలోని
భారత
కాన్సులేట్
జనరల్
తీవ్ర
దిగ్భ్రాంతి
వ్యక్తం
చేసింది.
బాధితుల
కుటుంబ
సభ్యులతో
తాము
టచ్‌లో
ఉన్నామని,
స్థానిక
అధికారులతో
సమన్వయం
చేసుకుంటూ
అవసరమైన
సహాయ
సహకారాలు
అందిస్తున్నామని
ఒక
ప్రకటనలో
తెలిపారు.
మృతదేహాలను
భారత్‌కు
పంపే
ఏర్పాట్లపై
చర్చలు
జరుగుతున్నాయి.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related