Telangana
oi-Sai Chaitanya
Phone
tapping
case:
ఫోన్
ట్యాపింగ్
కేసు
కొత్త
మలుపు
తీసుకుంటోంది.
రాజకీయంగా
ఈ
అంశం
చర్చగా
మారుతోంది.
వరుసగా
హరీష్..
ఆ
తరువాత
కేటీఆర్
విచారణతో
ఈ
కేసులో
కొత్త
అంశాలు
తెర
మీదకు
వస్తున్నాయి.
ఈ
కేసులో
బీఆర్ఎస్
నేతల
పై
చర్యలు
తీసుకోవటం
లేదంటూ
బీజేపీ
ఆరోపిస్తోంది.
ఫోన్
ట్యాపింగ్
కేసులో
బీఆర్ఎస్
వాదన
భిన్నంగా
ఉంది.
ఇదే
సమయంలో
ఈ
కేసులో
ప్రభుత్వం
ఇక
కఠిన
చర్యలకు
సిద్దం
అవుతోంది.
ఈ
పరిణామాలు
రాజకీయంగా
కొత్త
టర్న్
తీసుకునే
అవకాశం
కనిపిస్తోంది.
ఫోన్
ట్యాపింగ్
పై
మంత్రి
జూపల్లి
కీలక
ప్రకటన
చేసారు.
ఈ
కేసులో
దోషులను
కఠినంగా
శిక్ష
పడేలా
చూస్తామని
తెలిపారు.
ఫోన్‌ట్యాపింగ్
అనేది
చాలా
దుర్మార్గమని..
దానిని
రాజకీయ
కక్ష్య
అని
అనడం
సరికాదని
ఆయన
అన్నారు.
ప్రజాస్వామ్య
పద్ధతిలో
దర్యాప్తు
జరుగుతుందని
స్పష్టం
చేశారు.
ఫోన్‌ట్యాపింగ్‌లో
పాత్రధారులెవరో,
సూత్రధారులెవరో
తెలియాల్సి
ఉందన్న
మంత్రి..
దీనిని
దిగజారుడు
తనమే
అంటారని
చెప్పుకొచ్చారు.
ప్రజాధనంతో
నడిచేది
విజిలెన్స్
డిపార్ట్
మెంట్
అని
తెలిపారు.
ఫోన్‌ట్యాపింగ్
కేసును
నిష్పక్షపాతంగా
దర్యాప్తు
చేస్తామని
మంత్రి
జూపల్లి
తెలిపారు.
ప్రవీణ్
కుమార్
కూడా
ఫోన్‌ట్యాపింగ్
అయిందని
గతంలో
మాట్లాడారని
గుర్తుచేశారు.
ఐఏఎస్
అధికారులు
ఆకునూరి
మురళి
సైతం
ఈ
అంశం
గురించి
మాట్లాడారని
చెప్పుకొచ్చారు.
మాజీ
గవర్నర్
తమిళసై
ఫోన్
కూడా
ట్యాపింగ్
జరిగిందని
చెప్పారని
ప్రస్తావించారు.
మాజీ
మంత్రి
కేటీఆర్
సహా
మరి
కొందరి
ఫోన్లు
ట్యాపింగ్
అయ్యుండొచ్చని
ఒప్పుకున్నారని
వివరించారు.
కఠిన
చర్యలు
తెలంగాణ
రాష్టం
ఏర్పాటు
చేసుకున్నది
ప్రజల
సమస్యలు
పరిష్కారం
కోసమేనని
స్పష్టం
చేశారు.
కేటీఆర్‌కు
160
సీఆర్పీసీ
కింద
మాత్రమే
నోటీసులు
ఇచ్చారని..
నేరస్థులుగా
పరిగణించలేదని
ఈ
సందర్భంగా
మంత్రి
తెలిపారు.
సాక్షిగా
సమాచారం
కోసమే
పోలీసులు
కేటీఆర్‌ను
విచారణకు
పిలిచారన్నారు.
తెలంగాణ
ఉద్యమంలో
కేసీఆర్‌తో
పాటు
కీలక
పాత్ర
పోషించిన
కోదండరామ్‌నూ
గతంలో
అక్రమంగా
అరెస్ట్
చేశారని
వెల్లడించారు.
చట్టం
ప్రకారం
నోటీసులిచ్చి
పోలీసులు
విచారిస్తారని
చెప్పారు.
ఎస్ఐబీ
మాజీ
చీఫ్
ప్రభాకర్
రావు..
అమెరికాకు
ఎందుకు
వెళ్లిపోయారని
నిలదీశారు.
సుప్రీంకోర్టు
ఆదేశాల
మేరకు
ప్రభాకర్
రావు
అమెరికా
నుంచి
ఇండియాకు
వచ్చారని
వివరించారు.
రాష్ట్ర
ఆర్థిక
పరిస్థితుల్లో
మార్పులు
రావడానికి
చాలా
కారణాలున్నాయని
చెప్పారు.
పార్టీలకు
అతీతంగా
అందరూ
విచారణకు
వచ్చారని
మంత్రి
జూపల్లి
వివరించారు.
దీని
పైన
మున్సిపల్
ఎన్నికల
వేళ
ప్రధాన
ప్రచారస్త్రంగా
మారుతోంది.
స్థానిక
సంస్థల
ఎన్నికల
తరువాత
ఈ
కేసులో
కీలక
పరిణామాలు
చోటు
చేసుకుంటాయనే
అంచనాలు
వ్యక్తం
అవుతున్నాయి.
త్వరలోనే
కేసీఆర్
కు
నోటీసులు
ఇస్తారనే
ప్రచారం
పొలిటికల్
సర్కిల్స్
లో
వినిపిస్తున్నాయి.
దీంతో..
ఈ
కేసు
పైన
రాజకీయంగా
ఒత్తిడి
పెరుగుతున్న
వేళ
రానున్న
అసెంబ్లీ
సమావేశాల
వేదికగా
కీలక
చర్చ..
నిర్ణయం
వచ్చే
అవకాశం
కనిపిస్తోంది.
దీంతో..
రానున్న
రోజుల్లో
చోటు
చేసుకొనే
పరిణామాల
పైన
ఉత్కంఠ
కొనసాగుతోంది.


