Telangana
oi-Bomma Shivakumar
తెలంగాణలో
త్వరలో
మున్సిపల్
ఎన్నికలు
జరగనున్న
నేపథ్యంలో
భారత
రాష్ట్ర
సమితి(BRS)
తరఫున
రాష్ట్రంలోని
అన్ని
మున్సిపాలిటీలు,
కార్పొరేషన్ల
వారీగా
ప్రత్యేక
సమన్వయకర్తలను
పార్టీ
వర్కింగ్
ప్రెసిడెంట్
కేటీఆర్
తాజాగా
నియమించారు.
మున్సిపాలిటీల
వారీగా
సమన్వయకర్తలను
బీఆర్‌ఎస్
నియమించింది.
మొత్తం
122
మున్సిపాలిటీలు,
6
కార్పొరేషన్లకు
సమన్వయకర్తల
ప్రకటించింది.
ప్రతి
మున్సిపాలిటీకి
ఓ
సీనియర్
నాయకుడికి
ఇంచార్జ్
బాధ్యతలు
అప్పగించారు
కేటీఆర్.
తెలంగాణలో
పురపోరుకు
సర్వం
సిద్ధం
అయింది.
రాష్ట్రవ్యాప్తంగా
ఒకే
విడతలో
ఎన్నికలు
నిర్వహించే
యోచనలో
ఎలక్షన్
కమిషన్
ఉంది.
7
నగరపాలక
సంస్థలు,
116
పురపాలికల
ఎన్నికల
షెడ్యూల్
జారీకి
సిద్ధం
అయింది.
నోటిఫికేషన్
విడుదలైన
తర్వాత
15
రోజుల్లో
పోలింగ్
జరగనుంది.
పోలింగ్
పూర్తైన
తర్వాత
రెండ్రోజులకు
ఓట్ల
లెక్కింపు
చేపట్టనున్నారు.
ఈ
క్రమంలో
మున్సిపల్
ఎన్నికల
కోసం
BRS
పార్టీ
సమాయత్తం
అయింది.
ఈ
మేరకు
పార్టీ
తరఫున
రాష్ట్రంలోని
అన్ని
మున్సిపాలిటీలు,
కార్పొరేషన్ల
వారీగా
ప్రత్యేక
సమన్వయకర్తలను
నియమించింది.
ఇక
మున్సిపల్
ఎన్నికల
ప్రక్రియ
ప్రారంభం
నుండి
ముగిసే
వరకు
ఈ
సమన్వయకర్తలు
నిరంతరం
ఆయా
మున్సిపాలిటీల్లో
అందుబాటులో
ఉండనున్నారు.
మున్సిపల్
ఎన్నికల్లో
అత్యంత
కీలకమైన
అభ్యర్థుల
ఎంపిక
ప్రక్రియలో
ఈ
సమన్వయకర్తలు
కీలక
పాత్ర
పోషించనున్నారు.
అలాగే
ప్రజల
మద్దతుతో
మున్సిపల్
ఎన్నికల్లో
బీఆర్ఎస్
గెలుపే
లక్ష్యంగా
పార్టీ
శ్రేణులు
పనిచేయాలని
కేటీఆర్
పిలుపునిచ్చారు.


