Telangana
oi-Korivi Jayakumar
తెలంగాణలో
సంచలనం
రేపుతున్న
ఫోన్
ట్యాపింగ్
కేసు
రోజుకో
కొత్త
మలుపు
తిరుగుతోంది.
ఇప్పటికే
తీవ్ర
రాజకీయ
దుమారం
రేపిన
ఈ
వ్యవహారం,
తాజాగా
మరింత
ముదురుతోందన్న
అభిప్రాయం
వ్యక్తమవుతోంది.
విచారణ
ముందుకు
సాగుతున్న
కొద్దీ
కొత్త
పేర్లు,
కొత్త
ఆరోపణలు
వెలుగులోకి
వస్తుండటంతో
రాష్ట్ర
రాజకీయ
వర్గాల్లో
ఉద్రిక్తత
నెలకొంది.
బీజేపీ
ఎంపీలకు
లీగల్
నోటీసులు..
ఈ
నేపథ్యంలో
బీఆర్ఎస్
వర్కింగ్
ప్రెసిడెంట్,
మాజీ
మంత్రి
కేటీఆర్
దూకుడు
పెంచారు.
తనపై
నిరాధారమైన,
వ్యక్తిత్వ
హననానికి
పాల్పడేలా
ఆరోపణలు
చేశారంటూ
బీజేపీ
ఎంపీలు
బండి
సంజయ్
కుమార్,
ధర్మపురి
అర్వింద్‌లకు
లీగల్
నోటీసులు
జారీ
చేశారు.
ఈ
చర్య
తెలంగాణ
రాజకీయాల్లో
కొత్త
చర్చకు
దారి
తీసింది.
కాగా
గత
కొన్ని
రోజులుగా
ఫోన్
ట్యాపింగ్
అంశంపై
కేటీఆర్,
బీజేపీ
నేతల
మధ్య
మాటల
యుద్ధం
తీవ్రస్థాయికి
చేరింది.
ఈ
అంశాన్ని
రాజకీయంగా
మలిచే
ప్రయత్నాలు
జరుగుతున్నాయన్న
విమర్శలు
వినిపిస్తున్నాయి.
ఒకరిపై
ఒకరు
తీవ్రమైన
ఆరోపణలు
చేసుకుంటూ
రాజకీయ
వాతావరణాన్ని
వేడెక్కిస్తున్నారు.
బండి
సంజయ్
ఫైర్..
దేశ
భద్రత
దృష్ట్యా
కేంద్ర
ప్రభుత్వం
కూడా
ఫోన్లు
వింటుందన్న
కేటీఆర్
వ్యాఖ్యలపై
బీజేపీ
ఎంపీ
బండి
సంజయ్
తీవ్రంగా
స్పందించారు.
దేశ
భద్రత
కోసం
ఫోన్లు
వినడం
వేరు.
కానీ
మీరు
రాజకీయ
ప్రత్యర్థులు,
హీరోయిన్లు,
న్యాయమూర్తుల
పేర్లను
మావోయిస్టుల
జాబితాలో
చేర్చి
అక్రమంగా
ఫోన్లు
ట్యాప్
చేశారు
అంటూ
ఆయన
సంచలన
ఆరోపణలు
చేశారు.
ఈ
వ్యాఖ్యలు
రాజకీయంగా
పెద్ద
దుమారం
రేపాయి.
ధర్మపురి
అర్వింద్
తీవ్ర
విమర్శలు..
అలానే
మరో
బీజేపీ
ఎంపీ
ధర్మపురి
అర్వింద్
మరింత
ఘాటుగా
స్పందించారు.
కేటీఆర్‌పై
వ్యక్తిగత
ఆరోపణలు
చేస్తూ,
ఆయన
డ్రగ్స్
వాడటమే
కాకుండా
డ్రగ్
పెడ్లర్‌గా
కూడా
వ్యవహరించారని
తీవ్ర
వ్యాఖ్యలు
చేశారు.
ఈ
వ్యాఖ్యలు
రాజకీయ
స్థాయిని
దాటి
వ్యక్తిగత
దూషణలకు
చేరాయని
బీఆర్ఎస్
నేతలు
మండిపడ్డారు.
కేటీఆర్
ఆగ్రహం..
ఈ
వ్యాఖ్యలు
తన
వ్యక్తిత్వాన్ని
దిగజార్చేలా
ఉన్నాయని
కేటీఆర్
తీవ్రంగా
ఆగ్రహం
వ్యక్తం
చేశారు.
రాజకీయ
విమర్శలకు
తాను
సిద్ధమేనని,
కానీ
ఆధారాలు
లేకుండా
వ్యక్తిగత
ఆరోపణలు
చేయడం
అనైతికమని
వ్యాఖ్యానించారు.
ఈ
నేపథ్యంలో
కేటీఆర్
తన
న్యాయవాది
ద్వారా
బండి
సంజయ్,
ధర్మపురి
అర్వింద్‌లకు
లీగల్
నోటీసులు
పంపించారు.
ఐదు
రోజుల్లోగా
తమ
వ్యాఖ్యలను
ఉపసంహరించుకోవాలని,
బహిరంగంగా
క్షమాపణలు
చెప్పాలని
డిమాండ్
చేశారు.
నిర్ణీత
గడువులోగా
స్పందించకపోతే
సివిల్,
క్రిమినల్
చట్టాల
ప్రకారం
పరువు
నష్టం
దావా
వేస్తానని
హెచ్చరించారు.
అంతే
కాకుండా
బాధ్యతాయుతమైన
పదవుల్లో
ఉండి
రాజకీయ
లబ్ధి
కోసం
అబద్ధాలను
ప్రచారం
చేయడం
ప్రజాస్వామ్యానికి
హానికరమని
కేటీఆర్
నోటీసుల్లో
పేర్కొన్నారు.
ఫోన్
ట్యాపింగ్
కేసుతో
తనకు
ఎలాంటి
సంబంధం
లేదని
స్పష్టం
చేస్తూ,
రాజకీయ
కక్ష
సాధింపులో
భాగంగానే
తన
పేరును
లాగుతున్నారని
ఆరోపించారు.
ఈ
వరుస
పరిణామాలతో
తెలంగాణ
రాజకీయాలు
ఒక్కసారిగా
వేడెక్కాయి.
ఒకవైపు
దర్యాప్తు
కొనసాగుతుండగా,
మరోవైపు
రాజకీయ
నేతల
మధ్య
న్యాయపోరాటం
మొదలవడం
ఈ
కేసును
మరింత
కీలకంగా
మార్చింది.
రానున్న
రోజుల్లో
ఈ
వ్యవహారం
ఎటు
దారితీస్తుందన్నది
రాజకీయ
వర్గాల్లో
ఆసక్తికరంగా
మారింది.


