స్మార్ట్ స్పీకర్లతోనే ఎక్కువగా మాట్లాడటం..
మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ లో ఇది ఒకటి. స్మార్ట్ స్పీకర్లు ఎప్పుడూ మన సంబాషణను వింటూ ఉంటాయి. మ్యూట్ కోసం టోగుల్ ఆన్ చేస్తే తప్పా, మీరు మాట్లాడే ప్రతి పదం రికార్డు చేస్తుంది. మీ డివైసులోనుంచి కొన్ని సెకన్ల తర్వాత వినిపిస్తున్న ఆడియోను ప్రొసెస్ చేస్తుంది.
అంతేకాదు రన్ అవుతున్న ఆడియో బఫర్‌ను డిలీట్ చేస్తుంది. స్మార్ట్ స్పీకర్ల ద్వారా మీరు మాట్లాడుతున్న మాటలన్నీ కూడా సర్వర్ కు చేరుతుంటాయి. వీటిని ప్రొసెస్ చేయడానికి సర్వర్లకు కమాండ్స్ పంపుతుంది. తర్వాత సమాధానం వస్తుంది.
డేటా స్టోరేజి…..
మీరు స్పీకర్లతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు, అది ఆడియో స్నిప్పెట్లను స్టోరేజి చేస్తుంది. వాటిని మీ అకౌంట్లోకి లాగ్ చేస్తుంది. మీరు కావాలనుకుంటే, మీ అకౌంట్‌ను ఓపెన్ చేసి మీరు ఇంతకుముందు మాట్లాడిన సంబాషణను వినవచ్చు. ఈ డేటాను కొంతవరకు డిలీట్ చేయవచ్చు. కానీ గూగుల్ లేదా అమెజాన్ యొక్క సర్వర్లల స్టోరేజ్ చేసిన అగ్రిగేటెడ్ డేటాను మీరు డిలీట్ చేయలేరు.
పరిసర ప్రాంతాల ఆడియోలు….
ఈ స్పీకర్లు కేవలం మీరు మాట్లాడిన సంబాషణలే కాదు….పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆడియోలను కూడా సేకరిస్తాయి. మీ ఇంట్లో జరిగే విషయాలు, టీవీలో మీరు ఏ ఛానెల్స్ చూస్తున్నారు, మీరు ఇష్టపడే క్రీడలు, మీ పెంపుడు జంతువులు, కుటుంబంలో లింగ నిష్పత్తి వీటిన్నింటిని రికార్డు చేయవచ్చు.
లా అండ్ ఆర్డర్స్….
NSA గూఢచర్యం గురించి అందరికీ తెలిసిన తర్వాత, ఇంగ్లండ్ లో నివసిస్తున్న నిర్వాసితుల ఇంటర్నెట్ హిస్టరీలు, ఫుడ్ స్టాండర్ట్స్ ఏజెన్సీ నుంచి వర్క్ అండ్ పెన్షన్స్ శాఖకు యాక్సెస్ చేయడానికి అనుమతించే ఒక చట్టాన్ని ఆమోదించింది. ఇతర దేశాలు కూడా ఈ దారిలోనే వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.
రిస్క్ ఆఫ్ హ్యాకింగ్….
అమెజాన్ ఎకోకు వచ్చినప్పుడు మీరు అలెక్సా సహాయంతో నేరుగా అమెజాన్ ద్వారా వస్తువులను కొనవచ్చు. ఎవరైనా మీ డివైసును దొంగలించినట్లయితే…భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది.


