International
oi-Jakki Mahesh
అమెరికాలోని
మెయిన్
రాష్ట్రంలో
ఆదివారం
సాయంత్రం
ఓ
భారీ
విమాన
ప్రమాదం
చోటుచేసుకుంది.
బ్యాంకర్
ఇంటర్నేషనల్
ఎయిర్పోర్టు
నుంచి
టేకాఫ్
అవుతున్న
సమయంలో
ఓ
ప్రైవేట్
జెట్
అగ్నిప్రమాదానికి
గురై
కుప్పకూలిపోయింది.
ఈ
విమానంలో
ప్రయాణికులు,
సిబ్బంది
కలిపి
మొత్తం
8
మంది
ఉన్నట్లు
సమాచారం.
ప్రమాదం
జరిగిన
తీరు
అమెరికన్
ఏవియేషన్
రెగ్యులేటర్
ఫెడరల్
ఏవియేషన్
అడ్మినిస్ట్రేషన్
ధ్రువీకరించిన
వివరాల
ప్రకారం..
ఈ
ప్రమాదం
స్థానిక
కాలమానం
ప్రకారం
రాత్రి
7.45
గంటల
ప్రాంతంలో
జరిగింది.
ప్రమాదానికి
గురైన
విమానం
బాంబార్డియర్
ఛాలెంజర్
600
అనే
ట్విన్
ఇంజిన్
టర్బో-ఫ్యాన్
జెట్
అని
తెలిసింది.
టేకాఫ్
తీసుకుంటున్న
సమయంలో
విమానంలో
మంటలు
చెలరేగి
రన్‌వే
సమీపంలోనే
కూలిపోయింది.
వాతావరణం..
ఇతర
వివరాలు
ఈ
ప్రైవేట్
జెట్
టెక్సాస్
నుంచి
మెయిన్‌కు
చేరుకుంది.
ప్రాథమిక
రికార్డుల
ప్రకారం..
ఈ
విమానం
హ్యూస్టన్‌లోని
‘అర్నాల్డ్
అండ్
ఇట్కిన్’
అనే
లా
ఫర్మ్
పేరుతో
రిజిస్టర్
అయి
ఉంది.
ప్రమాద
సమయంలో
విమానాశ్రయం
వద్ద
స్వల్పంగా
మంచు
కురుస్తోంది.
ఆ
ప్రాంతంలో
వింటర్
స్టార్మ్
హెచ్చరికలు
కూడా
ఉన్నాయి.
అయితే
ప్రమాదానికి
ప్రతికూల
వాతావరణమే
కారణమా
కాదా
అనేది
ఇంకా
స్పష్టం
కాలేదు.
కొనసాగుతున్న
విచారణ
ప్రస్తుతం
బాధితుల
వివరాలు,
వారి
ప్రస్తుత
స్థితిగతులపై
అధికారులు
అధికారిక
ప్రకటన
చేయాల్సి
ఉంది.
నేషనల్
ట్రాన్స్‌పోర్టేషన్
సేఫ్టీ
బోర్డ్
(NTSB),
FAA
సంయుక్తంగా
ఈ
ప్రమాదంపై
దర్యాప్తు
ప్రారంభించాయి.
సాంకేతిక
లోపం
వల్ల
మంటలు
చెలరేగాయా
లేక
మరేదైనా
కారణం
ఉందా
అనే
కోణంలో
విచారణ
జరుగుతోంది.
విమానంలో
ఉన్న
8
మంది
ప్రయాణికుల
పరిస్థితిపై
ఇంకా
స్పష్టత
రావాల్సి
ఉంది.
ఘటనా
స్థలంలో
సహాయక
చర్యలు
కొనసాగుతున్నాయి.


