Telangana
oi-Lingareddy Gajjala
గణతంత్ర
దినోత్సవం
దేశ
గౌరవానికి
ప్రతీక
అయిన
జాతీయ
జెండా
ఆవిష్కరణ
కార్యక్రమాల్లో
జరిగిన
నిర్లక్ష్యం
తెలంగాణలో
తీవ్ర
చర్చకు
దారితీసింది.
ఒకవైపు
జాతీయ
జెండా
అవమానానికి
గురయ్యే
ఘటనలు
కలకలం
రేపుతుంటే,
మరోవైపు
నారాయణపేట
జిల్లా
మక్తల్‌లో
మంత్రి
వాకిటి
శ్రీహరికి
ప్రాణాపాయం
తప్పిన
సంఘటన
ఆందోళన
కలిగించింది.
స్వాతంత్య్ర,
గణతంత్ర
వేడుకల
సందర్భంలో
అధికారులు,
ప్రజాప్రతినిధుల
అలసత్వం
వరుస
ఘటనలకు
కారణమవుతోందన్న
విమర్శలు
వెల్లువెత్తుతున్నాయి.
నారాయణపేట
జిల్లా
మక్తల్‌లోని
ఎమ్మార్వో
కార్యాలయ
భవనంపై
జాతీయ
జెండాను
ఆవిష్కరిస్తున్న
సమయంలో
అనూహ్య
ఘటన
చోటుచేసుకుంది.
తహసిల్దార్
సతీష్
కుమార్
జెండాను
ఆవిష్కరిస్తుండగా,
జెండా
కర్ర
(కట్టే)
అకస్మాత్తుగా
విరిగి
కింద
పడిపోయింది.
ఆ
సమయంలో
కింద
ఉన్న
మంత్రి
వాకిటి
శ్రీహరి,
ఇతర
ప్రజాప్రతినిధులు,
అధికారులు
ఒక్కసారిగా
అప్రమత్తమయ్యారు.
పై
నుంచి
పడుతున్న
జెండా
కర్ర
మంత్రి
తలపై
పడే
ప్రమాదం
ఉండగా,
పక్కన
ఉన్న
అధికారులు,
ప్రజాప్రతినిధులు
చేతులు
అడ్డుపెట్టడంతో
పెద్ద
ప్రమాదం
తప్పింది.
అయితే,
విరిగిన
కర్రకే
మళ్లీ
జాతీయ
జెండాను
బిగించి
ఆవిష్కరణ
కొనసాగించడం
పట్ల
విమర్శలు
వ్యక్తమవుతున్నాయి.
జాతీయ
జెండా
ఆవిష్కరణలో
కనీస
భద్రతా
జాగ్రత్తలు
పాటించలేదన్న
ఆరోపణలు
వినిపిస్తున్నాయి.
నర్సాపూర్‌లో
తలకిందుల
జెండా
మెదక్
జిల్లా
నర్సాపూర్‌లోని
ఆర్టీవో
కార్యాలయంలో
జాతీయ
జెండా
అవమానానికి
గురైన
ఘటన
రాజకీయ,
ప్రజా
వర్గాల్లో
కలకలం
రేపింది.
స్వాతంత్య్ర
దినోత్సవ
కార్యక్రమాల్లో
భాగంగా
ఆర్డీవో
మహిపాల్
రెడ్డి
జాతీయ
జెండాను
తలక్రిందులుగా
ఆవిష్కరించడం
వివాదానికి
దారితీసింది.
జెండా
ఎగురవేసిన
అనంతరం
అక్కడున్న
స్థానికులు
ఈ
విషయాన్ని
గుర్తించి
అధికారులకు
సూచించడంతో,
వెంటనే
జెండాను
సరిచేసి
మళ్లీ
సక్రమంగా
ఆవిష్కరించారు.
అయినప్పటికీ,
అప్పటికే
ఘటనపై
తీవ్ర
విమర్శలు
వెల్లువెత్తాయి.
దుబ్బాకలోనూ
అదే
తప్పిదం
సిద్ధిపేట
జిల్లా
దుబ్బాక
గాంధీ
చౌక్
వద్ద
నిర్వహించిన
గణతంత్ర
వేడుకల్లోనూ
ఇలాంటి
ఘటనే
చోటుచేసుకుంది.
నియోజకవర్గ
ఎమ్మెల్యే
కొత్త
ప్రభాకర్
రెడ్డి
ముఖ్య
అతిథిగా
హాజరై
జాతీయ
జెండాను
ఆవిష్కరించగా,
జెండా
తలకిందులుగా
ఎగిరింది.
కొద్ది
సేపట్లోనే
అధికారులు
అప్రమత్తమై
జెండాను
సరిచేసినా,
అప్పటికే
అక్కడ
ఉద్రిక్త
వాతావరణం
నెలకొంది.
అలసత్వంపై
తీవ్ర
విమర్శలు
వరుసగా
చోటుచేసుకున్న
ఈ
ఘటనలు
జాతీయ
జెండా
గౌరవం
పట్ల
ఉన్న
నిర్లక్ష్యాన్ని
స్పష్టంగా
చూపిస్తున్నాయని
ప్రజలు
ఆవేదన
వ్యక్తం
చేస్తున్నారు.
జెండా
ఆవిష్కరణ
వంటి
అత్యంత
గౌరవప్రదమైన
కార్యక్రమాల్లో
పూర్తి
స్థాయి
జాగ్రత్తలు
తీసుకోవాల్సిన
అవసరం
ఉందని,
ఇలాంటి
తప్పిదాలు
మళ్లీ
పునరావృతం
కాకుండా
చర్యలు
తీసుకోవాలని
డిమాండ్
చేస్తున్నారు.


