బట్టతల వచ్చిందని విడాకులు.. ఏంటండీ ఈ ఘోరం !

Date:


International

-Korivi Jayakumar

మూడు
ముళ్లు
బంధంతో
ఇద్దరు
వ్యక్తులు
ఒక్కటయ్యే
వేడుకే
వివాహం.
కాగా
వివాహ
జీవితంలో
భార్యాభర్తల
మధ్య
మనస్పర్ధలు
రావడం
సహజమే.
అయితే
నేటి
కాలంలో
మాత్రం
కారణం
చిన్నదైనా
కానీ
విడపోవడానికే
ఎక్కువ
మక్కువ
చూపుతున్నారు.
చైనాలో
ఇటీవ‌ల
చోటు
చేసుకున్న
ఒక
అమానవీయ
ఘటన
సంచలనం
సృష్టించింది.
తన
భార్యకు
అనారోగ్యం
కారణంగా
బట్టతల
రావడంతో..
ఆమె
భర్త
విడాకులు
ఇచ్చాడు.
16
ఏళ్ల
వివాహ
బంధానికి

అనూహ్య
కారణంతో
ముగింపు
పలకడం
హాట్
టాపిక్
గా
మారింది.

కాగా
హెనాన్
ప్రావిన్స్‌కు
చెందిన
లీ
(36)కి
16
ఏళ్ల
క్రితం
వివాహం
జరిగింది.
నాటి
నుంచి

జంట
తమ
వైవాహిక
జీవితాన్ని
గడుపుతూ
వస్తున్నారు.
అయితే
రెండేళ్ల
క్రితం
ఆమెకు
‘విటిలిగో’
అనే
దీర్ఘకాలిక
చర్మ
వ్యాధి
సోకింది.

వ్యాధితో
ఆమె
జుట్టు
తెల్లబడి,
క్రమంగా
రాలిపోయి
బట్టతల
వచ్చినట్టు
తెలుస్తోంది.

అయితే
భార్య
అనారోగ్యంతో
బాధపడుతున్నప్పుడు
అండగా
నిలవాల్సిన
భర్త..
ఆమెను
అసహ్యించుకోవడం
మొదలుపెట్టాడు.
కనీసం
ఆసుపత్రికి
తీసుకెళ్లడం
గానీ,
ఆరోగ్యం
గురించి
అడగడం
గానీ
చేయలేదని
వాపోతుంది.
తన
పరువు
పోతుందని
భావించి
శుభకార్యాలకు
దూరంగా
ఉంచాడని..
చికిత్స
ఖర్చు
భరించడం
ఇష్టం
లేక
ఆమెను
మానసికంగా
వేధించడం
ప్రారంభించడని
ఎమోషనల్
అయ్యింది.

భర్త
నిర్లక్ష్యం,
నిత్యం
జరిగే
గొడవల
కారణంగా
లీ
తీవ్ర
మానసిక
ఒత్తిడికి
గురైంది.

ఒత్తిడి
వల్లే
ఆమె
వ్యాధి
మరింత
తీవ్రమైందని
వైద్యులు
తెలిపారు.
చివరికి,
ఆమె
భర్త
విడాకులు
కోరగా,
లీ
అంగీకరించక
తప్పలేదు.
కోర్టు
బిడ్డ
కస్టడీని
కూడా
భర్తకే
అప్పగించడంతో
ఆమె
ఒంటరిగా
మిగిలిపోయింది.
అతని
లాంటి
కఠిన
హృదయుడిని
నేనెక్కడా
చూడలేదు”
అని
లీ
కన్నీరుమున్నీరవుతోంది.
ప్రస్తుతం

ఘటన
సోషల్
మీడియాలో
వైరల్
అవుతోంది.

భర్త
అమానవీయ
తీరుపై
నెటిజన్లు
సైతం
మండిపడుతూ
కామెంట్స్
చేస్తున్నారు.
బాధితురాలికి
అండగా
నిలుస్తూ
ఆమెకు
న్యాయం
జరగాలని
కోరుతున్నారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related