International
oi-Jakki Mahesh
కొలంబియాలో
ఘోర
విమాన
ప్రమాదం
చోటుచేసుకుంది.
కుకుటా
నుంచి
బయలుదేరిన
సటేనా
ఎయిర్‌లైన్స్‌కు
చెందిన
బీచ్‌క్రాఫ్ట్
1900
విమానం,
వెనిజులా
సరిహద్దు
సమీపంలోని
మారుమూల
పర్వత
ప్రాంతంలో
కుప్పకూలింది.
ఈ
ప్రమాదంలో
విమానంలో
ఉన్న
మొత్తం
15
మంది(13
మంది
ప్రయాణికులు,
ఇద్దరు
సిబ్బంది)
మరణించినట్లు
ప్రభుత్వ
రంగ
విమానాయాన
సంస్థ
సటేనా
ధ్రువీకరించింది.
అసలేం
జరిగిందంటే?
సటేనా
ఎయిర్‌లైన్స్‌కు
చెందిన
బీచ్‌క్రాఫ్ట్
1900
విమానం
బుధవారం
ఉదయం
కుకూటా
నగరం
నుంచి
బయలుదేరింది.
వెనిజులా
సరిహద్దుకు
సమీపంలోని
ఒకాన్యా
నగరంలో
మధ్యాహ్నం
12:05
గంటలకు
ఇది
ల్యాండ్
కావాల్సి
ఉంది.
అయితే
ల్యాండింగ్‌కు
కేవలం
11
నిమిషాల
ముందు
విమానం
నుంచి
సిగ్నల్
కట్
అయ్యిందని
అధికారులు
తెలిపారు.
గాలింపు
చర్యలు
చేపట్టగా,
ఒకాన్యా
సమీపంలోని
ఎత్తైన
పర్వత
ప్రాంతంలో
విమానం
శిథిలాలను
గుర్తించారు.
ఈ
ప్రాంతం
కొలంబియాలోని
తిరుగుబాటు
గ్రూపుల
నియంత్రణలో
ఉండటంతో
సహాయక
చర్యలు
సవాలుగా
మారాయి.
ప్రముఖుల
మృతి
మరణించిన
వారిలో
కొలంబియాకు
చెందిన
ఇద్దరు
కీలక
రాజకీయ
నేతలు
ఉన్నట్లు
అధికారిక
జాబితా
ద్వారా
తెలిసింది.
కొలంబియా
పార్లమెంట్
సభ్యుడైన
డియోజెనెస్
క్వింటెరో
అమాయ
ఈ
విమాన
ప్రమాదంలో
ప్రాణాలు
కోల్పోయారు.
అంతర్గత
యుద్ధ
బాధితుల
తరపున
ప్రాతినిధ్యం
వహిస్తున్న
16
మంది
ఎంపీలలో
ఈయన
ఒకరు.త్వరలో
జరగనున్న
నేషనల్
కాంగ్రెస్
ఎన్నికల్లో
అభ్యర్థిగా
పోటీ
చేస్తున్న
కార్లోస్
సాల్సెడో
కూడా
ఈ
ప్రమాదంలో
మరణించారు.
🚨
Colombia
plane
crash
kills
all
15
on
board
—
reportsA
Beechcraft
1900
crashed
in
northern
Colombia
after
losing
contact
near
Ocaña,
close
to
the
Venezuelan
border.
The
wreckage
was
found
in
a
mountainous
area,
BBC
reported,
citing
state-run
airline
Satena.Footage
from…
pic.twitter.com/8RskY0049F—
Sputnik
(@SputnikInt)
January
28,
2026
స్పందించిన
కొలంబియా
అధ్యక్షుడు
ఈ
ప్రమాదంపై
కొలంబియా
అధ్యక్షుడు
గుస్తావో
పెట్రో
తీవ్ర
దిగ్భ్రాంతి
వ్యక్తం
చేశారు.
మృతుల
కుటుంబాలకు
ఎక్స్
వేదికగా
తన
ప్రగాఢ
సానుభూతిని
తెలిపారు.
“ఈ
మరణాలు
నన్ను
తీవ్రంగా
కలిచివేస్తున్నాయి”
అని
ఆయన
రాశారు.
నార్త్
శాంటాండర్
గవర్నర్
విలియం
విల్లామిజార్
తెలిపిన
వివరాల
ప్రకారం,
ఇప్పటివరకు
ఏడు
మృతదేహాలను
వెలికితీశారు.
మృతుల
బంధువుల
కోసం
ప్రత్యేక
హాట్‌లైన్‌ను
ఏర్పాటు
చేసినట్లు
విమానయాన
సంస్థ
తెలిపింది.


