విచారణకు రాలేనంటూ కేసీఆర్ లేఖ .. స్పందించిన సిట్..

Date:


Telangana

oi-Bomma Shivakumar

ఫోన్
ట్యాపింగ్
కేసులో
మరో
కీలక
పరిణామం
చోటుచేసుకున్న
విషయం
తెలిసిందే.
బీఆర్ఎస్​
అధ్యక్షుడు,
మాజీ
సీఎం
కేసీఆర్​
కు
సిట్​
అధికారులు
నోటీసులు
ఇచ్చారు.
జనవరి
30
శుక్రవారం
మధ్యాహ్నం
మూడు
గంటలకు
హాజరు
కావాలని
నోటీసుల్లో
పేర్కొన్నారు.
అయితే
సిట్
అధికారులు
ఇచ్చిన
నోటీసులపై
కేసీఆర్
స్పందించారు.
రేపు
విచారణకు
హాజరుకాలేనని
పోలీసులకు
తెలిపారు.
మున్సిపల్
ఎన్నికల
నేపథ్యంలో
విచారణకు
హాజరుకాలేనని
స్పష్టం
చేశారు.

ఫోన్
ట్యాపింగ్
కేసులో
విచారణలో
భాగంగా
బీఆర్ఎస్​
అధ్యక్షుడు,
మాజీ
సీఎం
కేసీఆర్​
కు
సిట్​
అధికారులు
నోటీసులు
ఇచ్చిన
సంగతి
తెలిసిందే.
హైదరాబాద్​
నందినగర్​
లోని
కేసీఆర్
నివాసానికి
వెళ్లి
నోటీసులు
అందజేశారు.
జనవరి
30న
మధ్యాహ్నం
3
గంటలకు
విచారణకు
రావాలని
నోటీసుల్లో
పేర్కొన్నారు.
అయితే
విచారణకు
హాజరయ్యేందుకు
పీఎస్
కు
రావాల్సిన
అవసరం
లేదని
అధికారులు
తెలిపారు.
విచారణకు
హాజరయ్యేందుకు
అనువైన
ప్రాంతం
వివరాలు
తెలపాలన్నారు.

అయితే
సిట్
అధికారులు
అందించిన
నోటీసులపై
కేసీఆర్
స్పందించారు.
రాష్ట్రంలో
మున్సిపల్
ఎన్నికల
ప్రక్రియ
కొనసాగుతున్నందున
బీజీగా
ఉన్నానని
విచారణకు
హాజరు
కాలేనని
తెలిపారు.

నేపథ్యంలో
విచారణను
వాయిదా
వేయాలని,
తనకు
మరింత
సమయం
కావాలని
ఆయన
సిట్
అధికారులను
కోరారు.
ఇక
విచారణను
తన
నివాసమైన
ఎర్రవల్లి
ఫామ్‌
హౌస్‌
లోనే
నిర్వహించాలని
అధికారులను
కేసీఆర్
కోరారు.

ఇక
కేసీఆర్
లేఖపై
సిట్
అధికారులు
సానుకూలంగా
స్పందించినట్లు
తెలుస్తోంది.
మున్సిపల్
ఎన్నికల
నేపథ్యంలో
ఆయనకు
కొంత
సమయం
ఇవ్వాలని
అధికారులు
ప్రాథమికంగా
నిర్ణయించినట్లు
సమాచారం.
అయితే
తదుపరి
విచారణ
తేదీ
ఎప్పుడు
ఉండబోతుంది..?
అనేది
సస్పెన్స్
గా
మారింది.
ఇక
ఇదే
కేసులో
ఇప్పటికే
కేటీఆర్,
హరీష్
రావు,
సంతోష్
రావులను
సిట్
అధికారులు
విచారించిన
విషయం
తెలిసిందే.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related