Entertainment
oi-Kannaiah
కార్తీకదీపం
2
సీరియల్‌లో
గత
ఎపిసోడ్
(542వ
ఎపిసోడ్)
లో
దీపకు
కడుపు
నొప్పి
రావడంతో
శివన్నారాయణ,
సుమిత్ర,
పారిజాతం
డాక్టర్‌ను
తీసుకొని
కార్తీక్
ఇంటికి
వచ్చారు.
శౌర్య
కాలు
తగలడం
వల్ల
నొప్పి
వచ్చిందని
తెలిసి
డాక్టర్
జాగ్రత్తలు
చెప్పారు.
ఈ
అవకాశాన్ని
వాడుకున్న
పారిజాతం..
శౌర్య
మనసు
చెడగొట్టాలని,
అల్లరి
చేసి
ఇంట్లో
కార్తీక్‌కు
ప్రశాంతత
లేకుండా
చేయాలని
సూచించింది.మరి
డిసెంబర్
4వ
తేదీ
(542వ
ఎపిసోడ్)
లో
జరిగిన
కీలక
ఘట్టాలు,
భావోద్వేగ
సన్నివేశాలు
కింద
చూడవచ్చు:
జ్యోత్స్నకు
తండ్రి
దశరథ
ఎమోషనల్
వార్నింగ్
దీప
ఇంటికి
బయల్దేరిన
దశరథ,
జ్యోత్స్నతో
కారులో
ప్రయాణిస్తున్నప్పుడు
భావోద్వేగానికి
గురవుతాడు.
“నువ్వు
నా
కూతురివి
కాదు,
నా
కూతురు
వేరే
ఉంది”
అని
దశరథ
అనడంతో
జ్యోత్స్న
షాకైపోతుంది.
తన
కూతురు
ఇంతలా
మారిపోలేదని,
ఎవరో
ఆమె
మనసులో
విషం
నింపారని
దశరథ
బాధపడతాడు.
జ్యోత్స్న
పనులన్నీ
ఆపేసి,
అర్ధం
లేకుండా
పరిగెత్తడం
ఆపి
పెళ్లికి
ఒప్పుకోమని
వేడుకుంటాడు.
దీంతో
“మీరు
కోరుకున్న
భవిష్యత్తు
నాకు
పెళ్లితోనే
దొరుకుతుందని
అనుకుంటే
నేను
పెళ్లికి
రెడీ”
అని
జ్యోత్స్న
షరతు
పెడుతుంది.
ఈ
మాట
విని
దశరథ
సంతోషించినా,
ఈ
విషయం
సుమిత్రకు
ఇప్పుడే
చెప్పవద్దని
జ్యోత్స్న
కోరుతుంది.
శ్రీధర్‌ను
క్షమించడానికి
కాంచన
షాకింగ్
కండీషన్
కాంచన
ఇంటికి
చేరుకున్న
శివన్నారాయణ,
శ్రీధర్‌ను
క్షమించి,
భర్తగా
అంగీకరించమని
కాంచనను
శాసిస్తాడు.
“మనుషుల్ని
క్షమించాలి,
లేదంటే
మానవత్వానికి
అర్ధం
లేదు”
అని
తండ్రి
అంటాడు.
దీనికి
కాంచన
తీవ్రంగా
స్పందిస్తూ..
“నేను
ఒక
పెళ్లి
చేస్తే,
మా
ఆయన
రెండు
పెళ్లిళ్లు
చేసుకున్నాడు..
మోసానికి
మించిన
దారుణం
కూడా
ఉండదు”
అని
మండిపడుతుంది.
అయినప్పటికీ,
తండ్రి
మాటకు
గౌరవం
ఇచ్చి
కాంచన
ఒక
షాకింగ్
కండీషన్
పెడుతుంది.
“కూతురిగా
నేను
ఏం
అడిగినా
ఇస్తావా?”
అని
అడగ్గా,
శివన్నారాయణ
ఒప్పుకుంటాడు.
“అయితే
నన్ను
లేపి
నా
కాళ్ల
మీద
నిలబెట్టమనీ”
కోరుతుంది
కాంచన.
తాను
నడుచుకుంటూ
వెళ్లి
గుమ్మంలోకి
వచ్చిన
భర్తకు
స్వాగతం
చెప్పాలని
ఉందని
కన్నీరు
పెట్టుకోవడంతో,
విదేశీ
డాక్టర్లు
కూడా
నయం
చేయలేకపోయిన
తన
కాళ్ల
పరిస్థితి
గుర్తొచ్చి
శివన్నారాయణ
వెక్కి
వెక్కి
ఏడుస్తాడు.
జీవితంలో
రాని
కాళ్లకి,
వెళ్లిపోయిన
భర్తకి
ముడిపెడతావా
అని
శివన్నారాయణ
బాధపడతాడు.
దీపకు
దశరథ
సారె
కాంచన,
శివన్నారాయణల
మధ్య
తీవ్ర
భావోద్వేగ
చర్చ
నడుస్తుండగా,
దశరథ
మరియు
జ్యోత్స్న
పిండి
వంటలు,
పండ్లు
తీసుకుని
ఇంటికి
వస్తారు.
ఆడపిల్ల
తల్లి
కాబోతుంటే
పుట్టింటి
నుంచి
సారె
తీసుకురావడం
ఆనవాయితీ
అని,
దీపను
తాము
కూతురిగా
భావించి
కన్యాదానం
చేశామని
దశరథ
చెబుతాడు.
దీప,
కార్తీక్‌లను
ఆశీర్వదించిన
దశరథ..
రేపటి
నుంచి
నువ్వు
(దీప)
మా
ఇంటికి
రావాల్సిన
అవసరం
లేదని
తేల్చిచెప్పాడు.
ఈ
మాటతో
దీప,
కార్తీక్,
జ్యోత్స్న
సహా
అక్కడున్న
అందరూ
షాకయ్యారు.
జ్యోత్స్న
రాకతో
పారిజాతం
ఆందోళన
పడుతుంది.కాంచన
షరతుకు
శివన్నారాయణ
ఎలా
స్పందిస్తారు?
దీపను
శివన్నారాయణ
ఇంటికి
రావద్దని
దశరథ
ఎందుకు
చెప్పాడు?
అనేది
రేపటి
ఎపిసోడ్‌లో
తెలుస్తుంది.


