Andhra Pradesh
oi-Syed Ahmed
ఏపీలో
గత
వైసీపీ
ప్రభుత్వంలో
తిరుమల
లడ్డూకు
వాడిన
నెయ్యి
కల్తీపై
సిట్
ఛార్జిషీట్
తర్వాత
రాష్ట్రంలో
అధికార
కూటమి
పార్టీల
నేతలు
మహాపాపం
పేరుతో
పలు
చోట్ల
ఫ్లెక్సీలు
పెట్టడం
ప్రారంభించారు.
తిరుమల
లడ్డూకు
కల్తీ
నెయ్యి
వాడటం
ద్వారా
వైఎస్సార్సీపీ
(ysrcp)
నేతలు
లబ్ది
పొందారని,
భక్తుల
మనోభావాలు
దెబ్బతీశారని
ఆరోపిస్తూ
ఈ
ఫ్లెక్సీలు
పెడుతున్నారు.
దీనిపై
వైసీపీ
ఇప్పటికే
తీవ్ర
అభ్యంతరాలు
వ్యక్తం
చేస్తోంది.
ఈ
నేపథ్యంలో
ఇవాళ
డీజీపీ
హరీష్
గుప్తాకు
పార్టీ
తరఫున
ఓ
లేఖ
రాశారు.
తిరుమల
లడ్డూ
వివాదంలో
సీబీఐ
సిట్
ఛార్జ్‌షీట్
నేపథ్యంలో..
తమ
పార్టీని,
నేతలను
నిందిస్తూ
రాష్ట్రంలో
పలు
చోట్ల
ఏర్పాటు
చేసిన
ఫ్లెక్సీలపై
తక్షణమే
తగిన
చర్య
తీసుకోవాలని
వైయస్సార్
సీపీ
రాష్ట్ర
డీజీపీని
కోరింది.
ఈ
మేరకు
పార్టీ
రాష్ట్ర
ప్రధాన
కార్యదర్శి,
ఎమ్మెల్సీ
లేళ్ల
అప్పిరెడ్డి
రాష్ట్ర
డీజీపీకి
లేఖ
రాశారు.
సీబీఐ
సిట్
ఛార్జ్‌షీట్
లోని
అంశాలను
తప్పుదోవ
పట్టిస్తూ,
తమ
పార్టీని
నిందిస్తూ
గుంటూరు,
పిడుగురాళ్ల,
వినుకొండ,
దర్శితో
పాటు,
రాష్ట్రంలో
పెద్ద
ఎత్తున
ఫ్లెక్సీలు
ఏర్పాటు
చేశారని
ఆయన
ఆరోపించారు.
వైయస్సార్సీపీకి
వ్యతిరేకంగా
తప్పుడు
ప్రచారం
చేయడంతో
పాటు,
తమ
నేతల
పరువుకు
భంగం
కలిగించే
విధంగా
ఆ
ఫ్లెక్సీలు
ఉన్నాయన్నారు.
రాష్ట్రంలో
శాంతిభద్రతలకు
తీవ్ర
విఘాతం
కలిగించేలా
టీడీపీ
నేతలు
వ్యవహరిస్తున్నారని
లేఖలో
పేర్కొన్నారు.
నిజానికి
సిట్
ఛార్జ్‌షీట్‌లో
పార్టీ
అధ్యక్షుడు,
మాజీ
ముఖ్యమంత్రి
జగన్
తో
పాటు
పార్టీ
నేతలు
వైవీ
సుబ్బారెడ్డి,
భూమన
కరుణాకర్
రెడ్డి
పై
ఎలాంటి
నేరారోపణలు
చేయలేదని,
అయినా
ఉద్దేశపూర్వకంగా
తప్పుడు
ప్రచారం
చేస్తూ,
వారి
ప్రతిష్టకు
భంగం
కలిగించే
విధంగా,
వారి
ఫోటోలతో
సహా
ఫ్లెక్సీలు
ఏర్పాటు
చేశారని
లేళ్ల
అప్పిరెడ్డి
ఆరోపించారు.
అందుకే
అవి
ఏర్పాటు
చేసిన
వారిపై
క్రిమినల్
కేసులు
నమోదు
చేయడంతో
పాటు,
భవిష్యత్తులో
మళ్లీ
అలాంటి
పనులు
చేయకుండా
చూడాలని
కోరారు.
తప్పుడు
ప్రచారం
చేస్తూ,
పరువు
నష్టం
కలిగించే
ఆ
ఫ్లెక్సీలు
డిజైన్
చేసిన,
ప్రింట్
చేసిన,
వాటికి
నిధులు
సమకూర్చిన,
రవాణా
చేసిన
వారితో
పాటు,
అవి
ఏర్పాటు
చేసిన
వారిపైనా
వెంటనే
క్రిమినల్
కేసులు
నమోదు
చేయాలని
కోరారు.


