Entertainment
oi-Kannaiah
కార్తీకదీపం
2
సీరియల్‌లో
కుటుంబ
కలహాలు,
ఆర్థిక
మోసాలు,
పాత
గొడవల
ప్రస్తావనతో
నేటి
ఎపిసోడ్
(నవంబర్
28,
527వ
ఎపిసోడ్)
మరింత
ఉత్కంఠగా
మారింది.
జ్యోత్స్న
చేసిన
₹2.34
కోట్ల
స్కామ్
గుట్టు
రట్టు
కాగా,
శివన్నారాయణ
కుటుంబంలో
మళ్లీ
శ్రీధర్-కాంచన
అంశం
గొడవకు
దారి
తీసింది.
ల్యాండ్‌పై
జ్యోత్స్న
పచ్చి
అబద్ధాలు
కంపెనీకి
చెందిన
₹2.34
కోట్ల
డబ్బుతో
తాను
సుమిత్ర
కోసం
ల్యాండ్
కొన్నానని
జ్యోత్స్న
చెప్పిన
అబద్ధంపై
కార్తీక్,
పారిజాతం
మధ్య
మాటల
యుద్ధం
జరిగింది.
“ల్యాండ్
కొన్నానని
జ్యోత్స్న
చెబుతున్నది
పచ్చి
అబద్ధం”
అని
పారు
లాంటివాళ్లు
అనుకుంటారని
కార్తీక్
సెటైర్
వేయగా,
పారిజాతం
మండిపడింది.
తన
కన్నతల్లి
కోసం
తాపత్రయపడిన
కూతురిని
అవమానిస్తారా
అంటూ
ఆమె
జ్యోత్స్నకు
మద్దతుగా
నిలిచింది.
అయితే,
జ్యోత్స్న
మనసులో
అసలు
విషయం
బయటపడింది.
“నా
ప్లేస్
మీద
నాకు
నమ్మకం
లేక
ఇలా
చేశాను.
ఏనాటికైనా
నేను
అసలు
కూతురు
కాదని
మా
డాడీకి
తెలిసేలోగా
నా
పేరు
మీద
ఎంతో
కొంత
ఆస్తి
ఉండాలని”
ఇలా
చేశానని
పారిజాతంతో
చెబుతుంది.
తాను
సీఈవోగా
ఉంటే
ఈ
డబ్బుని
నష్టాల్లో
చూపించి
తప్పించుకునేదాన్ని
అని,
కార్తీక్
తన
పాలిట
భస్మాసురుడిలా
తయారయ్యాడని
జ్యోత్స్న
రగిలిపోతుంది.
వారసత్వంపై
కార్తీక్
ప్రశ్నలు
కార్తీక్,
దీప
ఎంట్రీ
ఇవ్వగా,
పారిజాతం
మళ్లీ
వారిపై
మండిపడింది.
ఈ
ఆస్తి
శివన్నారాయణ
ఏకైక
వారసురాలైన
జ్యోత్స్నదేనని,
చుట్టూ
చేరిన
చీమల్లాగా
తలో
ముక్క
పట్టుకుపోదామని
చూస్తున్నారా
అని
పారు
ఆగ్రహం
వ్యక్తం
చేసింది.
“ఎవరి
ఆస్తి
ఎవరికి
సొంతం?”
అని
కార్తీక్
అడగ్గా,
జ్యోత్స్న,
పారు
షాక్
అయ్యారు.
ఈ
ఆస్తి
దశరథ
మావయ్య
పేరు
మీద
ఉందని,
ఆయన
దీనిని
తన
వారసురాలికి
రాస్తాడని
కార్తీక్
చెప్పడంతో
జ్యోత్స్న,
పారులకు
అనుమానం
బలపడింది.
శ్రీధర్-కాంచన
కలయికపై
రచ్చ
మాయమైన
ల్యాండ్‌పై
తర్వాత
మాట్లాడుకుందామని
దశరథ
చెప్పగా,
శ్రీధర్
తన
బాధను
వెళ్లగక్కాడు.
“నీ
చెల్లికి
అన్యాయం
చేశానని
నీకు
నా
మీద
కోపంగా
ఉందా?”
అని
దశరథను
అడగ్గా,
దశరథ
సానుభూతి
చూపించాడు.
శ్రీధర్
తనను,
కాంచనను
కలపమని
దశరథను
వేడుకున్నాడు.
శ్రీధర్
ఇద్దరు
పెళ్లాలు
కావాలని
కోరుకుంటున్నాడని
పారు
అడ్డుపడి
పెద్ద
గొడవకు
తెర
లేపింది.
“తప్పు
చేసిన
భర్తని
వదిలేసినందుకు
కాంచన
పరువు
నిలబడింది.
ఇప్పుడు
కాంచన
తన
నిర్ణయాన్ని
మార్చుకుంటే,
కాంచన
మొదటి
భార్యగా
ఉండాలని
చెబుతుంది”
అని
పారిజాతం
రెచ్చిపోయింది.
ఈ
గొడవలో
పారిజాతంపై
కార్తీక్
సీరియస్
అయ్యాడు.
జ్యోత్స్నపై
దీప
ఆగ్రహం
“మీ
ఫ్యామిలీ
కారణంగా
మా
ఫ్యామిలీలో
గొడవలు
రావడం
కామన్”
అని
జ్యోత్స్న
అనగా,
దీప
మండిపడింది.
మనుషుల్ని
కలపడానికి
సాయం
చేయమని
అడగటంలో
తప్పు
లేదని,
సుమిత్రమ్మ,
శివన్నారాయణ
గారు
విడిపోయి,
మళ్లీ
కలిసిపోయారు
కదా
అని
దీప
గట్టిగా
వాదించింది.
పారు
శపథం:
శ్రీధర్-కాంచన
కలయికపై
తాను
కాంచన
కాళ్లు
పట్టుకుని
అయినా
కలుపుతానని
పారిజాతం
శపథం
చేసింది.
అయితే,
కావేరిని
వదిలేయాలని,
ఆ
బిడ్డతో
ఎలాంటి
సంబంధం
లేదని
వస్తేనే
కలుపుతానని
చెప్పడంతో
అంతా
ఉలిక్కిపడ్డారు.
కార్తీక్
కౌంటర్:
పారు
అబద్ధపు
అంచనాలపై
కార్తీక్
గట్టి
కౌంటర్
ఇచ్చాడు.
“మా
నాన్నని
తాత
కొట్టి
ఇంట్లోంచి
తరిమేశాడు,
మళ్లీ
మా
నాన్నని
క్షమిస్తాడని
నువ్వు
ఊహించావా?
ఇన్ని
జరిగినప్పుడు
మా
నాన్నని
మా
అమ్మ
క్షమించదని
నువ్వు
అనుకుంటున్నావా?”
అని
కార్తీక్
ప్రశ్నించాడు.
శ్రీధర్
అక్కడి
నుంచి
నిరాశగా
వెళ్లగా,
జ్యోత్స్న
తన
లాప్‌టాప్
ఇవ్వడానికి
వెళ్లి,
వస్తూ
వస్తూ
గర్భవతి
అయిన
దీపకు
కాళ్లు
అడ్డుపెట్టింది.
దీప
కింద
పడిపోబోతుండగా
సుమిత్ర
పట్టుకుంది.
ఈ
నీచమైన
చర్యతో
దీప
కోపంగా
జ్యోత్స్న
వైపు
చూస్తూ
నేటి
ఎపిసోడ్
ముగుస్తుంది.


