Entertainment
oi-Korivi Jayakumar
మిల్కీ
బ్యూటీ
“తమన్నా
భాటియా”
తెలుగు
చిత్ర
పరిశ్రమలో
తనకంటూ
ప్రత్యేక
స్థానాన్ని
సంపాదించుకుంది.
టాలీవుడ్‌లో
అడుగుపెట్టి
దాదాపు
20
సంవత్సరాలు
పూర్తి
చేసుకుంది.
2005లో
‘శ్రీ’
సినిమాతో
హీరోయిన్‌గా
ఎంట్రీ
ఇచ్చి..
స్టార్
హీరోలందరితో
నటించి
టాప్
హీరోయిన్‌గా
పేరు
తెచ్చుకుంది.
ప్రస్తుతం
తెలుగులో
సినిమాలు
తగ్గించింది.
అయితే
బాలీవుడ్‌లో
మాత్రం
ఫుల్
ఫామ్‌లో
దూసుకుపోతూ
వరుస
ఆఫర్లు
అందుకుంటోంది.
కాగా
తెలుగుతో
పాటు
తమిళం,
హిందీ
సహా
పలు
భాషల్లో
నటించి
మెప్పించింది
ఈ
భామ.
లవ్
స్టోరీస్,
యాక్షన్
ఎంటర్టైనర్లు,
లేడీ
ఓరియెంటెడ్
సినిమాలు..
ఇలా
అన్ని
రకాల
చిత్రాల్లో
అదరగొట్టింది.
అయితే
ప్రతి
ఒక్కరి
కెరీర్
లో
ఒక
డ్రీమ్
రోల్
చేయాలని
ఉండడం
సహజమే.
ఈ
క్రమంలోనే
రీసెంట్
గా
ఇచ్చిన
ఓ
ఇంటర్వ్యూలో
తన
మనసులో
మాటను
బయటపెట్టింది.
ఇంటర్వ్యూలో
తమన్నా
మాట్లాడుతూ..
బయోపిక్
చేసే
అవకాశం
వస్తే
శ్రీదేవి
పాత్రను
ఎంచుకుంటా
అని
తెలిపింది.
శ్రీదేవిని
చిన్నప్పటి
నుంచి
ఆరాధిస్తున్నానని..
ఆమె
స్టైల్,
ఎక్స్
ప్రెషన్స్
సహా
అన్నీ
ఇన్‌స్పిరేషన్
అంటూ
చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం
తమన్నా
కామెంట్స్
కి
సంబంధించిన
వీడియో
సోషల్
మీడియాలో
వైరల్
గా
మారింది.
అయితే
ఇప్పటికే
శ్రీదేవి
భర్త,
ప్రముఖ
నిర్మాత
బోనీ
కపూర్..
శ్రీదేవి
వ్యక్తిగత
జీవితం
గురించి
ఏ
సినిమా
తీసే
అనుమతి
ఇవ్వనని
ప్రకటించిన
విషయం
తెలిసిందే.
దాంతో
పలు
ప్రాజెక్టులు
సైతం
పట్టాలెక్కకుండా
నిలిచిపోయాయి.
ఇక
ప్రస్తుతం
ఇండియన్
సినిమా
ఇండస్ట్రీలో
బయోపిక్‌ల
ట్రెండ్
నడుస్తోంది.
రాజకీయ,
సినీ
ప్రముఖుల
జీవితాల
ఆధారంగా
పలు
బయోపిక్స్
తెరకెక్కాయి.
ఎన్టీఆర్
బయోపిక్
(కథానాయకుడు,
మహానాయకుడు),
జయలలిత
బయోపిక్
“తలైవి”,
మాజీ
సీఎం
వైఎస్
రాజశేఖర
రెడ్డి
జీవితం
ఆధారంగా
యాత్ర
చిత్రాలు
తెరకెక్కాయి.
అలానే
సావిత్రి
జీవితం
ఆధారంగా
మహానటి..
సిల్క్
స్మిత
స్టోరీతో
దర్తి
పిక్చర్..
ధోని,
మేరీ
కోమ్,
సంజయ్
దత్
సహా
పలువురి
బయోపిక్‌లు
రిలీజ్
అయ్యి
మంచి
విజయాలు
అందుకున్నాయి.
మరి
తమన్నా
డ్రీమ్
రోల్
అయిన
శ్రీదేవి
బయోపిక్‌కు
బోనీ
కపూర్
గ్రీన్
సిగ్నల్
ఇస్తారా?
లేక
తమన్నా
కోరిక
తీరాకుండానే
మిగిలిపోతుందా?
అనేది
చూడాలి.


