India
oi-Syed Ahmed
గతేడాది
రష్యా
నుంచి
డిస్కౌంట్
పై
చమురు
కొనుగోలు
చేస్తూ
ఉక్రెయిన్
యుద్ధానికి
ఆజ్యం
పోస్తున్నారని
ఆరోపిస్తూ
భారత్
(india)పై
25
శాతం
సుంకాలు,
మరో
25
శాతం
జరిమానా
సుంకాలు
విధించిన
అమెరికా
అధ్యక్షుడు
ట్రంప్
తాజాగా
రూటు
మార్చారు.
ఎప్పటి
నుంచో
భారత్
తో
వాణిజ్య
ఒప్పందంపై
ఊరిస్తూ
వస్తున్న
ఆయన..
రష్యా
నుంచి
చమురు
కొనుగోలు
చేయబోమన్న
హామీతో
అసలు
సుంకాల్ని
25
శాతం
నుంచి
18
శాతానికి
తగ్గించడంతో
పాటు
వాణిజ్య
ఒప్పందం
(india
us
trade
deal)
కూడా
చేసుకున్నారు.
అయితే
ఇందులో
భారత్
పాత్ర
ఎంతనే
చర్చ
మొదలైంది.
గతంలో
భారత్-పాకిస్తాన్
కాల్పుల
విరమణను
తానే
చేయించానంటూ
ట్రంప్
చెప్పుకున్న
నేపథ్యంలో
అప్పట్లో
ఎదురైన
విమర్శల
తరహాలోనే
ఈసారి
కూడా
మన
పాత్ర
లేకుండానే
ట్రంప్
అంతే
చేసేశారన్న
విమర్శల్ని
విపక్షాలు
చేస్తున్నాయి.
దీంతో
కేంద్రం
వీటిపై
దాదాపు
అదే
అర్దం
వచ్చేలా
కేంద్రం
వివరణ
ఇచ్చింది.
ఇవాళ
పార్లమెంట్
లో
రచ్చ
తర్వాత
ప్రెస్
మీట్
పెట్టిన
వాణిజ్యమంత్రి
పీయూష్
గోయల్
క్లారిటీ
ఇచ్చారు.
ట్రంప్
మన
మీద
ముందుగా
సుంకాలు
విధించారని,
ఆ
తర్వాత
ఇప్పుడు
ఆయనే
ముందుగా
వాటిని
తొలగించారని
పీయూష్
గోయల్
స్పష్టం
చేశారు.
ఇందులో
అమెరికా
ఒత్తిడికి
తలొగ్గి
ప్రధాని
మోడీ
చేసిందేమీ
లేదని
తేల్చిచెప్పేశారు.
ఈ
మేరకు
విపక్ష
నేత
రాహుల్
గాంధీ
చేసిన
విమర్శల్ని
ఆయన
తోసిపుచ్చారు.
రాహుల్
గాంధీ
ప్రజలను
తప్పుదారి
పట్టించాలని
అనుకుంటున్నారని,
దేశ
పురోగతి
గురించి
ఆయనకు
అవసరం
లేదని
తెలిపారు.
రాహుల్
గాంధీ
సమస్య
ఏమిటని
ప్రశ్నించారు.
విపక్ష
నేత
తన
నెగెటివ్
మైండ్
సెట్
తో
ఏం
సాధించాలనుకుంటున్నాడో
ప్రజలకు
సమాధానం
చెప్పాలన్నారు.


