Cinema
oi-Korivi Jayakumar
ప్రముఖ
నటి
గిరిజా
ఓక్..
అంటే
అందరూ
గుర్తుపట్టకపోవచ్చు
కానీ..
వైరల్
లేడీ
ఇన్
బ్లూ
శారీ
అంటే
మాత్రం
అందరికీ
ఠక్కున
గుర్తొస్తుంది.
మరాఠీ
చిత్ర,
టెలివిజన్
రంగాల్లో
తనదైన
నటనతో
పేరు
సంపాదించుకున్నారు
ఈ
భామ.
తనదైన
నటనతో
ప్రేక్షకుల
మనసుల్లో
ప్రత్యేక
స్థానం
సంపాదించుకున్నారు.
‘గోష్ట
చోటి
డోంగ్రేవధి’,
‘గుల్మోహర్’
వంటి
మరాఠీ
చిత్రాల్లో
నటించి
మంచి
గుర్తింపు
తెచ్చుకోగా..
జీ
మరాఠీ
ప్రసారం
చేసిన
‘లజ్జా’
సీరియల్‌తో
బుల్లితెరపై
కూడా
ఫుల్
క్రేజ్
సొంతం
చేసుకున్నారు.
‘తారే
జమీన్
పర్’తో
జాతీయస్థాయి
గుర్తింపు..
కాగా
బాలీవుడ్‌లో
తొలి
ప్రయత్నంలోనే
అమీర్
ఖాన్
రూపొందించిన
క్లాసిక్
చిత్రం
“తారే
జమీన్
పర్”
లో
నటించి
దేశవ్యాప్తంగా
మంచి
గుర్తింపును
పొందారు.
ఆ
తర్వాత
షోర్
ఇన్
ది
సిటీలో
కూడా
కీలక
పాత్రతో
మెప్పించారు.
కమర్షియల్
హిట్
అయిన
ఈ
చిత్రంలో
తెలుగు
హీరో
సందీప్
కిషన్‌తో
ఆమె
చేసిన
లిప్‌లాక్
సీన్
కూడా
అప్పట్లో
పెద్ద
చర్చనీయాంశంగా
మారింది.
హిందీ
టెలివిజన్
రంగంలో
కూడా
ఆమె
పోషించిన
‘లేడీస్
స్పెషల్
–
సీజన్
2’
పాత్రతో
ప్రేక్షకులకు
మరింత
చేరువయ్యారు.
ఇటీవల
షారూఖ్
ఖాన్
నటించిన
బ్లాక్‌బస్టర్
“జవాన్”
మూవీలో
కూడా
గిరిజా
ఓక్
చేసిన
పాత్ర
మంచి
గుర్తింపు
పొందింది.
ఇంటర్వ్యూతో
వైరల్…
అయితే
కొద్ది
రోజుల
క్రితమే
గిరిజా
ఓక్
ఒక
ఇంటర్వ్యూలో
పాల్గొన్నారు.
ఈ
ఇంటర్వ్యూలో
ఆమె
స్టైలిష్
లుక్,
మాట్లాడే
తీరు,
సహజ
స్వభావం
నెటిజన్లను
బాగా
ఆకట్టుకుంది.
కొద్ది
గంటల్లోనే
ఆమె
క్లిప్
సోషల్
మీడియాలో
వైరల్
అయ్యింది.
దాంతో
ఆమె
కెరీర్‌లో
చేసిన
ఎన్నో
సినిమాలు
కూడా
ఇవ్వని
పాప్యులారిటీ
ఒక్క
ఈ
వీడియోతో
వచ్చింది.
ఫాలోవర్స్
సంఖ్య
భారీగా
పెరిగి,
దేశవ్యాప్తంగా
ఆమె
పేరు
మరోసారి
ట్రెండింగ్
టాపిక్‌గా
మారింది.
నీ
రేటు
ఎంత..?
అయితే
ఈ
వైరల్
వీడియో
ఆమెకు
కొత్త
అవకాశాలను
ఇవ్వలేదని..
బదులుగా
తీవ్రమైన
ట్రోలింగ్,
అసభ్యకరమైన
కామెంట్లు
మాత్రమే
పెరిగాయని
గిరిజా
ఓక్
ఆవేదన
వ్యక్తం
చేశారు.
లేటెస్ట్
గా
ఒక
ఇంటర్వ్యూలో
ఆమె
తనకు
వస్తున్న
ఆన్‌లైన్
వేధింపుల
గురించి
నోరువిప్పారు.
వీడియో
వైరల్
అయిన
తర్వాత
నా
జీవితంలో
పెద్ద
మార్పేమీ
రాలేదు.
కానీ
అసహ్యకరమైన
మెసేజ్‌లు
మాత్రం
వేల
సంఖ్యలో
వస్తున్నాయని
తెలిపారు.
“నీ
రేటు
ఎంత?”,
“ఒక
గంటకు
ఎంత
తీసుకుంటావు?”
వంటి
ఘోరమైన
మెసేజులు
రోజూ
వస్తున్నాయని
ఎమోషనల్
అయ్యారు.
ఆన్‌లైన్‌లో
అసహ్యంగా
మెసేజ్‌లు
పంపేవాళ్లే,
రోడ్డు
మీద
కనిపిస్తే
గౌరవంగా
మాట్లాడుతున్నారని..
కనీసం
కన్నెత్తి
చూడడానికి
కూడా
భయపడతారని
ఆమె
వ్యాఖ్యానించారు.
కానీ
సోషల్
మీడియా
వచ్చాక
చాలామందికి
అదుపు
లేకుండా
పోయింది”
అని
గిరిజా
ఓక్
ఆవేదన
వ్యక్తం
చేశారు.
ఆమె
వ్యాఖ్యలు
ప్రస్తుతం
సోషల్
మీడియాలో
వైరల్
అవుతున్నాయి.
దీంతో
మరోసారి
సెలబ్రిటీలపై
జరుగుతున్న
ఆన్‌లైన్
వేధింపుల
వ్యవహారం
చర్చకు
తెరలేపింది.
గిరిజా
ఓక్
మాత్రమే
కాకుండా
అనేక
మంది
నటీనటులు,
యూట్యూబర్లు,
టీవీ
ఆర్టిస్టులు
కూడా
సోషల్
మీడియాలో
ట్రోలింగ్
గురించి
బహిరంగంగా
మాట్లాడిన
సందర్భాలు
ఉన్నాయి.
అసభ్యకరమైన
కామెంట్లు,
హేయమైన
విమర్శలు,
వ్యక్తిగత
జీవితంపై
దూషణలు
తీవ్రమైన
మానసిక
ఒత్తిడికి
గురవుతున్నట్లు
ఓపెన్
అయ్యారు.


