International
oi-Korivi Jayakumar
పాకిస్థాన్
ఉగ్రవాద
సంస్థ
జైషే
మరోసారి
తన
కుట్రను
బయటపెట్టింది.
తమ
సంస్థ
కార్యకలాపాలను
విస్తరిస్తూ
మహిళలతో
ఓ
ఉగ్రవాద
గ్రూప్‌ను
తయారు
చేసినట్టు
తెలుస్తోంది.
జైషే
మహమ్మద్
చీఫ్
మసూద్
అజార్
సోదరి
సాదియా
అజార్
మహిళా
గ్రూప్
కి
నేతృత్వం
వహిస్తోంది.
కాగా
జమాతుల్-ముమినాత్
పేరుతో
ఓ
ప్రత్యేక
యూనిట్‌ను
తయారు
చేస్తోంది.
అయితే
కొద్ది
వారాల
వ్యవధిలోనే
ఈ
గ్రూప్
సుమారు
5
వేల
మంది
మహిళల్ని
ఆకర్షించినట్లు
సమాచారం.
ఈ
విషయాన్ని
స్వయంగా
జైషే
మహమ్మద్
చీఫ్
మసూద్
అజార్
సోషల్
మీడియా
వేదికగా
ఈ
విషయాన్ని
తెలియజేశాడు.
ఐదువేల
మందితో..
ఉగ్రవాద
సంస్థ
మహిళా
విభాగంలో
నియామకాల
సంఖ్య
పెరుగుతోందని
జైష్
చీఫ్
మసూద్
అజార్
తెలిపాడు.
ఇప్పుడు
జిల్లా
యూనిట్లను
ఏర్పాటు
చేయాల్సిన
అవసరం
ఉందన్నాడు.
“జైషే
మహిళా
విభాగంలో
నియామకాల
సంఖ్య
పెరుగుతోంది.
చాలా
తక్కువ
సమయంలోనే
5,000
మందికిపైగా
మహిళలు
చేరారు.
చాలా
మంది
సోదరీమణులు
నియామకం
పొందిన
వెంటనే
తమ
మానస్థిక
స్థితిమారిపోయినట్లు
చెబుతున్నారు.
జీవిత
లక్ష్యాన్ని
గ్రహించినట్లు
చెప్పారు.
ప్రతి
జిల్లాకు
ఒక
ముంటాజియా
(మేనేజర్)
ఉంటారు”
అని
ఆ
పోస్టులో
పేర్కొన్నారు.
ప్రస్తుతం
ఈ
పోస్ట్
వైరల్
అవుతోంది.
జమాతుల్-ముమినాత్
కోసం
నియామక
డ్రైవ్
ఈ
ఏడాది
అక్టోబర్
8న
జైషే
ప్రధాన
కార్యాలయం
మర్కజ్
ఉస్మాన్-ఓ-అలీలో
ప్రారంభమైంది.
ఈ
డ్రైవ్‌లో
భాగంగా
పాక్‌లోని
బహవల్‌పూర్,
ముల్తాన్,
సియాల్‌కోట్,
కరాచీ,
ముజఫరాబాద్,
కోట్లి
నుంచి
మహిళలను
ఉగ్రవాద
సంస్థలోకి
చేర్చుకున్నారు.
ఈ
సంస్థ
రూ.500
ఫీజుతో
40
నిమిషాలు
ఆన్‌లైన్
శిక్షణ
ఇస్తూ..
మహిళల్ని
ఉగ్రవాదం
వైపు
మళ్లించే
ప్రయత్నాలు
జరుగుతున్నాయని
భద్రతా
వర్గాలు
అనుమానిస్తున్నాయి.
ఐఎస్‌ఐఎస్,
హమాస్,
ఎల్‌టీటీఈ
తరహాలో
ఆత్మాహుతి
దాడులు
నిర్వహించడానికి
ఈ
మహిళలతో
ఉగ్రవాద
బ్రిగేడ్‌లను
ఏర్పాటు
చేయడమే
ఈ
వ్యూహం
వెనుక
ఉన్న
ప్రధాన
లక్ష్యంగా
తెలుస్తోంది.


