Cinema
oi-Korivi Jayakumar
ప్రముఖ
ఓటీటీ
ప్లాట్
ఫామ్
“నెట్‌ఫ్లిక్స్”
కి
ఉన్న
ఫ్యాన్
బేస్
గురించి
కొత్తగా
చెప్పాల్సిన
అవసరం
లేదు.
ఒకప్పుడు
DVD
రెంటల్
కంపెనీగా
ప్రారంభమై..
ఇప్పుడు
స్ట్రీమింగ్
దిగ్గజంగా
ఎదిగింది.
సినిమాలు,
సిరీస్‌లు,
డాక్యుమెంటరీలు…
ఇలా
ఆడియన్స్
ని
అలరిస్తూనే
ఉంటుంది.
190కి
పైగా
దేశాల్లో
సర్వీసులు
అందిస్తూ..
గ్లోబల్
ఎంటర్టైన్‌మెంట్
రంగంలో
టాప్
లో
దూసుకుపోతుంది.
కేవలం
హాలీవుడ్
చిత్రాలను,
సిరీస్
లను
మాత్రమే
కాకుండా
లోకల్
లాంగ్వేజ్
లలో
సైతం
మంచి
ఎంగేజ్
ఉంది
ఈ
ఓటీటీకి.
మరీ
ముఖ్యంగా
తెలుగు,
తమిళ,
హిందీ
సినిమాలను
గ్లోబల్
ఆడియన్స్‌కు
పరిచయం
చేసిన
పెద్ద
ప్లాట్‌ఫారమ్‌గా
కూడా
పేరు
తెచ్చుకుంది.
అయితే
సాధారణంగా
హెవీ
లోడ్,
టెక్నికల్
ఇష్యూ
కారణంగా
ఓటీటీ
స్ట్రీమింగ్
కి
అంతరాయం
కలగడం
సహజమే.
కానీ
ఏకంగా
సైట్
క్రాష్
అయ్యిందంటే
ఏ
రేంజ్
లో
యూజర్
ఎంగేజ్
మెంట్
ఉందో
అర్ధం
చేసుకోవచ్చు.
ఇప్పటికే
ఎవరైనా
స్టార్
హీరోలు,
పేరొందిన
సిరీస్
ల
రిలీజ్
సమయంలో
ఓటీటీ
ప్లాట్
ఫామ్స్
క్రాష్
అవ్వడం
చూసుంటాం.
ఇప్పుడు
నెట్‌ఫ్లిక్స్
కూడా
ఇదే
అనుభవాన్ని
ఎదుర్కొంటూ
విమర్శలు
మూటగట్టుకుంటుంది.
కారణం
ఇదే..
నెట్‌ఫ్లిక్స్
ప్లాట్‌ఫారమ్
క్రాష్
అవ్వడానికి
కారణం
‘స్ట్రేంజర్
థింగ్స్’
సిరీస్.
ప్రపంచవ్యాప్తంగా
కోట్లాది
మంది
అభిమానులను
సంపాదించుకున్న
ఈ
సిరీస్
ఇప్పటికే
నాలుగు
సీజన్
లను
సక్సెస్
ఫుల్
గా
పూర్తి
చేసుకుంది.
ఇప్పుడు
చివరిగా
ఐదో
సీజన్
విడుదల
నేపధ్యంలో
నెట్‌ఫ్లిక్స్
భారీ
ఒత్తిడిని
ఎదుర్కొంది.
మూడు
సంవత్సరాలుగా
ఈ
సీజన్
కోసం
ఎదురుచూస్తున్న
అభిమానుల
ఉత్సాహం
కారణంగా..
నవంబర్
26న
నెట్‌ఫ్లిక్స్
సేవలు
అనేక
ప్రాంతాల్లో
నిలిచిపోయాయి.
కాగా
‘స్ట్రేంజర్
థింగ్స్’
సిరీస్
2016లో
విడుదలైనప్పటి
నుండి
అత్యధికంగా
వీక్షింపబడిన,
అత్యంత
ప్రభావం
చూపిన
సిరీస్‌గా
ఎదిగింది.
80ల
నాటి
నోస్టాల్జియా,
సూపర్
నేచురల్
థ్రిల్లర్
ఎలిమెంట్స్,
హాకిన్స్
పట్టణం,
వెక్నా
వంటి
దుష్ట
శక్తులు
ఈ
షోని
ఒక
కల్ట్
క్లాసిక్‌గా
మార్చాయి.
ముఖ్యంగా
ఈ
సిరీస్‌లో
ఇలెవన్
పాత్రలో
మిల్లీ
బాబీ
బ్రౌన్..
మైక్,
విల్,
డస్టిన్,
లుకాస్,
హాపర్,
జాయిస్
పాత్రలు
ప్రేక్షకుల
హృదయాల్లో
ప్రత్యేక
స్థానం
సంపాదించాయి.
ఐదో
సీజన్
విడుదల..
సిరీస్
ముగింపు
సీజన్‌గా
ఉన్న
స్ట్రేంజర్
థింగ్స్
5
ప్రపంచవ్యాప్తంగా
అత్యంత
ఆసక్తిగా
ఎదురుచూసిన
వాటిలో
నిలిచింది.
ఐదో
సీజన్
వాల్యూమ్
1,
వాల్యూమ్
2,
ఫినాలే
అంటూ
మూడు
పార్టులుగా
రిలీజ్
కానుంది.
మొదటి
పార్ట్
నవంబరు
26న
రిలీజ్
చేయగా..
రెండో
పార్ట్
డిసెంబరు
25న,
మూడో
పార్ట్
డిసెంబరు
31
విడుదల
చేయబోతున్నట్లు
నెట్‌ఫ్లిక్స్
ప్రకటించింది.
విడుదలైన
Volume
1
లో
తొలి
నాలుగు
ఎపిసోడ్‌లు
రిలీజ్
చేశారు.
ఈ
సిరీస్
కూడా
నెక్స్ట్
లెవెల్
అంటూ
కామెంట్స్
వినిపిస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా
అంతరాయం..
ఈ
సిరీస్
విడుదలకు
గంటల
ముందు
నుంచే
నెట్‌ఫ్లిక్స్
సర్వర్లు
భారీ
ట్రాఫిక్‌ను
నమోదు
చేశాయి.
14,000
మందికి
పైగా
వినియోగదారులు
“Netflix
Not
Working”
అని
DownDetector
కు
రిపోర్ట్
చేశారు.
వాటిలో
ముఖ్యంగా
51%
–
వీడియో
స్ట్రీమింగ్
లోపాలు,
41%
–
సర్వర్
కనెక్షన్
సమస్యలు,
8%
–
యాప్
పూర్తి
స్థాయిలో
ఓపెన్
కాకపోవడం
ఉన్నాయి.
భారత్
సహా
పలు
దేశాల్లో
నెట్‌ఫ్లిక్స్
కొంతసేపు
పనిచేయని
పరిస్థితి
నెలకొంది.
ప్లాట్‌ఫారమ్
క్రాష్
నివారించేందుకు
30%
అదనపు
బ్యాండ్‌విడ్త్
పెంచినా
కూడా
రద్దీని
ఆపలేకపోయారని
తెలుస్తోంది.
సోషల్
మీడియాలో
ఫన్నీ
కామెంట్స్..
-
“స్ట్రేంజర్
థింగ్స్
5
కోసం
రాత్రి
1
వరకు
మేల్కొన్నాను…
నెట్‌ఫ్లిక్స్
డౌన్?
ఇది
నన్నే
హింసించేందుకా?” -
“అందరూ
నెట్‌ఫ్లిక్స్
అవుటేజ్
చెక్
చేస్తున్నారంటే
ఒకే
కారణం-ST5” -
“వెక్నా
తన
పని
మొదలుపెట్టేశాడా
లేక
ఏమిటి?
🥲” -
నెట్‌ఫ్లిక్స్
చరిత్రలో
ఇదే
అత్యధిక
ట్రాఫిక్
రోజు
కావచ్చు
ఇలా
పలు
కామెంట్స్
రాసుకొచ్చారు.


