ఆదిలాబాద్‌కు ఎయిర్‌బస్‌ తీసుకొస్తా : సీఎం రేవంత్‌రెడ్డి | cm revanth reddy comments at adilabad praja palana meeting

Date:


Telangana

oi-Korivi Jayakumar

ప్రజలను
పట్టి
పీడించిన
పాత
ప్రభుత్వాన్ని
ఓడించి..
ప్రజలు
తమకు
అండగా
నిలబడి
ప్రజా
పాలన
తీసుకువచ్చారని
సీఎం
రేవంత్
రెడ్డి
అన్నారు.
తమ
ప్రభుత్వం
అభివృద్ధి,
సంక్షేమంను
రెండు
కళ్లుగా
భావించి
నాలుగు
కోట్ల
ప్రజల
అభ్యున్నతి
లక్ష్యంగా
పనిచేస్తున్నామని
పేర్కొన్నారు.
కాగా
ప్రజాపాలన-ప్రజా
విజయోత్సవాల
సందర్భంగా
ముఖ్యమంత్రి
ఆదిలాబాద్
పట్టణంలో
పర్యటించారు.
పట్టణ
అభివృద్ధికి,
మహిళా
సంక్షేమం,
విద్యా,
భద్రతా
రంగాలకు
సంబంధించిన
ప్రాజెక్టులకు
శంకుస్థాపన
చేశారు.
మొత్తం
రూ.260.45
కోట్ల
నిధులను
కేటాయించారు.

ఎన్నికలు
వచ్చినప్పుడు
రాజకీయాలు,
ముగిశాక
అభివృద్ధి,
సంక్షేమ
కార్యక్రమాలను
పేదలకు
అందించడమే
లక్ష్యం”
అని
స్పష్టం
చేశారు.
తాను
చిన్న
వయసులోనే
జడ్పీటీసీ,
ఎమ్మెల్సీ,
ఎమ్మెల్యే,
ఎంపీ,
ముఖ్యమంత్రిగా
అవకాశం
వచ్చిందని,

రెండేళ్లలో
ఒక్క
రోజు
కూడా
సెలవు
తీసుకోకుండా
ప్రజల
గౌరవ
మర్యాదలు
పొందడం
కోసం
నిరంతరం
పనిచేస్తున్నానని
తెలిపారు.

cm-revanth-reddy-comments-at-adilabad-praja-palana-meeting

గత
ప్రభుత్వంలో
ప్రతిపక్ష
నాయకులను
ముఖ్యమంత్రి
సభలో
పాల్గొనే
అవకాశం
ఇవ్వలేదని,
సెక్రటేరియట్‌కు
వెళ్తే
తనను,
సీతక్కను
నిర్బంధించారని
గుర్తు
చేస్తూ,
ఇప్పుడు
అలాంటి
పరిస్థితులు
లేవని
అన్నారు.
“సంక్షేమం,
అభివృద్ధిని
ముందుకు
తీసుకెళ్లాలంటే
కేంద్ర,
రాష్ట్ర
ప్రభుత్వాలు
కలిసి
నడవాలి”
అనే
సిద్ధాంతంతో
పనిచేస్తున్నామని,
స్థానిక
బీజేపీ
నాయకులైన
ఎమ్మెల్యే
పాయల్
శంకర్,
ఎంపీ
గోడెం
నగేష్‌లను
కూడా
అభివృద్ధి
పంథా
వైపు
కలుపుకునిపోయే
ప్రయత్నం
చేస్తున్నట్లు
పేర్కొన్నారు.

ఉమ్మడి
ఆదిలాబాద్
జిల్లా
అభివృద్ధి
బాధ్యతను
తాను
తీసుకుంటానని
హామీ
ఇచ్చారు.
ఎయిర్‌పోర్ట్
కోసం
భూమి
ఇస్తే
కేంద్ర
మంత్రులు
సహకరిస్తారని..
ప్రధాని
మోదీ
నిధులు
ఇస్తామని
హామీ
ఇచ్చారన్నారు.
ఏడాదిలో
ఆదిలాబాద్‌కు
ఎయిర్‌పోర్టు,
ఎయిర్
బస్సును
తీసుకువస్తా
అని
హామీ
ఇచ్చారు.
పట్టణంలో
ఎడ్యుకేషన్,
ఇరిగేషన్,
కమ్యూనికేషన్లలో
అభివృద్ధి
చేస్తానని..
యూనివర్సిటీ
ఏర్పాటు
చేసే
బాధ్యత
తమ
ప్రభుత్వానిదేనని
తెలిపారు.
ఇంద్రవెల్లిలో
కొమ్రం
భీం
పేరుతో
విశ్వవిద్యాలయం
ఏర్పాటు
చేస్తే
బాగుంటుందని
సూచించారు.
మూతపడిన
సిమెంట్
కార్పొరేషన్
ఆఫ్
ఇండియా
(CCI)
కంపెనీని
తిరిగి
తెరిపించడానికి
ప్రైవేట్
పెట్టుబడిదారులను
తీసుకువచ్చే
ప్రయత్నం
చేస్తామని
ప్రకటించారు.

నీటి
పారుదల
ప్రాజెక్టులపై
మాట్లాడుతూ..
గత
ప్రభుత్వాన్ని
తీవ్రంగా
విమర్శించారు.
వైఎస్
రాజశేఖర్
రెడ్డి
మొదలుపెట్టిన
ప్రాణహిత-చేవెళ్ల
ప్రాజెక్టును
ఒక
పెద్దాయన
దయ్యంలా
మారి
పేరు,
అంచనాలు
మార్చడం
వల్ల
₹1.50
లక్షల
కోట్లు
అయ్యాయని,
“కాళేశ్వరం
మూడేళ్లలో
కూలేశ్వరం
అయింది”
అని
విమర్శించారు.
ఇప్పుడు
తుమ్మిడిహట్టి
దగ్గర
150
మీటర్ల
ఎత్తులో
ప్రాణహిత
ప్రాజెక్టు
కట్టడానికి
టెండర్లు
పిలిచామని,
ఆదిలాబాద్
జిల్లా
పొలాలకు
నీళ్లు
ఇస్తామని,
శంకుస్థాపనకు
తాను
వస్తానని
హామీ
ఇచ్చారు.

ప్రాజెక్టు
నిర్మాణానికి
మహారాష్ట్రను
ఒప్పించడంలో
స్థానిక
బీజేపీ
నాయకులు
సహకరించాలని
కోరారు.

cm-revanth-reddy-comments-at-adilabad-praja-palana-meeting

పీసీసీ
అధ్యక్షుడిగా
తొలి
పర్యటనలో
ఇంద్రవెల్లిలో
దళిత-గిరిజన
దండోరా
నిర్వహించామని..
ప్రభుత్వంలోకి
వచ్చాక
తొలి
సంతకంతో
ఇంద్రవెల్లి
అమరవీరుల
స్థూపాన్ని
పర్యాటక
కేంద్రంగా
ప్రకటించి,
అమరుల
కుటుంబాలకు
ఇందిరమ్మ
ఇళ్లు
ఇచ్చామని
చెప్పారు.
గత
పదేళ్లలో
నిరుద్యోగులకు
ఉద్యోగాలు
రాలేదని
విమర్శిస్తూ,
తమ
ప్రభుత్వం
మొదటి
ఏడాదే
61
వేల
మందికి
నియామక
పత్రాలు
ఇచ్చిందని,
టీజీపీఎస్సీని
ప్రక్షాళన
చేసి,
గ్రూప్
వన్,
గ్రూప్
టూ
ఉద్యోగాలు
ఇచ్చామని
తెలిపారు.

బీఆర్ఎస్
పై
విమర్శలు..

గత
ముఖ్యమంత్రి
తెలంగాణ
ఆడబిడ్డలను
దివాళా
తీయించారని
ఆరోపిస్తూ,
తమ
ప్రభుత్వం
ఆర్టీసీలో
మహిళల
ఉచిత
ప్రయాణం
కోసం
₹8,100
కోట్లు
కేటాయించిందని,
1,000
బస్సులకు
ఆడబిడ్డలను
యజమానులను
చేసిందని
తెలిపారు.
కోటి
మంది
ఆడబిడ్డలకు
కోటి
చీరలు
పంచుతామని..
వారిని
కోటీశ్వరులను
చేయడమే
తమ
లక్ష్యమని
పేర్కొన్నారు.

వ్యవసాయంపై
మాట్లాడుతూ..
సన్నవడ్లు
పండిస్తే
బోనస్
ఇస్తామని
చెప్పామని,
కొరాట,
చెనాక
ప్రాజెక్టు
పెండింగ్
పనులను
పూర్తి
చేస్తామని
హామీ
ఇచ్చారు.
సర్పంచ్
ఎన్నికల్లో
అడ్డగోలుగా
ఖర్చు
పెట్టవద్దని,
నిధులు
తీసుకురాగలిగే
వారిని,
నోరు
మంచిగా
ఉండే
వారిని
సర్పంచ్‌లుగా
గెలిపించుకోవాలని,
నిధులిచ్చి
అభివృద్ధి
చేసే
బాధ్యత
తనదని
హామీ
ఇచ్చారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related