Cinema
oi-Kannaiah
ఎస్‌ఎస్
రాజమౌళి…
టాలీవుడ్‌ను
ప్రపంచ
వేదికకు
పరిచయం
చేసిన
దర్శక
ధీరుడు.
ప్రస్తుతం
సూపర్
స్టార్
మహేష్
బాబుతో
పాన్
వరల్డ్
చిత్రం
వారణాసి
సినిమా
తీస్తున్నారు.
ఈ
క్రమంలోనే
కొద్దిరోజుల
క్రితం
రామోజీ
ఫిల్మ్
సిటీ
వేదికగా
గ్లోబ్‌ట్రాటర్
పేరుతో
వారణాసి
చిత్రం
మెగా
ఈవెంట్
నిర్వహించారు.
ఆ
సమయంలో
ఈ
దర్శకధీరుడు
కొన్ని
కామెంట్స్
చేశారు.
తనకు
దేవుడంటే
నమ్మకం
లేదని
చెప్పుకొచ్చాడు.
ఈ
వ్యాఖ్యలు
వైరల్
అయ్యాయి.
దీంతో
కొందరు
రంగంలోకి
దిగి
రాజమౌళిని
టార్గెట్
చేస్తూ
సోషల్
మీడియాలో
పోస్టులు
పెట్టారు.
ఈ
పోస్టులపై
సెన్సేషనల్
డైరెక్టర్
రాంగోపాల్
వర్మ
స్పందించారు.
జక్కన్నకు
సపోర్ట్‌గా
ఆర్జీవీ
దేవుడంటే
నమ్మకం
లేదని
చెప్పిన
జక్కన్నకు
డైరెక్టర్
ఆర్జీవీ
అండగా
నిలిచారు.
ఎవరైతే
ఈ
దర్శకధీరుడిని
సోషల్
మీడియా
వేదికగా
ట్రోల్
చేయడం
మొదలెట్టారో
వారి
భరతం
పట్టేందుకు
రాంగోపాల్
వర్మ
రంగంలోకి
దిగారు.
రాజమౌళి
చేసిన
వ్యాఖ్యల్లో
తప్పులేదని
చెప్పుకొచ్చారు.
రాజమౌళి
నాస్తికుడిగా
ఉండటంలో
తప్పేముంది
అని
వెనకేసుకొచ్చిన
ఆర్జీవీ
భారత
రాజ్యాంగంలోని
ఆర్టికల్
25
గురించి
గుర్తు
చేశాడు.ఎవరి
మతవిశ్వాసాలు
వారికుంటాయని,
దేవుడిని
నమ్మాలో
వద్దో
కూడా
ఒకరి
ఇష్టం
మీదే
ఉంటుందని
అన్నారు.కాబట్టి
రాజమౌళి
దేవుడిని
నమ్మను
అని
చెప్పడంలో
తప్పులేదని
ఆయనపై
అదే
పనిగా
విషం
చిమ్ముతున్న
వారికి
సూచన
చేశారు
ఆర్జీవి.
కేవలం
విషం
చిమ్ముతున్నారు
ఇక
దేవుడంటే
నమ్మకం
లేనప్పుడు
సినిమాలో
దేవుడి
ప్రస్తావన
తీసుకురావడం
ఎందుకని
కొందరు
పసలేని
వాదన
చేస్తున్నారని
ఆర్జీవీ
ఆగ్రహం
వ్యక్తం
చేశారు.
ఆ
లాజిక్
ప్రకారం
వెళితే…
గ్యాంగ్స్‌టర్
సినిమా
చేయాలంటే
దర్శకుడు
గ్యాంగ్‌స్టర్
అయి
ఉండాలా
అని
ప్రశ్నించారు.
హారర్
సినిమా
తీయాలంటే
దర్శకుడు
దెయ్యమై
ఉండాలా
అని
ప్రశ్నించారు.
రాజమౌళి
దేవుడిని
నమ్మకపోయినప్పటికీ..
అదే
దేవుడు
ఆయనకు
100
రెట్లు
సక్సెస్,
సంపద,
తనను
ఆరాధించే
అభిమానులను
ఇచ్చారని
ఈ
సెన్సేషనల్
డైరెక్టర్
చెప్పారు.
జక్కన్న
పై
విషం
చిమ్ముతూ
దేవుడిని
మేము
నమ్ముతున్నాం
అని
చెప్పుకునే
మేధావులు
100
జన్మలు
ఎత్తినా
ఇలాంటి
పేరు
ప్రఖ్యాతలు
సంపాదించుకోలేరని
తనదైన
శైలిలో
వర్మ
చురకలంటించారు.
దేవుడిని
నమ్మేవారికే
బీపీలు
అల్సర్లు
ఎందుకు..?
దేవుడిని
నమ్మే
వారికంటే..
దేవుడిని
నమ్మని
వారినే
ఆ
భగవంతుడు
ఎక్కువగా
ప్రేమిస్తాడని
వర్మ
చెప్పుకొచ్చారు.
భగవంతుడు
ఇలాంటి
విషయాలను
పట్టించుకోడని
చెప్పిన
వర్మ..
ఒక
పుస్తకంలో
ఎవరు
నమ్ముతారు
ఎవరు
నమ్మరు
అనేవారి
పేర్లు
రాయడమే
పనిగా
పెట్టుకోలేదని
సెటైర్
వేశారు.
ఇక
దేవున్ని
దైవాన్ని
నమ్మే
వారు
బీపీలతో,
అల్సర్లతో
ఎందుకు
అల్లాడిపోతున్నారని
సూటి
ప్రశ్న
వేశారు.
చివరిగా
దేవుడిని
నమ్ముతున్నాం
అని
చెప్పుకునే
పెద్దమనుషుల
సమస్య
నాస్తికత్వం
కాదు..
దైవం
అంటే
నమ్మకం
లేని
జక్కన్న
లాంటి
వారు
సక్సెస్
సాధించడం
ఓర్వలేక
పోతున్నారని
తేల్చిపారేశారు.
24
గంటలు
భక్తితో
పూజలు
చేసిన
వారు
మాత్రం
జీవితంలో
పైకి
ఎదగలేకపోవడంతోనే
వారిలో
అసహనం
పెరిగిపోతోందని
ఆర్జీవీ
అన్నారు.
దేవున్ని
నమ్మని
రాజమౌళికే
సిరిసంపదలు
రాజమౌళి
నాస్తికుడిగా
ఉన్నప్పటికీ…
ఎక్కడా
భగవంతుడిని
తక్కువ
చేసి
చూపించలేదు
లేదా
ఆయన
విలువ
తగ్గించేలా
ఎక్కడా
మాట్లాడలేదని
ఆర్జీవీ
గుర్తుచేశారు.
రాజమౌళి
లాంటి
సెలబ్రిటీలు
దేవుడిని
నమ్మను
అనే
వ్యాఖ్యలు
చేస్తే…
మిగతా
ప్రపంచం
కూడా
అదే
ఫాలో
అవుతుందేమో
అన్న
భయం
ఈ
పెద్దమనుషులను
ఆవహించి
ఉందని
అదే
వారి
సమస్య
అని
ఆర్జీవీ
క్రిస్టల్
క్లియర్‌గా
చెప్పేశారు.
కాబట్టి
దేవుడు
బాగున్నాడు,
రాజమౌళి
కూడా
బాగున్నాడు.
సమస్య
అంతా
దీన్ని
అర్థం
చేసుకోని
మనుషులదే
అని
చెప్పుకొచ్చారు.
ఇక
వారణాసి
సినిమాను
ఆ
భగవంతుడు
హిట్
చేస్తారని
జోస్యం
చెప్పిన
రాంగోపాల్
వర్మ..
జక్కన్న
బ్యాంక్
బ్యాలెన్స్
మరింత
పెరుగుతుందని
చెప్పారు.
అప్పుడు
ఈ
పెద్ద
మనుషులంతా
ఇంకా
విషం
చిమ్ముతూ..
అసూయ
పడతారని
వెల్లడించారు.
మొత్తానికి
ఇది
భగవంతుడో,
భక్తో
,
లేదా
దేవుడిపై
విశ్వాసమో
కాదని
కేవలం
అసూయతోనే
వీరంతా
జక్కన్నపై
విషం
కక్కుతున్నారంటూ
తన
ట్వీట్‌ను
ముగించాడు
రాంగోపాల్
వర్మ.


