ఏపీలో ఇక్కడ 10రూపాయలకే ఖరీదైన ఆపరేషన్లు, భోజనం, మందులు కూడా ఫ్రీ!

Date:


Andhra Pradesh

oi-Dr Veena Srinivas

ప్రస్తుత కార్పొరేట్ ఆసుపత్రుల కాలంలో పది రూపాయలకే అత్యుత్తమ వైద్యం చేసే ఆసుపత్రులు ఉన్నాయి అంటే ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. అత్యాధునిక సౌకర్యాలతో, అధునాతనమైన ఎక్విప్మెంట్ తో సేవలు చేస్తున్న ఆసుపత్రులు, కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా పోటీపడుతున్న ఆసుపత్రులు మన దేశంలో అనేకం ఉన్నాయి. ఇక అటువంటి ఆసుపత్రులలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడపబడే ఎయిమ్స్.

మంగళగిరి ఎయిమ్స్ పై సోషల్ మీడియా పోస్ట్

కేవలం పది రూపాయల ఓపి తో లక్షల ఖర్చు అయ్యే ఆపరేషన్లు కూడా జరుగుతాయి అంటే, సామాన్య ప్రజలకు వైద్యం అందుబాటులో ఉంది అనడానికి నిదర్శనం అంటే ఎయిమ్స్ అనే చెప్పాలి. పేదలకు వరంగా మారిన మంగళగిరి ఎయిమ్స్ పైన ప్రస్తుతం సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో మంగళగిరి ఎయిమ్స్ గురించి కచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే.

కార్పోరేట్ ఆస్పత్రులకు దీటుగా 10 రూపాయలకే వైద్యం

డబ్బుల్లేక వైద్యం చేయించుకోలేని పేద ప్రజలకు మంగళగిరి ఎయిమ్స్ (AIIMS) నిజంగా ఒక దేవాలయం అనే చెప్పాలి. కార్పొరేట్ ఆసుపత్రులకు ఏమాత్రం తీసిపోని అత్యాధునిక వైద్యం, అది కూడా కేవలం 10 రూపాయల ఓపీ తో అందిస్తుండటంతో సామాన్య ప్రజలకు ఎయిమ్స్ ధన్వంతరిలా మారింది. ఇటీవల అక్కడ జరిగిన రెండు సంఘటనలు ఎయిమ్స్ సేవలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు హల్చల్ చేస్తున్నాయి.

బ్రెయిన్ స్ట్రోక్ తో ఆస్పత్రిలో చేరిన యువకుడి ప్రాణాలు కాపాడిన ఎయిమ్స్

బ్రెయిన్ స్ట్రోక్ తో బాధపడుతున్న ఒక యువకుడికి మంగళగిరి ఎయిమ్స్ వైద్యులు, అతని బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ కాగా శస్త్ర చికిత్స చేసి అతని ప్రాణాన్ని కాపాడిన వైనాన్ని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఖరీదైన ఆపరేషన్ కు కేవలం 10 రూపాయలు తోనే మంగళగిరి ఎయిమ్స్ లో అత్యాధునిక ఎక్విప్మెంట్ తో ఆపరేషన్ జరిగిందని ఈ పోస్టులో పేర్కొన్నారు.

ప్రాణాలను కాపాడుతున్న ఎయిమ్స్

ఇక మరొక కేసు విషయానికొస్తే ఆరు నెలల క్రితం ఒక వ్యక్తి రెండు కిడ్నీలు పూర్తిగా పాడైపోయి మంగళగిరి ఎయిమ్స్ కి వస్తే కుటుంబ సభ్యులు కిడ్నీ డొనేట్ చేయగా, ఎయిమ్స్ నిపుణుల బృందం కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆపరేషన్ సక్సెస్ ఫుల్ గా చేశారని, దీంతో ఆ వ్యక్తి మళ్లీ పునర్జన్మను పొందాడని సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. ప్రజలకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం ఉండడం నిజంగా సామాన్య ప్రజలకు శుభవార్త అని చెబుతున్నారు.

పది రూపాయల ఓపీతో ఇక్కడ అన్నీ ఉచితమే

ఈ సమాచారం చాలా మంది పేద ప్రజలకు చేరాల్సిన అవసరం ఉందని, మంగళగిరి ఎయిమ్స్ అంతటి సేవలను అందిస్తుందని సోషల్ మీడియాలో పోస్టులతో ప్రచారం చేస్తున్నారు. మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరితే వైద్యంతో పాటు మందులు, భోజనం, చికిత్స అన్ని ఉచితంగానే ఉంటాయని దేనికి ఒక్క రూపాయి కూడా ఖర్చు కాదని ఆ పోస్టులలో పేర్కొంటున్నారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Festival Beauty Essentials for Sweat, Breakouts & Dry Skin

From Coachella to Lollapalooza and Bonnaroo, festival season is...

CA7RIEL y Paco Amoroso’s ‘Free Spirits’ Leads New Music Latin.

New Music Latin is a compilation of the best new...

What may happen if Congress doesn’t act

A person holds a sign reading "Save Our Social...