Andhra Pradesh
oi-Sai Chaitanya
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం అయ్యాయి. గవర్నర్ ప్రసంగానికి వైసీపీ సభ్యులు హాజరయ్యారు. నినాదాలు.. నిరసనలు చేసారు. గవర్నర్ ప్రసంగం సమయంలోనే వాకౌట్ చేసారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు సాధించిన పురోగతిని.. లక్ష్యాలను గవర్నర్ తన ప్రసంగంలో వివరించారు. కాగా, ఆ తరువాత సమావేశమైన బీఏసీ అసెంబ్లీ నిర్వహణ.. అజెండా పైన నిర్ణయం తీసుకున్నారు. కీలక అంశాల పైన సభ నుంచే స్పష్టత ఇవ్వాలని డిసైడ్ అయ్యారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాల వేళ ప్రభుత్వం వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశాల వేదిక గా ప్రస్తుతం కీలకంగా మారిన అన్ని అంశాల పైన చర్చించి… ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిసైడ్ అయింది. అదే విధంగా పాలనా పరంగానూ కీలక నిర్ణయాలు ప్రకటించనుంది. గవర్నర్ ప్రసంగం పూర్తయిన తరువాత బీఏసీ సమావేశం జరిగింది. ఈ సారి సమావేశాలను 17 రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 14న ప్రభుత్వం సభలో 2026-27 వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుంది. ఆ తరువాత 15,16 తేదీలు శివరాత్రి.. ఆ మరుసటి రోజు సెలవు ప్రకటించారు. 17, 18 తేదీల్లో బడ్జెట్ పైన చర్చ జరగనుంది. 18న బడ్జెట్ పై ఆర్దిక మంత్రి సమాధానం ఇవ్వను న్నారు. కాగా.. వరుసగా ఎనిమిది రోజుల పాటు బడ్జెట్ పద్దుల పైన శాఖల వారీగా చర్చించి… కేటాయింపులు.. ప్రాధాన్యతలు వివరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వం ఆరు ఆర్డినెన్స్ లకు ఆమోదం తెలపనుంది.
అసెంబ్లీ వేదికగా కీలక అంశాల పై చర్చ
ఇక, ఫిబ్రవరి 24,25,26 తేదీల్లో ఎమ్మెల్యేలకు ఆటల పోటీలు నిర్వహణకు బీఏసీలో నిర్ణయం జరిగింది. మార్చి 1,2,3 తేదీల్లో సెలవు ప్రకటించారు. ప్రతీ రోజు ఉదయం 9 నుంచి 2 గంటల వరకు సభ నిర్వహించనున్నారు. అదే విధంగా తప్పని సరిగా సమావేశాల్లో ప్రతీ రోజు 10 గంటలకు జీరో అవర్ నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. అవసరమైతే పొడిగించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇక, సమావేశాల ముగింపు రోజు మార్చి6న అమరావతి లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణకు స్పీకర్ నిర్ణయించారు. అయితే, ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమంతో పాటుగా ప్రతిష్ఠాత్మక కార్యక్రమాల గురించి సభా వేదికగా ప్రజలకు వివరించాలని భావిస్తున్నారు. తాజా వివాదాలు.. ప్రభుత్వం పైన వస్తున్న విమర్శలకు అసెంబ్లీ నుంచే స్పష్టత ఇవ్వనున్నారు. మెడికల్ కాలేజీలతో సహా… రుషికొండ పైనా సభలో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో… ఈ సారి సమావేశాలు మరింత ఆసక్తి కరంగా మారే అవకాశం కనిపిస్తోంది.


