జాక్ పాట్ కొట్టిన రిలయన్స్ ఇండస్ట్రీస్?

Date:


Business

oi-Chandrasekhar Rao

దేశ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు బంపర్ ఆఫర్ లభించింది. వెనిజులా ఆయిల్ ను కొనుగోలు చేయడానికి అవసరమైన లైసెన్స్ ను పొందింది. అమెరికా దీన్ని జారీ చేసింది. దీని ద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్.. అమెరికా ఆంక్షలను ఉల్లంఘించకుండా నేరుగా వెనిజులా చమురును కొనుగోలు చేయగలదు. ఈ నెల ప్రారంభంలోనే ఈ పరిణామాలు సంభవించినట్లు రాయిటర్స్ తెలిపింది. దీనిపై ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

ఈ కథనం ప్రకారం- ఈ నెల మొదటివారంలో వెనిజులా అధ్యక్షురాలితో అమెరికా చర్చలు జరిపింది. ఇవి సఫలం అయ్యాయి. దీంతో వెనిజులా ఆయిల్ ఇండస్ట్రీపై ఉన్న ఆంక్షలను సడలిస్తామని అమెరికా ప్రకటించింది. రెండు బిలియన్ డాలర్ల చమురు సరఫరా ఒప్పందాన్ని, ఆ దేశ చమురు పరిశ్రమ పునర్నిర్మాణం కోసం ఉద్దేశించిన 100 బిలియన్ డాలర్ల వ్యూహాత్మక ప్రణాళికలను సులభతరం చేయడమే ఈ చర్చల ముఖ్య ఉద్దేశం.

ఈ జనరల్ లైసెన్స్ పొందడం వల్ల.. ఇప్పటికే వెలికితీసిన వెనిజులా క్రూడాయిల్ కొనుగోళ్లు, ఎగుమతులు, అమ్మకాలతో పాటు దాని శుద్ధికి కూడా అనుమతి లభిస్తుంది. రిలయన్స్‌కు ఈ లైసెన్సు లభించడం వల్ల వెనిజులా చమురు ఎగుమతులు వేగవంతం కావడంతో పాటు ప్రపంచంలోనే అతిపెద్ద చమురు శుద్ధి సముదాయాన్ని నిర్వహిస్తున్న ఆ సంస్థ ముడి చమురు ధరలు తగ్గుతాయి.

రిలయన్స్ సంస్థ జనవరి ప్రారంభంలోనే ఈ లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు రాయిటర్స్ తెలిపింది. దీనిపై వ్యాఖ్యానించడానికి రిలయన్స్ ప్రతినిధులెవరూ స్పందించలేదని వివరించింది. అమెరికా ఆఫీస్ ఆఫ్ ఫారిన్ అసెట్స్ కంట్రోల్ (OFAC) కూడా ఇప్పటికిప్పుడు దీనిపై మాట్లాడటానికి సుముఖత వ్యక్తం చేయలేదు. ఈ నెల ప్రారంభంలోనే- రిలయన్స్ అనుబంధ సంస్థ.. విటోల్ నుండి రెండు మిలియన్ బ్యారెళ్ల వెనిజులా చమురును కొనుగోలు చేసింది.

విటోల్‌తో పాటు ట్రాఫిగ్యూరా సంస్థలకు కూడా మిలియన్ల కొద్దీ బ్యారెళ్ల వెనిజులా చమురును మార్కెటింగ్ చేయడానికి, విక్రయించడానికి అమెరికా లైసెన్సులు మంజూరు చేసింది. వెనిజులా నుండి చమురును నేరుగా కొనుగోలు చేయడం వల్ల రిలయన్స్‌కు ఖర్చు తగ్గి, రష్యా చమురు స్థానంలో తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయాన్ని వెదుక్కున్నట్టవుతుంది. కారకాస్ నుండి లభించే భారీ ముడి చమురు డిస్కౌంట్ ధరకు విక్రయించడానికి అవకాశం ఉందని అంచనా వేసింది రాయిటర్స్.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related