వారికి 500 యూనిట్లు ఫ్రీ కరెంట్… శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు!

Date:


Andhra Pradesh

oi-Dr Veena Srinivas

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేత కార్మికులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని చేనేత, మరమగ్గాల కార్మికుల సంక్షేమానికి కట్టుబడిన కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు చేనేతలకు నెలకు 200 యూనిట్లు, పవర్‌లూమ్స్‌కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందించేందుకు రంగం సిద్ధం చేసుకుంది.

చేనేత కార్మికులకు ఇచ్చిన హామీ నెరవేర్చే పనిలో చంద్రబాబు

గత ఎన్నికల ప్రచారంలో చేనేత కార్మికులను ఉద్దేశించి చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం రెడీ అయింది. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన నేత కుటుంబాల ఎంపిక ప్రక్రియను సంబంధిత శాఖాధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. గ్రామ, మండల స్థాయిలో ధృవీకరణ అనంతరం అర్హుల జాబితాకు తుదిరూపు ఇచ్చారు. తాజా బడ్జెట్‌లో నేతన్నల ఉచిత విద్యుత్ పథకానికి ప్రత్యేకంగా నిధులు కేటాయింపు చేయడంతో త్వరలోనే నేతన్నలకు ఉచిత విద్యుత్ అందనుంది.

ఏప్రిల్ 1 నుండి అమలులోకి పథకం

ఏప్రిల్ 1 నుంచి ఈ పథకం అమల్లోకి రానుంది. దీని ద్వారా వేలాది చేనేత, మరమగ్గాల కార్మిక కుటుంబాలకు నేరుగా లాభం చేకూరనుంది. ఇది చేనేతలకు చేయూతని ప్రభుత్వం అభిప్రాయపడుతోందిగత కొన్ని సంవత్సరాలుగా చేనేత రంగం ముడి సరుకు ధరలు పెరగడం, మార్కెట్‌లో పోటీ పెరగడం వంటి సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఖర్చులు కూడా వీరికి విపరీతంగా పెరిగాయి.

పవర్ లూమ్ యజమానులకు లబ్ది

విద్యుత్‌ ఖర్చులు కూడా ఉత్పత్తి వ్యయాన్ని పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉచిత విద్యుత్‌ అందించడం వల్ల ఉత్పత్తి ఖర్చులు తగ్గి, నేతన్నల ఆదాయం పెరగడానికి దోహదపడుతుందని భావిస్తోంది. ముఖ్యంగా పవర్‌లూమ్ యజమానులకు 500 యూనిట్ల వరకు సాయం అందించడం ద్వారా చిన్న, మధ్య తరహా యూనిట్లకు ఊరట లభించనుంది. దీని ఫలితంగా పవర్ లూమ్ పరిశ్రమలు నిర్వహించాలి అనుకునే యజమానులు లబ్ధి పొందుతారు.

రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై మంత్రి సవిత హర్షం

ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో నేత కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్లో చేసిన ప్రకటన వీరికి ఆనందం కలిగిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై నేతన్నల కుటుంబాల తరపున చేనేత జౌళి శాఖ మంత్రి సవిత ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పథకం ద్వారా చేనేత రంగానికి కొత్త ఊపు వస్తుందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని ఆమె పేర్కొన్నారు. ఎన్నికల హామీని అమలు చేయడం ద్వారా ప్రభుత్వం నేతన్నల పట్ల తన నిబద్ధతను చాటుకుందని మంత్రి సవిత స్పష్టం చేశారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Mark Cuban on How AI, Prediction Markets & More May Affect Music Biz

Investor and entrepreneur Mark Cuban joined Billboard at South...

New model of security and development established in U.P. in last nine years: Adityanath

Uttar Pradesh Chief Minister Yogi Adityanath on Wednesday launched...

90 Day Fiancé’s Julia Trubkina, Brandon Gibbs Welcome First Baby

The 90 Day Fiancé family has officially expanded. Brandon Gibbs...

Stopping GLP-1s raises cardiovascular risks: study

Boxes of Ozempic and Wegovy made by Novo Nordisk...