తిరుమలలో విశేష ఘట్టం.. క్షేత్రపాలక ఉత్సవం

Date:


Andhra Pradesh

oi-Chandrasekhar Rao

తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. శనివారం నాడు 82,337 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 30,825 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.58 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. అళ్వార్ ట్యాంక్ గెస్ట్ హౌస్ వరకు క్యూ లైన్ ఏర్పడింది. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 నుంచి 14 గంటల సమయం పట్టింది.

తిరుమలలో మహా శివరాత్రి ఉత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తిరుమల క్షేత్రపాలకుడికి ప్రత్యేకంగా అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు టీటీడీ అర్చకులు. తిరుమల క్షేత్రపాలకుడు.. రుద్రుడు. గోగర్భం సమీపంలో ఉంటుందీ ఆలయం. రుద్రుడి ప్రతిరూపమైన క్షేత్రపాలకుడికి వేడుకగా అభిషేకం జరిగింది. మహాశివరాత్రి సందర్భంగా ప్రతి సంవత్సరం రుద్రుడికి అభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

ఈ సందర్భంగా శ్రీవారి ఆలయం నుండి ఆలయ మర్యాదలు, మేళతాళాలు, మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా అధికారులు, అర్చకులు క్షేత్రపాలక రుద్రశిల వద్దకు చేరుకున్నారు. పాలు, పెరుగు, చందనం, పన్నీరు, కొబ్బరినీళ్లు తదితర ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ఆ తర్వాత నైవేద్యం సమర్పించారు. భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

CBA has major impact on players’ bank accounts

The Women's National Basketball Player's Association ratified the terms...

Mormon Wives Star Jessi Draper’s Husband Files for Restraining Order

Jessi Draper’s estranged husband is taking additional steps after...