తెలంగాణాలో బాలికల కోసం ఉచితంగా క్యాన్సర్ వ్యాక్సిన్.. పేరెంట్స్ మర్చిపోవద్దు!

Date:


Telangana

oi-Dr Veena Srinivas

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికి పెద్ద పీట వేసి పని చేస్తోంది. ముఖ్యంగా మహిళల ఆరోగ్యం పైన దృష్టి సారించి కీలక నిర్ణయం తీసుకుంది. 14 సంవత్సరాల నుండి 15 సంవత్సరాలు వయసు ఉన్న బాలికల కోసం కేంద్రంతో కలిసి ఉచిత సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ను అందించడానికి రెడీ అయింది.

బాలికల తల్లిదండ్రులకు శుభవార్త

ప్రస్తుతం క్యాన్సర్ కేసులు విపరీతంగా పెరుగుతున్న క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా బాలికలు ఎవరూ క్యాన్సర్ బారిన పడకూడదని భావించిన ప్రభుత్వం, రాష్ట్రంలో సుమారు 4.60 లక్షల మంది బాలికలకు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఇప్పించాలని నిర్ణయించింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా బాలికల తల్లిదండ్రులకు ఒక శుభవార్త అని చెప్పాలి.

15 సంవత్సరాల బాలికలకు హెచ్పివి టీకాలు

సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ ప్రారంభానికి ముందు మైక్రో ప్లానింగ్ సర్వే నిర్వహిస్తారు. దీని ద్వారా పాఠశాలల బయట ఉన్న బాలికల వివరాలను సేకరిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో క్యాన్సర్ కేసులను కట్టడి చేయడం కోసం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా 15 సంవత్సరాల బాలికలకు హెచ్పివి టీకాలను వేయించనున్నారు. సర్వైకల్ క్యాన్సర్ ప్రారంభ దశలో లక్షణాలు కల్పించకపోవడం వల్ల దీనిని సైలెంట్ కిల్లర్ అంటారు.

క్యాన్సర్ కట్టడికి తెలంగాణా ప్రభుత్వం నిర్ణయం

వ్యాధి ముదిరే కొద్ది లక్షణాలు బయటపడి, అది తీవ్ర దశకు చేరుకుంటుంది. అప్పుడు చికిత్స చేయడం, ప్రాణాలు కాపాడడం కూడా కష్టతరమవుతుంది. ఈ పరిస్థితిని అధిగమించడం కోసం 15 ఏళ్ల యుక్త వయసులో ఉన్న బాలికలకు వ్యాక్సిన్ ఇవ్వడం సర్వైకల్ క్యాన్సర్ కట్టడికి మంచి మార్గమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ సర్కార్ హెచ్పివి వ్యాక్సిన్ ను టీనేజ్ బాలికలకు ఇప్పించాలని నిర్ణయం తీసుకుంది.

వ్యాక్సిన్ బయట కొనాలంటే ఖర్చు

ఈ వ్యాక్సిన్ బయట కొనుగోలు చేస్తే ఒక్కో డోస్ కు 2000 రూపాయల నుంచి 4000 వరకు ఖర్చవుతుంది. 15 సంవత్సరాల నిండిన బాలికలకు ఈ వ్యాక్సిన్ మూడు డోసులు అవసరం ఉంటుంది. ఈ ఆర్థిక భారాన్ని ప్రభుత్వమే భరించి 15 ఏళ్ల బాలికలకు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే ఏర్పాట్లను పూర్తిచేసి టీకాలు అందించే సిబ్బందికి శిక్షణ ఇచ్చింది.

వ్యాక్సిన్ ఇప్పించటం మరచిపోవద్దు

తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తెలంగాణ రాష్ట్రంలో సర్వైకల్ క్యాన్సర్ కట్టడికి ఉపయోగపడుతుంది అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. కనుక 15 ఏళ్ల వయసు ఉన్న బాలికల తల్లిదండ్రులు ఎవరు నిర్లక్ష్యం చేయకుండా తమ పిల్లలకు ఈ వ్యాక్సిన్ ను ఇప్పించాలి.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Islamabad Airport Flight Suspension March 16: PAA Issues Urgent Travel Advisory for Passengers

Home » AIRLINE NEWS » Islamabad Airport Flight...

US Army announces contract with Anduril worth up to $20B

The U.S. Army said late Friday that it has...

Zach Braff on AI Chatbot Dating Rumors

Zach Braff is scrubbing an outlandish report from the...