నగదు పెరుగుతోంది…యూపీఐ దూసుకుపోతోంది:భారత ఆర్థిక వ్యవస్థలో మార్పు

Date:


India

oi-Kannaiah

భారత ఆర్థిక వ్యవస్థలో ఒక వింత పరిస్థితి నెలకొంది. ప్రజల చేతుల్లోనూ, బ్యాంకుల వద్ద ఉండే నగదు (Currency in Circulation – CiC) ఈ ఏడాది జనవరి నాటికి రికార్డు స్థాయిలో రూ. 40 లక్షల కోట్లకు చేరుకుంది.ఇది గతేడాది కంటే 11.1% ఎక్కువ.అయితే,చేతిలో నగదు పెరుగుతున్నా,దేశ వ్యాప్తంగా జరిగే ఆర్థిక లావాదేవీల్లో నగదు వాటా మాత్రం తగ్గుముఖం పట్టడం విశేషం.

జీడీపీలో తగ్గుతున్న నగదు వాటా

గతంలో కరోనా సమయంలో (మార్చి 2021) నగదు-జీడీపీ నిష్పత్తి 14.4% గా ఉండేది. కానీ, తాజా గణాంకాల ప్రకారం ఇది 11.2శాతానికి పడిపోయింది. అంటే, దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతున్నప్పటికీ, రోజువారీ అవసరాలకు భౌతిక నగదు కంటే డిజిటల్ చెల్లింపులనే ప్రజలు ఎక్కువగా ఆశ్రయిస్తున్నారని ఇది స్పష్టం చేస్తోంది.

నగదు నిల్వలు పెరగడానికి కారణాలేంటి?
ఎస్‌బీఐ (SBI) నివేదిక ప్రకారం, రికార్డు స్థాయిలో నగదు పెరగడానికి కొన్ని కీలక కారణాలు ఉన్నాయి:

  • పన్ను నిబంధనల భయం: జూలై 2025లో యూపీఐ (UPI) లావాదేవీల ఆధారంగా సుమారు 18,000 మంది చిన్న వ్యాపారులకు జీఎస్‌టీ నోటీసులు అందాయి. దీనివల్ల కర్ణాటక, పశ్చిమ బెంగాల్, కేరళ వంటి రాష్ట్రాల్లో ఏటీఎం విత్‌డ్రాయల్స్ అకస్మాత్తుగా పెరిగాయి. చిన్న వ్యాపారులు మళ్లీ నగదు వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
  • తక్కువ వడ్డీ రేట్లు: బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ రేట్లు తక్కువగా ఉండటంతో, ప్రజలు డబ్బును బ్యాంకుల్లో ఉంచడం కంటే అత్యవసరాల కోసం చేతిలో ఉంచుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు.
  • బంగారం విక్రయాలు: ద్రవ్యోల్బణం పెరగడం లేదా ఇతర అవసరాల కోసం గృహస్థులు బంగారం, వెండి విక్రయించి నగదు నిల్వలు పెంచుకుంటున్నారు.

యూపీఐ (UPI) ప్రభంజనం

డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐ అప్రతిహతంగా దూసుకుపోతోంది.మార్చి 2020లో కేవలం 140 కోట్లుగా ఉన్న నెలవారీ యూపీఐ లావాదేవీలు, డిసెంబర్ 2025 నాటికి 2,163 కోట్లకు చేరాయి.జనవరి 2026 గణాంకాల ప్రకారం, దేశంలో రోజుకు సగటున 70 కోట్ల యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయి.మొత్తం డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐ వాటా ఏకంగా 70-80 శాతానికి చేరింది.

నోట్ల వాటాలో మార్పులు

రూ. 2,000 నోట్ల ఉపసంహరణ తర్వాత, రూ. 500 నోట్ల ప్రాధాన్యత పెరిగింది. ఏప్రిల్ 2025 నుండి జనవరి 2026 మధ్య వీటి వాటా 4.4% పెరిగింది. అదే సమయంలో, రూ. 20 కంటే తక్కువ విలువ కలిగిన చిన్న నోట్ల వాటా క్రమంగా తగ్గుతోంది.

మొత్తం మీద దేశంలో ఒక నిర్మాణాత్మక మార్పు కనిపిస్తోంది. ప్రజలు భద్రత కోసం లేదా నిల్వ కోసం నగదును రికార్డు స్థాయిలో దగ్గర ఉంచుకుంటున్నప్పటికీ, రోజువారీ కొనుగోళ్లు మరియు ఆర్థిక కార్యకలాపాల కోసం మాత్రం డిజిటల్ వ్యవస్థలపైనే (ముఖ్యంగా యూపీఐ) ఎక్కువగా ఆధారపడుతున్నారు. ‘నగదు’ తన రూపాన్ని మార్చుకుంటూ కేవలం అత్యవసర నిధిగా మారుతుండగా, ‘డిజిటల్’ మాత్రం ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తోంది.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

PMFBY Crop Loss Reporting Rules for Hailstorm Damage

The weather office has warned of fresh hailstorms and...

Iran war leaves US oil and gas dealmaking ‘in paralysis’

Stay informed with free updatesSimply sign up to the...

From SEO And CRO To Agentic AI Optimization (AAIO)

For 25 years, we’ve built websites for humans who...