Telangana
oi-Bomma Shivakumar
ప్రస్తుతం ఉరుకుల పరుగుల లైఫ్ లో కాస్త విరామం దొరికినా చాలు టూర్ కు వెళ్తున్నారు. వీకెండ్ టూరిజం కూడా ఈ మధ్య కాలంలో పెరిగిపోయింది. అయితే సమ్మర్ లో దేశం దాటి ఇతర దేశాల్లో విహరించాలని ఉందా..? తక్కువ ధరకే ఇంటర్నేషనల్ టూర్ ను అందిస్తోంది ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(IRCTC).. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఇక్కడకు వెళ్లాలని కోరుకుంటారు. ఇక యువతకు అయితే ఇది ఫేవరేట్ డెస్టినేషన్ అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో అందుబాటు ధరలోనే థాయ్‌లాండ్ అందాల్ని ఆస్వాదించేందుకు ఓ ప్యాకేజీ అందిస్తోంది IRCTC. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
IRCTC టూరిజం “ట్రెజర్స్ ఆఫ్ థాయ్ లాండ్ ఎక్స్ హైదరాబాద్” పేరిట ఓ సరికొత్త ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీలో భాగంగా టూర్ మొత్తం 4 రాత్రులు, 5 పగళ్లు కొనసాగుతుంది. హైదరాబాద్ నుంచి విమాన ప్రయాణం ద్వారా ఈ టూర్ స్టార్ట్ అవుతుంది. ఈ టూర్ లో భాగంగా థాయ్ లాండ్ లోని ప్రముఖ టూరిస్ట్ కేంద్రాలు పట్టయ, బ్యాంకాక్ లో పలు ప్రదేశాలను తనివితీరా ఆస్వాదించవచ్చు.
టూర్ లో భాగంగా ఫస్ట్ రోజు హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి తెల్లవారుజామున 4 గంటలకు బ్యాంకాక్ కు విమాన ప్రయాణం స్టార్ట్ అవుతుంది. అలా మరుసటి రోజు ఉదయం 10 గంటలకు బ్యాంకాక్ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఆ తర్వాత దారిలో టైగర్ జూ ను సందర్శిస్తారు. ఇక సాయంత్రం జెమ్స్ గ్యాలరీ, అల్కజార్ షో ను వీక్షించి ఆ రాత్రికి పట్టయలోనే బస చేస్తారు.
ఇక రెండో రోజు కోరల్ ద్వీపంలో స్పీడ్ బోటింగ్, సాయంత్రం నుంగ్ నూచ్ గార్డెన్ ను సందర్శిస్తారు. మూడో రోజు సఫారీ వరల్డ్ టూర్, మెరైన్ పార్క్ చూస్తారు. అలా రాత్రి బ్యాంకాక్ లోనే స్టే ఉంటుంది. ఇక నాలుగో రోజు బ్యాంకాక్ సిటీలోని పలు ప్రాంతాలను సందర్శిస్తారు. ఆ తర్వాత గోల్డెన్ బుద్ధ, మార్బుల్ బుద్ధ ప్రాంతాలను సందర్శిస్తారు. ఇక చివరగా ఐదో రోజు ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. ఆ తర్వాత మధ్యాహ్నానికి హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
ఇక టూర్ ప్యాకేజీ ధరల విషయానికి వస్తే.. సింగిల్ షేరింగ్ కు రూ. 56,370 ఉంది. అలాగే డబుల్ షేరింగ్ కు రూ. 49,320 ఉంది. ట్రిపుల్ షేరింగ్ కు రూ. 49,210 గా ఉంది. ఇక ఈ ప్యాకేజీ సంబంధించిన పూర్తి వివరాలు, బుకింగ్ కోసం IRCTC అధికారిక వెబ్ సైట్ ను సంప్రదించొచ్చు.


