Ambati Rambabu: ఐ డోంట్ కేర్.. జైలు నుంచి బయటికి రాగానే అంబటి..!

Date:


Andhra Pradesh

oi-Syed Ahmed

సీఎం చంద్రబాబును దూషించిన కేసులో జైలుకు వెళ్లిన వైసీపీ నేత అంబటి రాంబాబు (Ambati Rambabu).. అనంతరం మరో రెండు కేసులు కూడా ఎదుర్కొని,చివరికి అన్ని కేసుల్లోనూ బెయిల్ రావడంతో ఇవాళ రాజమండ్రి జైలు నుంచి బయటపడ్డారు. ఈ సందర్భంగా 18 రోజుల తర్వాత జైలు నుంచి బయటికి వచ్చిన అంబటి రాంబాబుకు మాజీ మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, తానేటి వనిత, మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా,చెర్ల జగ్గిరెడ్డి, మాజీ ఎంపీ వంగా గీత స్వాగతం పలికారు.

అనంతరం పార్టీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడిన అంబటి రాంబాబు.. తనపై నమోదైన కేసులు రాజకీయ కక్షసాధింపే అన్నారు. తన ఇంటిపై దాడులు, కుటుంబ సభ్యులపై బెదిరింపులు, ఆస్తుల ధ్వంసం జరిగినప్పటికీ తనను జైలుకు పంపించారన్నారు. అన్యాయంగా, అక్రమంగా జైల్లో పెట్టారని, అయినా ఐ డోంట్‌ కేర్‌’ అంటూ తాను ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గబోనని తేల్చిచెప్పారు. రాజకీయ ఒత్తిళ్లకు భయపడే వ్యక్తిని కాదని, తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

జైలుకు వెళ్లేటప్పుడు సంతోషమే, వచ్చేటప్పుడు సంతోషమేనని ఈ సందర్భంగా అంబటి వ్యాఖ్యానించారు. ఇది పోలీసులు, కూటమి నేతలు కలిసి చేసిన ప్రయత్నమని, 18 రోజులు జైల్లో పెట్టితే భయపడతానని అనుకున్నారేమో గానీ, తనకు భయం లేదన్నారు. ఎన్ని కేసులు పెట్టినా ఒక్క అడుగు కూడా వెనక్కి వేయనని, ఈ పోరాటం ఆగదని తెలిపారు. జైలు జీవితం తనకు కొత్త కాదని, రాజమండ్రి సెంట్రల్‌ ప్రిజన్‌ పట్టుదల పెంచే శిక్షణ కేంద్రం లాంటిదన్నారు.

చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పుడే జైల్లో ఉండటానికి సిద్ధపడ్డానని, చంద్రబాబు, లోకేష్‌ ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారని, పరిస్థితులు తప్పకుండా మారుతాయని అంబటి తెలిపారు. వారు చేసిన పాపానికి పరిహారం తప్పదన్నారు. ఏదైనా కాలమే నిర్ణయిస్తుందన్నారు. దాడి చేసిన వారికి స్టేషన్‌ బెయిల్‌ వచ్చిందని, దాడికి గురైన తనకు 18 రోజుల జైలు తర్వాత బెయిల్‌ వచ్చిందన్నారు. తానెక్కడా తప్పు చేయలేదని, తప్పు జరిగితే వెంటనే పశ్చాత్తాపపడతానన్నారు. గుండెలో ప్రాణం ఉన్నంత వరకు జగన్‌ వెనకే ఉంటానని,మొత్తం ఘటనపై ప్రజల ముందుకు పూర్తి వివరాలు తీసుకువస్తానన్నారు. పత్రికల్లో వచ్చిన ప్రతి అంశంపై సమాధానం చెబుతానన్నారు. పైన దేవుడున్నాడు, ధర్మమే గెలుస్తుందన్నారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related